గుర్తెరుగక గర్వ మొందకుము కుమారా !
>> Tuesday, March 6, 2012
అల సరసాన్నంబు బరి
మళము గలుగు వస్తువులను మహితల యానం
బుల నాసనములు నుబ్బకు
కలుగుం జనుకాలవశము గాను కుమారా !
ఈ భూమి యందు యోగ్యమైన అన్నము పరిమళ ద్రవ్యంబులు ,వాహనములు,ఆసనములు అనునవి కాలము ననుసరించి కలుగుచుండును .కాలమందు వశమై తొలగిపోవును .కనుక అటువంటివి లభించినను పొంగిపోకు ,గర్వమునకు లోనుకాకు కుమారా !




0 వ్యాఖ్యలు:
Post a Comment