పలనాటి వీరాచార పీఠాధిపతులు "హనుమత్ రక్షాయాగం" లో పాల్గొననున్నారు
>> Monday, January 9, 2012
భారతదేశ చరిత్రలో పలనాటి చరిత్ర ఓ విశిష్టతనుసంతరించుకున్నది. కులదురాచారాలను ఖండిస్తూ బ్రహ్మనాయుడు నడిపిన ధర్మపోరాటం ,చాపకూటి సిధ్ధాంతం లోకోత్తరమైనవి . చెన్నకేశవ ఆరాధన తోపాటు పలనాటి యుద్దంలో ప్రాణాలర్పించిన మహావీరులనుకూడా స్మరిస్తూ ఉత్సవాలు జరుపుతుంది పలనాటి వీరాచారపీఠం . మాలకన్నమదాసును పెద్దకొడుకుగా దత్తతతీసుకుని ఆదరించిన బ్రహ్మనాయుడు నెలకొల్పిన వీరాచారపీఠ ఆచారపరులు ఈనాటికీ కన్నమదాసుకుకూడా పూజజరుపుతారు. నాడు బ్రహ్మనాయుని చే స్థాపించబడ్డ ఈపీఠానికి ప్రస్తుతం తేజస్వి ,బాలుడగు తరుణ్ చెన్నకేశవ అయ్యంగార్ పీఠాధిపతి . అన్నికులాలలోనూ వీరాచారవంతులు నేటికీ తమకు నాటినుంచి పరపరానుగతంగా వస్తున్న ఆచారాలను ఆయుధాలను వదలలేదు.
నేడు ధర్మ రక్షణకు ,భక్తజనక్షేమమునకై సంకల్పించిన "హనుమత్ రక్షాయాగం" లో పాలుపంచుకోవటానికి ముందుకు వచ్చారు. ఈయాగంలో కోటిచాలీసా పారాయణ సాధనలో తామూ పాల్గొంటామని తెలిపారు.
జై చెన్నకేశవా !
1 వ్యాఖ్యలు:
కాటమరాజు కధల్లో , చిన్నవాడైన పుత్తమరాజు కూడా చెన్నకేశవస్వామి వరాన పుట్టినవాడే, ఉక్కురెక్కల గుర్రం పై స్వారీ చేస్తూ
"నమ్మినాను నీనామము, పట్టినాను నీ పాదము!
పట్టినాను నీ పాదము, పెట్టినాను తిరునామము!!"
అంటూ ఆయన చేసిన కీర్తన మా ఇళ్ళలో చాలా ప్రసిద్ధం.
జై చెన్నకేశవా! జై శ్రీరామ, జై శ్రీ ఆంజనేయం.
Post a Comment