హనుమన్నామగానంతో దరిశి పట్టణం లో దశదిశలూ మార్మోగాయి ఈవేళ
>> Saturday, November 12, 2011
ప్రకాశం జిల్లా దరిశి పట్టనంలో ఈరోజు హనుమన్నామంతో దశదిశలూ మార్మోగాయి. స్థానిక హనుమద్దీక్షాధారులు దరిశి పదరిశి పట్టణవాసుల క్షేమమునకై శ్రీవేంకటేశ్వర జగన్మాతపీఠం పర్యవేక్షణలో సామూహిక హనుమదహిషేకములు నిర్వహించారు . ఉదయం ఐదుగంటలనుండే రుద్రసూక్త మన్యుసూక్తపారాయణములతో స్వామి అభిషేకములు మొదలయ్యాయి . దీక్షాధారులు నూటాఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా పారాయణం సాగిస్తుండగా వేలాదిగా తరలివచ్చిన భక్తులు ,పాలు,కొబ్బరినీళ్ళు హనుమత్సేవాసమితి వారందించిన పుణ్యగంగానదీ జలాలతో స్వయంగా స్వామిని అభిషేకించుకుని తన్మయులయ్యారు . భారీగా తరలివస్తున్న భక్తులకు ఇబ్బందులు కలుగకుండా దీక్షాధారులు వరుసలో పంపుతూ ఎటువంటి వత్తిడి కలుగకుండా భక్తులు అభిషేకించుకునే విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు . గతంలో పదమూడు సంవత్సరాలక్రితం నేను స్వామి అనుగ్రహంతో ఈ గ్రామంలో ఈకార్యక్రమాన్ని నిర్వహించాను. మరలా ఇన్నాల్లకు స్వామి అనుగ్రహంతో ధనిక,పేద, వర్గ ,మత విబేధాలులేకుండా అందరిస్వామి అగు ఆంజనేయుని పూజ జరింపించేలా ఆయన అనుగ్రహించారు. ఈసందర్భంగా స్వామి రక్షలను ప్రసాదంగా ఇచ్చిఅలాగే హనుమాన్ చాలీసా ప్రతులను అందజేయటం జరిగింది. జీవితంలో పలుసమస్యలను చాలీసా పారాయణమ్ తో ఎలాపరిష్కరించుకోవచ్చునో వివరించటం జరిగింది .
1 వ్యాఖ్యలు:
రామభక్త హనుమాన్‍కీ జై.
Post a Comment