ఈ అకాలవైపరీత్యాలవలనవచ్చే నష్టాలనుండి రైతులను కాపాడేదెవరు ?
>> Tuesday, January 10, 2012
ఈ అకాలవైపరీత్యాల నష్టాలనుండి రైతులను కాపాడేదెవరు ?
ప్రకృతిమాత కోపం శాపమవుతున్నది .ఆరుగాలం శ్రమించిన రైతుకు నేడు కురుస్తున్న అకాలవర్షాలు వేదన మిగులుస్తున్నాయి. .ఎంత నష్టం వచ్చినా భూమి తల్లిని నమ్ముకుని పంటపండించి పదిమందికి పట్టెడన్నం పెడుతున్న అన్నదాత అర్ధాకలితో మిగిలిపోతున్నాడు. ఇక ధర్మహీనులైన రాజులు వారి పాలన ,జనులలో వ్యాపిస్తున్న హీనభావజాలం , పెరుగుతున్న చెడువ్యసనాలు సామూహికపాపమై భూమికి భారమై కీడొనరిస్తున్నాయి . తల్లీ !శాంతించమని వేడుకోవటం భగవత్ నామస్మరణం మినహా మరోమార్గంలేదు. ప్రకృతి కరుణ కోల్పోకుండా మన నడక నడవడి సరిచేసుకోవాల్సినదే. రైతులకు కలుగుతున్న దుఃఖాన్నిపంచుకుంటూ .........వారిని కరుణించమని కోరుతూ జగన్మాతను వేడుకుంటున్నాము.
0 వ్యాఖ్యలు:
Post a Comment