నీచునకు ధనము గల్గిన .................
>> Wednesday, March 7, 2012
నీచునకు ధనము గల్గిన
వాచాలతగల్గి పరుష వాక్కులరచుచున్
నీచ కృతి యగుచుమది సం
కోచము లేకుండ దిరుగు గువ్వలచెన్నా !
[నీచుడైన వానికి సంపద అబ్బితే నోటి దురుసుతనంతో దుర్భాషలాడుతూనే ఉంటాడు .మనసులో పాప భీతి లేకుండా నీచంగా తిరుగుతాడు ]




0 వ్యాఖ్యలు:
Post a Comment