శ్రీవారికి శిరోభారం....[.గాలి బాబులకిరీటం]
>> Tuesday, September 6, 2011
శ్రీవారికి శిరోభారం
తిరుమల, సెప్టెంబరు 5: తిరుమల శ్రీవారికి 'గాలి బ్రదర్స్' సమర్పించిన వజ్ర, స్వర్ణ కిరీటం శిరోభారం అవుతుందన్న కారణంగా స్వామివారి అలంకరణకు నోచుకోవడం లేదు. కారణమేదైనా అక్రమార్జనతో సమర్పించిన కానుకలపై స్వామివారు అయిష్టం చూపారనే ప్రచారం జరిగింది. నిజానికి స్వామివారికి దాతలు సమర్పించిన కానుకలు తరచూ అలంకరిస్తూ ఉంటారు. 2009వ సంవత్సరంలో గాలి సోదరులు రూ. 45 కోట్ల విలువైన వజ్ర, స్వర్ణ కిరీటాన్ని శ్రీవారికి కానుకగా సమర్పించారు. ఆ ఒక్క సారి మాత్రమే కిరీటాన్ని అలంకరించారు. అప్పటికే గాలి సోదరులపై అక్రమ మైనింగ్‌కు సంబంధించి ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఆ కిరీటం స్వామివారికి భారమవుతుందన్న ఆగమ పండితుల సలహాతో దీనిని పక్కన పెట్టడం జరిగింది. అనంతర కాలంలో టీటీడీ సాధికారిక మండలి విరాళాల స్వీకరణపై నిబంధనలు మారుస్తూ తీర్మానం చేసింది. శ్రీవారికి అవసరమైన ఆభరణాలను కావలసిన సమయంలో మాత్రమే దాతల సహకారంతో విరాళంగా స్వీకరించాలన్న నిర్ణయానికి వచ్చింది. సోమవారం గాలి జనార్దన రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేయడంతో తిరుమలలో పలుచోట్ల ఈ విషయాలన్నింటినీ చర్చించుకోవడం కనిపించింది.
0 వ్యాఖ్యలు:
Post a Comment