శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

తల్లీ! నిన్నుదలంచి..............

>> Friday, January 21, 2011


తల్లీ! నిన్నుదలంచి పుస్తకము చేతం బూనితిన్ నా
యుల్లంబందున నిల్చి జృంభణముగా సూక్తుల్ సుశబ్దంబు శో
భిల్లం బల్కుము నాదువాక్కునను సంప్రీతిన్ జగన్మోహినీ
పుల్లాబ్జాక్షి సరస్వతీ భగవతీ పూర్ణేందు బింబాననా !


[విద్యార్ధులు ప్రతి రోజూ ఉదయం శ్రీ సరస్వతీ దేవికి నమస్కరించి ఇలా ప్రార్ధించుకుంటే చదువులో పరీక్షలలో రాణిస్తారు]

1 వ్యాఖ్యలు:

చింతా రామకృష్ణారావు. January 21, 2011 at 11:47 PM  

చదువుల తల్లి శారదను చక్కగ మానసమందునిల్పి స
మ్ముదమున విద్యలన్ గరయ పుణ్యము, విద్యయులభ్యమౌను. దు
ర్మదమడగున్.వికాసయుత మానసయుక్తులమౌదుమయ్య. మీ
మదిఁ గలభావమున్ గనుచు మన్ననతో చరియింప మేలగున్.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP