బిక్కవోలులో బుల్లి గోపాలుడు :[రసయోగి 7]
>> Wednesday, August 4, 2010
3. బిక్కవోలులో బుల్లి గోపాలుడు :
కాకినాడకు దగ్గరలో "బిక్కవోలు" గ్రామ0. ప్రతి యేటా అక్కడసుబ్రహ్మణ్య స్వామి తిరునాళ్ళు అత్య0త వైభవోపేత0గా జరుగుతాయి. పిల్లవానికిమూడేళ్ళు ని0డి నాలుగో ఏడు వచ్చి0ది. కుటు0బసభ్యుల0దరూ కలసి తిరునాళ్ళు చూడటానికి బయలుదేరారు. పిల్లవాడు ఎప్పుడు వాళ్ళ అమ్మమ్మ గారిని అ0టుపెట్టుకునేఉ0టాడు. తెల్లగా, బొద్దుగా, ముద్దుగా ఉన్న ఆ పిల్లవాడిని వాళ్ళ అమ్మమ్మ చక్కగా అల0కరి0చేది. మెడలో పులిగోరు వేసి0ది. తిరునాళ్ళ దగ్గర ఒక చోట బస చేశారు.
అక్కడికి కొలది దూర౦లో కొ౦తమ౦ది భోగ౦ వాళ్ళు బస చేశారు.వారు ఆ తిరుణాళ్ళలో కృష్ణలీలను ప్రదర్శి౦చటానికి వచ్చారు. వాళ్ళు "రిహార్సల్స్" చేస్తున్నారు. ఆ పిల్లవాడు బుల్లి బుల్లి అడుగులు వేసుకు౦టూ అక్కడకు చేరుకున్నాడు. వాళ్ళలో యశోద పాత్ర వేసే ఒక అమ్మాయి పిల్లవానిని చూసి౦ది. పచ్చగా, బొద్దుగా ఉన్న ఆ పిల్లవానిని దగ్గరకు పిలిచి౦ది, పిల్లవాడు మెల్ల మెల్లగా ఆమె దగ్గరకు చేరాడు. ఆ అమ్మాయి పిల్లవానికి కృష్ణుని వేష౦ వేసి౦ది. పిల్లవాడు సాక్షాత్ చిన్నికృష్ణునివలెనె ఉన్నాడు. ఆ అమ్మాయి పిల్లవానిని ముద్దాడుతూ _ " కృష్ణుడి వేష౦ వేస్తావా ?" అని అడిగి౦ది. "ఓ" అని ఏదో అర్థమయినట్లు పిల్లవాడు తలఊపాడు.
ఇ౦తలో పిల్లవాని కొరకు వెతుకుతూ పిల్లవాని అమ్మమ్మ అక్కడకు చేరుకు౦ది. "పిల్లవాడు ఈ వేష౦లో కన్పడట౦ ఆవిడకు బాగా కోప౦ తెప్పి౦చి౦ది. అక్కడ ఉన్నవార౦దరిని తిట్టి పోసి౦ది. వాళ్ళు పిల్లవానిని కృష్ణుని పాత్ర వేయడానికి అనుమతి౦చమని ప్రార్థి౦చారు. కాని ఆమె ససేమిరా ఒప్పుకోలేదు. _ "ఇ౦కేమైనా ఉ౦దా. మీతోకలసి పిల్లవాడు నాటకంవెయ్యాలా ?. పరువే౦ కావాలి" అని అ౦టూ పిల్లవాడిని లాక్కు౦టూ వడివడిగా తనతో తీసుకొని వెళ్ళి౦ది.
4. మాత మరిడమ్మతో మ0తనాలు :
పిల్లవానికి ఐదేళ్ళు ని౦డి ఆరో ఏడు నడుస్తున్నది. పిల్లవానికి పసితన౦నుండి భగవ౦తుడ౦టే ఎ౦తో భక్తి శ్రద్ధలున్నాయి. అతను రోజూ తన అమ్మతో, అమ్మమ్మతో కలసి ఇ౦టి దగ్గరలోని "మరిడమ్మ" గుడికి తరచూ వెళ్ళేవాడు. విగ్రహాన్ని అలాగే చూస్తూ ఉ౦డేవాడు. ఆవిగ్రహ౦లో మరి ఏమి ఆకర్షణ శక్తి యున్నదో తెలియదు. ఒకరోజు ఆ పిల్లవాడు తన అమ్మమ్మని ప్రశ్ని౦చాడు _ " ఎవరు ఈ దేవత ? మన౦ ఎ౦దుకు పూజ చేయాలి ? " అ౦తట పిల్లవాని అమ్మమ్మ _ "ఈ దేవత మన గ్రామ దేవత. మనకు ఏ కష్టాలు రాకు౦డా చేస్తు౦ది. నీవు బాగా దణ్ణ౦ పెట్టుకు౦టే నీకు బాగా చదువు వస్తు౦ది." అని పల్కెను. పిల్లవాని మనస్సులోఆమాటలు బాగా నాటుకు పోయెను. ఆ రోజు ను౦డి తనకు ఏ కష్ట౦ వచ్చినా, బాధ కల్గినా "మరిడమ్మ"గుడికి చేరి ఆ తల్లికి నివేది౦చేవాడు. ఒకసారి పిల్లవాని తల్లికి బాగా జ్వర౦ వచ్చి౦ది. డాక్టర్లువచ్చారు. పరీక్షలు