శరన్నవరాత్రి సాధనా శిబిరం లో పాల్గొనండి .. అమ్మ అనుగ్రహం పొందండి
>> Friday, September 24, 2010
శరన్నవరాత్రులలో సాధనా శిబిరానికి ఆహ్వానం
8-10 -2010 to 17-10-2010
సాధకులకు శరన్నవరాత్రుల సమయం ఒక ద్భుతమైన అవకాశం . దుష్ట శిక్షన చేసి లోకాన్ని రక్షించిన జగజ్జనని దివ్యానుగ్రహం పరిపూర్ణం గా వర్షించే సమయమిది. సాధకులు తమ జీవితం లో అన్ని విషయాలలో వివిధ ఆటం కాలను తొలగించుకుంటూ జయాన్ని పొందటానికై చాలా మంచి సమయం . కనుకనే అనాదిగా ఈ శరన్నవరాత్రులకాలం లో మంత్రజపధ్యానాదులద్వారాను,వివిధ రీతుల అమ్మను అర్చించుటద్వారాను యజ్ఞయాగాదులద్వారా వివిధ సాంప్రదాయకులు సాధనలు సాగిస్తారు. ఇక మనబోటి సామాన్య భక్తులు అమ్మా! అని ఆర్తితో పిలిస్తే చాలు ఆప్రేమకు కరిగిపోయి కదలివచ్చి కాపాడే దయామయి అమ్మ .
జీవితం లో వివిధ సమస్యలతో విసిగి వేసారుతున్నవారు , తమ కార్యరంగాలలో విజయాన్ని కాంక్షించేవారు ఈనవరాత్రులలో భక్తిగా అమ్మను సేవించుకునేందుకు సాధనా శిబిరాన్ని" శ్రీ వేంకటేశ్వర జగన్మాత పీఠం " లో నిర్వహించటం జరుగుతున్నది . హరిహరసమేతంగా అమ్మవారు కొలువైన ఈ సిధ్ధపీఠం లో వివిధ సాంప్రదాయకులంతా సాధనలకు నిర్విఘ్నంగా కొనసాగించుకొనవచ్చు . అనేకమంది భక్తులు పీఠం లో నవరాత్రులలో సాధన జరుపుకుని తమ సమస్యలనుండి విముక్తులయ్యారు. జాతకకారణాలరీత్యా వివాహం ఆలస్యమయినవారు .ఉద్యోగ వృత్తులలో ను కుటుంబజీవనం లోనూ సమస్యలను అమ్మ అనుగ్రహాన్ని పొందటం ద్వారా పరిష్కరించుకున్నవాళ్ళు ఉన్నారు. స్త్రీలకు కూడా సాధనకు ఇబ్బమ్దులేమీ లేవు . మాకుటుంబసభ్యులతో కలసిఉండటం వలన వాల్లకు సాధనకు గాని ఇక్కడ ఉండటానికి గాని ఇబ్బందులు ఉండవు .
కాకుంటే సాధనకు వచ్చేవారు కొన్ని విషయాలు తెలుసుకోవాలి . సాధకులు ఇక్కడ పీఠం లో వివిధ సేవాకార్యక్రమాలలో తమ సేవలనందించాలి. ఉదాహరణకు ఇక్కడకొచ్చి వెళ్ళే భక్తులకు భోజనం వడ్డించడం విస్తర్లు తీసివేయడం శుభ్రపరచడం లో భేషజాలకు పోకుండా పాల్గోవాలి . ఇలాచేయటం మనకు సాధనరీత్యాకూడా మేలు కలిగిస్తుంది .అలాగే తమ స్వంతపనులు తామే చేసుకోవాలి. భోజనం చేసిన పాత్రలు అవీ స్వంతగా శుభ్రపరచాలి . సాధ్యమైనంతవరకు మనం ఒకరికి సేవచేయాలే గాని ఇతరుల సేవలు పొందటానికి ప్రయత్నించరాదు .
అలాగే మాతో పాటే సామాన్య భోజనం మాత్రమే భుజించవలసి ఉంటుంది . తప్పనిసరిగా నేలమీదే నిద్రించవలసి ఉంటుంది . అందుకొరకు రెండు దుప్పట్లు తెచ్చుకొనవలసి ఉంటుంది . ఆరోగ్యసమస్యలు చలిగాలి పడనివారు , తప్పనిసరిగా ఔషధములు సేవించవలసినవారు రాకుంటేనే మేలు . ఎందుకంటే వైద్యసేవలకు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్లడానికి వాహన సౌకర్యం లేదు .అలాగే మననుంచి మిగతావారి సాధనకు భగం కలిగించరాదు . భగవత్ సేవ ధ్యానం .మిగతా సమయం పారాయణాదులో లేక మౌనంగా ఉండటమే చేయాలి . అనవసరంగా ముచ్చట్లవలన మీకు ,ఇతరులకు సాధనకు భంగం కలుగుతుంది అని గమనించాలి. మీ వెంట మీ రేషన్ కార్డు గాని ఓటర్ గుర్తింపు కార్డుగాని ఫోటో స్టాట్ కాపీ తీసుకురావాలి .
