నాగులచవితి
>> Saturday, October 29, 2011
శ్రీ గురుభ్యోన్నమః
శ్రీ సాయినధాయనమః
భాగవతులకు నమస్కారములు. దీపావళి శుభాకాంక్షలు.
ఈ అక్టోబరు నెలలో ముఖ్యమైన రోజులు వాటి వివరం "మంచి మాట" గా శ్రీ సాయిపధం మీకు అందిస్తోంది.
రేపటి నుంచి కార్తీకమాసం మొదలు. కార్తిక మాస వైభవం, కార్తిక సోమవారాలు, కార్తిక పౌర్ణిమ, మరిన్ని వివరాలు, మనం ఎవరికి తెలిసినవి వారు, మన సత్సంగ్ సభ్యులతో పంచుకొనే ప్రయత్నం చేద్దాం.
ఈ నెల ఇరవై ఏడవ తేది - బలి పాడ్యమి - ఈ రోజు బలిచక్రవర్తిని పూజించే ఆచారం ఉంది. ముఖ్యంగా ఈ నాడు భావతంలోని "వామన అవతార ఘట్టం" స్మరణ / పారాయణ గా చేయటం చెప్పబడి ఉంది.
ఇరవై ఎనిమిదవ తేది - భగినీ హస్త భోజనం : పురుషులు, వారి వారి సోదరి / సోదరి సమానులైన వారి ఇంటికి వెళ్లి భోజనం చేయాలని శాస్త్ర వచనం. అలా చేయటం వాళ్ళ అపమృత్యు భయం తొలగిపోయి, ఆయురారోగ్యాలతో వర్దిల్లుతారని ప్రతీతి.
ఇక, ముప్పయ్యవ తేది - నాగుల చవితి. కార్తీక శుద్ధ చవితి నాడు, ఈ నాగుల చవితిని జరుపుకుంటారు. అయితే, శ్రావణ శుద్ధ పంచమి "నాగ పంచమిగా" చాల చోట్ల జరుపుకోవడం తెలిసిందే.
అయితే, ఈ నాగుల చవితి పర్వదిన వివరం తెలుసుకుందాం.
నాగుల చవితి లేదా నాగుల పంచమి నాడు పూజించే నాగేంద్రుని సుబ్రహ్మణ్య అవతారం గా పూజిస్తారు.
ఈ నాగుల చవితి పండగ నాడు, పెద్దలు, పిన్నలు, తెల్లవారుఝామున లేచి, తలంటి స్నానం చేసి, బెల్లం తో చేసిన చనివిడి, చిమ్మిలి (బెల్లం, నువ్వులపప్పు/నల్లనువ్వులతో చేసే ప్రసాదం), ఆవు పాలు, నాగుల గావంచా (అంటే, ఎర్రని గళ్ళతో ప్రత్యేకం గా దొరికే, తువ్వాలు బట్ట), వీటిని సిద్ధం చేసుకొని, తోటలలోని, ఊరిలోని ఏదేని ఆలయంలోని పుట్ట వద్దకు కుటుంబమంతా వెళ్లి , పుట్టలో పాలు పోసి, చనివిడి, చిమ్మిలి, చిన్న చిన్న ఉండలుగా చేసి, పుట్టలో వేసి, హారతి వెలిగించి, నాగేంద్రుని మనసారా పూజ చేసే ఆనవాయితి మన రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో సంప్రదాయంగా ఉంది. దీనికి ప్రత్యెక పూజ విధానం లేదా మంత్ర వివరం లేకపోయినా, ఈ క్రింది వాక్యాలు నాగెంద్రునికి విన్నవించే అమాయకపు పరిపూర్ణ భక్తి, విశ్వాసం ప్రస్పుటం గా కనపడుతుంది. నిజంగా ఈ ప్రార్ధన చేస్తుంటే, ఏదో తెలియని అనుభూతి పిల్లలోను, పెద్దలలోను కలుగుతుంది. అలాగే, దీపావళికి కొన్న మతాబులు, చిన్న చిన్న టపాకాయలు, తీసుకెళ్ళి పూజ అనతరం వేడుక గా, వెలిగించి, నాగాన్నకు పండగ ఉత్సవాని జరపడం కూడా ఆనవాయితీగా ఉంది. దీపావళి
...అంతర్జాలంనుంచి
0 వ్యాఖ్యలు:
Post a Comment