పెద్దరికం కావాలంటే...............
>> Wednesday, March 7, 2012
ఎద్దులవలె బలు వృక్షపు
మొద్దులవలె నర్ది జూచి ముదమందనియా
గద్దల గంపల కెక్కడి
గద్దెరికము కుందవరపు కవి చౌడప్పా !
పెద్దరికం కావాలంటే ఎదుటివారిని గౌరవించి దానధర్మములు చేయాలి .కాని అడగవచ్చిన సామాన్యున్ని ఎద్దులలాగా ,చెట్ల మొద్దులలాగా
చూసే గద్దల [మూర్ఖుల ] వంటి వాళ్లకు పెద్దరికం ఏ విధంగా వస్తుంది ?




1 వ్యాఖ్యలు:
మానవుడు అజ్ఞానవశమున తన్ను మించినవాడు లేడని మిడిసి పడుచుండును.
అధికార గర్వముచే ,ధనమదముచే,సౌందర్యమదముచే,పాండిత్య దర్పముచే,
ఎదురు వానిని లెక్కచేయక తన్ను మించినవాడు త్రిభువంబున లేడని ప్రవర్తించుచుండు,
దీనికి కారణం పెద్దల సాంగత్యం లేకుండుటయే .
Post a Comment