హాపీ! న్యూ ఇయర్ అంటే ఇదీ !
>> Friday, March 23, 2012

హాపీ ! న్యూ ఇయర్ ..హాపీ న్యూ ఇయర్.
నందన నామ సంవత్సరాన .చెబుతున్న ....హపీ న్యూ ఇయర్
హాపీ అంటే సంతోషం కదా ?
ఎవరికి సంతోషం ?
చెప్పేవాల్లకా ? వినేవాళ్లకా ?
సంతోషానికి నిజమైన అర్ధమేమిటంటే .....! సమస్త ప్రకృతికి ఎప్పుడు ఆనందకరమవుతుందో అప్పుడు అది సంతోషమనే పదానికి సరిపోతుంది.
ఇప్పుడు ఉగాది నాడు నూతన సంవత్సరశుభాకాంక్షలు అని మనం చెప్పుకుంటున్నాం కదా .ఇది అందరికీ సంతోషమేనా .
సంతోషమే ?
ఎలా ?
ఇప్పుడు ప్రకృతి పరవశించి నవవసంతం వికసిస్తోంది . లేలేత చిగురులు తిని కోకిల కుహూ..కుహూ అని కుస్తోంది.
ఇక అర్ధరాత్రి దాకా నిశాచరుల్లా తిరుగుతూ వేచి ఉండి వెర్రికేకలతో,భీభత్స శబ్దాలతో ఎవరూ హాపీ న్యూ ఇ యర్ ...అంటూ పిచ్చెక్కిపోరు. మందు విందు ,,,పిచ్చిచిందులతో కల్లుతాగినకోతిలా ప్రవర్తించరు.
ప్రశాంతం గా మేల్కాంచి ప్రభాతభానునుకి నమస్కరిస్తూ ..అభ్యంగన స్నానాలు ....ఆనందపు కేరింతలు...షడ్రుచుల భోజనాలు .బంధువులు, స్నేహితులతో ఆప్యాయతానురాగాల సమ్మేళనాలు. ఇదీ పండగంటే . ఇదీ సంతోషమంటే .
ఇదీ పండగంటే ...
ఇక్కడ అందరికీ ప్రమోదమే తప్ప ఎవ్వరికీ ప్రమాదం లేదు .
వినోదమే తప్ప ఈ ఆచారలలో విషాదాలకు తావు లేదు.
ఆచరించినవారికీ ఆచరించనివారికి కూడా ఆనందమే తప్ప ఆవేదన ,ఆవేశం.ఆక్రోశాలు ఏ కోశానా రావు . పండగంటే ఏమిటో చూపిన మన భారతీయసంస్కృతికి ప్రతీక ఈ ఉగాది. ఇది యుగాది.
ఇప్పుడు చెప్పండి అందరికీ . హాపీ న్యూ ఇయర్.
నూతన సంవత్సర శుభాకాంక్షలు .




0 వ్యాఖ్యలు:
Post a Comment