హనుమత్ రక్షాయాగం [2012] కార్యనిర్వాహకవర్గ సూచనలు
>> Wednesday, March 28, 2012

హనుమత్ రక్షాయాగం [2012] కార్యనిర్వాహకవర్గ నిర్ణయములు
స్వామి అనుగ్రహం వలన ఈ యాగ నిర్వహణలో మొదటిదశగా కోటిచాలీసా పారాయణ విజయవంతంగా సాగుతున్నది. దేశవిదేశాలనుండి భక్తులు యాగం లో చాలీసా పారాయణద్వారా భాగస్వాములయ్యారు. ఇక పూర్ణాహుతి కార్యక్రమానికి
సంబంధించిన ఏర్పాట్లు గూర్చి 'కార్యనిర్వాహకవర్గం" సమావేశమై తీసుకున్న నిర్ణయాలివి.
౧. యాగంలో పాల్గొననున్న భక్తులందరికీ ఎక్కడా ఏ ఇబ్బందీ లేకుండా చూడటం.
౨. మే 15 న హనుమజ్జయంతి సందర్భంగా హనుమత్ స్వామికి 108 కలశములతో వివిధ పవిత్రద్రవ్యములతో అభిషేకం. ప్రత్యేక అర్చనలు .
సాయంత్రం . పీఠంలో కొలువై వున్న శ్రీవేంకటేశ్వర స్వామివారికిదేవేరులకు మరియు శ్రీ రామలింగేశ్వరులకు,దుర్గాపరమేశ్వరి అమ్మవారలకు కళ్యాణోత్సవం నిర్వహించటం .
౩ . మే 16 న 108 యజ్ఞకుండిలతో పూర్ణాహుతి యాగాన్ని నిర్వహించటం జరుగుతుంది.
ఒక్కో యజ్ఞ కుండి దగ్గర దంపతుల కుమాత్రమే అనుమతి
స్త్రీలతో కలసి యాగానికి వచ్చు వారికి ఇబ్బందులేమీ ఉండవు.
రూటు ః గుంటూరు -కర్నూల్ ప్రధాన రహదారిపై గల వినుకొండ పట్టణానికి 18 km రహదారిపై నేరవ్వవరం గ్రామంలో పీఠం ఉంటుంది. వినుకొండ నుండి బస్సులు జీపులు ఆటో సౌకర్యములున్నవి.
హైదరాబాద్ వైపునుంఛి వచ్చేవారు నేరుగా నాగార్జునసాగర్ మీదుగా మాచర్ల వినుకొండ చేరుకోవచ్చు.
రాయలసీమ వైపునుంచి వచ్చేవారు గుంతకల్లు... గుంటూరు రూట్లో ఉన్న వినుకొండ రైల్వేస్టేషన్ లో దిగాలి
అలాగే కర్నూల్-గుంటూరు నేషనల్ హైవే లో వినుకొండ లో దిగాలి
మద్రాసు వైపునుంచి వచ్చేవారు ఒంగోలు వచ్చి అక్కడనుండి అద్దంకి వచ్చి పీఠానికి చేరుకోవచ్చు
విశాఖ పట్నం --విజయవాడ వైపునుంచి వచ్చేవారు గుంటూరు మీదుగా వినుకొండ రైల్లో బస్సులో చేరుకోవచ్చు
విశాఖ ..బెంగలూర్ ..పుట్తపర్తి వెళ్ళె ప్రశాంతి ఎక్స్ ప్రెస్ వినుకొండలో ఆగుతుంది
వినుకొండ నుండి పీఠం తరపున జీపు ఒకటి ఏర్పాటు చేసి ఉంచుతాము కనుక దానిపై పీఠానికి చేరుకోవచ్చు.
ప్రయాణంఅయ్యాక ఫోన్ లో సంప్రదిస్తుంటే కార్యకర్తలు మీకు సరైన మార్గాన్ని తెలియపరస్తుంటారు
బి. శ్రీనివాసరావు [నెల్లూరు]




0 వ్యాఖ్యలు:
Post a Comment