సాధన తొమ్మిదిరోజులుగాని ఐదురోజులుగా గానీ .ముఖ్యమైన చివరి మూడురోజులుగాని సాధనకు రాదలచినవారు ముందుగా తెలియజేయవలసి ఉంటుంది . ఇందుకొరకు మీరేమీ చెల్లించవలసిన అవసరం లేదు . ఆడపిల్లలు వారి కుటుంబసభ్యులింకెవరినైనా వెంటతెచ్చుకున్నా అభ్యంతరం లేదు . చిన్నపిల్లలతో ఒక్కరోజు వచ్చి పూజలో పాల్గొని వెళ్లటానికి తో ఇబ్బందిలేదుకానీ సాధనలో పాల్గొనటానికి మీకు ఇబ్బంది . . ఈ సాధనా శిబిరం లో పాల్గొనటానికి మీరెవరికీ ఏమీ చెల్లించవలసిన అవసరం లేదు . కాకుంటే మీరు పాల్గొనదలచుకున్న పూజలకు కావలసిన పూజా ద్రవ్యములు మీరే తెప్పించుకొనవలసి ఉంటుంది.
ఇక ఇక్కడ అమ్మకు జరిగే అభిషేకములు , పుష్పాలంకారములు , యజ్ఞములు ,అన్నదానములలో తమతరపున సేవలు జరిపించకొనదలసినవారు వారి గోత్రనామాలు పంపినచో వారి కోరికమేరకు వారి పేరుపై ఆయా సేవాకార్యక్రమములు జరుపబడుతాయి.
మనసు నిర్మలంగా ఉంచుకుని ఎదుటివారంతా అమ్మ ప్రతిబింబాలని భావిస్తూ సేవచేస్తే ఆనందసాగరమైన అమ్మ మనసు బిడ్దలమైన మనపై ప్రేమవర్షాన్ని కురిపిస్తుంది . మనసమస్యలన్నీ పెనుగాలికి మేఘాలు చెల్లాచెదరైనట్లు తొలగిపోతాయి. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని నమ్మండి .
సంప్రదించవలసిన నంబర్ ; 9948235641
సాధనా శిబిరంలో ఉదయం నాలుగున్నరకు నిద్రలేవాలి . స్నానాదులు పూర్తిచేసుకుని అమ్మవారి అభిషేకసేవలోను ,పూజలలోను .కుంకుమాది అర్చనలలోనూ ,పారాయణాదులలో పాల్గొనవచ్చు . లేదా ధ్యానయోగులైతే ఆవరణలోని వృక్షముల నీడలోనో ధ్యానం చేసుకొనవచ్చు . అమ్మవారి కి ప్రథమ పూజజరిపి నివేదన జరిపినదాకా సాధకులెవరూ పచ్చిమంచినీళ్ళుకూడా ముట్టరాదు .ఆతరువాత మీ ఆరోగ్యస్థితి ననుసరించి అల్పాహారమో, టీ నో తీసుకుని మిగతా పూజలలో పాల్గొనవచ్చు . మేము మాత్రం [నేను నాతో పాటు ఉండే కుర్రాళ్ళు ]పూజపూర్తయ్యినదాకా ఏమీ తీసుకోము అది మా అలవాటు.
3 వ్యాఖ్యలు:
ఆర్యా! నమస్తే.
శారద బ్రహ్మబోధన విశారద సద్గురు దుర్గ భక్తునిన్
ధీరుని;లోక బాంధవుని; దీపిత దుర్గ ప్రపూజ్య నామునిన్
ప్రేరణఁ గొల్పుచున్ పరమ ప్రీతిని గాచుచు మంగళప్రదం
బౌ రమణీయపూజలను భక్తిగ చేయగఁ జేయుఁ గావుతన్.
చింతా రామ కృష్ణా రావు;
కౌశికస గోత్రము;
అర్థాంగి:- విజయ లక్ష్మి.
మంచి ప్రయత్నం. తప్పకుండా ప్రయత్నిస్తాను రావడానికి.
durgeswar garu
namastE! I request you to pl. allow me to send my details for puja to Divine Mother.
Name : Neeladri Rao, Sesirekha, SriAurobindo, Sriram
Gotra : Kowsikasa
Place : Chennai.
humbly
sesirekha.
Post a Comment