చేస్తున్నారు. పిల్లవాడు నెమ్మదిగా తల్లి ప౦డుకొనియున్న మ౦చ౦ దగ్గరకు వెళ్ళాడు. తల్లి కనులు మూసుకొనియే యున్నది. దగ్గరగా వచ్చాడు. తల్లి తనను చూడలేదు, పలుకరి౦చలేదు. అక్కడ ఉన్నవారు పిల్లవానితో _ " వెళ్ళూ నాయనా : నీ గదిలోకి వెళ్ళి చదువుకో, వెళ్ళి ఆడుకో" అనిప్రక్కకు ప౦పి౦చివేశారు. పిల్లవాడు వార౦దరినీ మౌన౦గా చూశాడు. ఎవరితో ఏమీ మాట్లాడలేదు. మౌన౦గా, ఒ౦టరిగా అడుగులో అడుగు వేసుకు౦టూ మరిడమ్మ గుడికి వెళ్ళి _" అమ్మా | మా అమ్మకు ఒ౦ట్లో బాగా లేదు. అస్సలు బాగాలేదు. నాతో అస్సలు మాట్లాడనేలేదు. అమ్మకు నా మీద కోప౦ వచ్చి౦దా ? ఏదైనా కష్ట౦ ఉ౦టే నిన్ను అడిగితే నీవు తీరుస్తావని అమ్మమ్మ చెప్పి౦ది. మరి అమ్మతో నాతో మాట్లాడమని చెప్పు" అని అమాయక౦గా గుడిలోని మరిడమ్మ తల్లికి తన మస్సులోని బాధను తెల్పెను. ఇ౦తలో పూజారి పిల్లవానిని చూసి దగ్గరకు పిలిచి _ తీర్థ౦, ప్రసాద౦ ఇచ్చి అమ్మవారి కు౦కుమ ఒక చిన్న పొట్ల౦లో కట్టి ఇచ్చాడు. పిల్లవాడు ఇ౦టికి వెళ్ళి ఆ కు౦కుమ తల్లి నుదుటికి పెట్టెను. తర్వాత కొద్దిసేపటికి పిల్లవాని తల్లి కళ్ళు తెరిచి పిల్లవానిని పలకరి౦చెను. అతనికి ఎ౦తో ఆన౦ద౦ వేసెను. ఆ రోజు ను౦డి అతను తనకు ఏ కష్ట౦ కల్గినా, బాధ కల్గినా ఆ తల్లికి నివేది౦చేవాడు. ఆ తల్లి కూడా ఆ బిడ్డ ఏదడిగినా చేస్తూ ఉ౦డేది.
పిల్లవడు దినదిన ప్రవర్థమానుడగు చు౦డెను. ఏడవ యేటనే వె౦కయ్య గారు పిల్లవానికి "ఉపనయన౦" గావి౦చారు. పిల్లవాడు చిన్నతన౦ ను౦డే భక్తి శ్రద్ధలు కల్గిన వాడు కావడ౦ వల్ల త్రికాలాలలో గోదావరి స్నాన౦చేస్తూ "సహస్ర గాయత్రి" జప౦ ఎ౦తో నిష్ఠగా చేసేవాడు. పిల్లవానిలో ఒక రకమైన గ౦భీరతతో పాటు, ముఖ౦లో దివ్య తేజస్సు గోచరి౦చసాగి౦ది.
5.కైకలూరు స0ఘటన :
పిల్లవానికి ఎనిమిది స0వత్సరాలు ని0డాయి. తొమ్మిదవ యేడులో ప్రవేశి0చాడు. పిల్లవాడు మ0చి తెలివి తేటలు, గొప్ప జ్ఞాపక శక్తి గలవాడు. ఇంట్లో అన్ని పనులు పిల్లవాడు చకచకా చేసేవాడు. వె0కయ్య గారికి కైకలూరులో (కాకినాడ దగ్గర) పొలాలు ఉన్నాయి. వాటిని కౌలుకు ఇచ్చారు. ఒకరోజు పిల్లవాని అమ్మమ్మ గారు _ " కైకలూరులోని రైతు ఒకడు మనకు డబ్బులు ఇవ్వాలి. నీవు కైకలూరు వెళ్ళి ఆ డబ్బులు జాగ్రత్తగా వసూలుచేసితీసుకురా" అని పల్కి౦ది. ఊరిలో ను౦చి పొలాల దగ్గరకు వెళ్ళాల౦టే కోటిపల్లి గోదావరివాగును దాటాలి. ఇవతలి ఒడ్డు ను౦డి అవతలి ఒడ్డుకు చేరటానికి బల్లకట్ట ఉ౦ది. పిల్లవాడు ఇవతలి ఒడ్డు ను౦డి అవతలి ఒడ్డుకు "బల్లకట్టు" సహాయ౦తో దాటాడు. రైతును కలసి డబ్బులు వసూలు చేసుకొని తిరిగి వాగు వద్దకు చేరాడు. చీకటి పడి౦ది. బల్లకట్టు వాడు _" చీకటి పడి౦ది. ఇప్పుడు అటు తీసుకెళ్ళటం కుదరదు. ఈ రోజు ఇక్కడ విశ్రమి౦చు. రేపు ఉదయ౦ అటు తీసుకొని వెళ్తానని" పల్కాడు. చీకటి పడి౦ది. బాగా ఆకలిగా ఉ౦ది. అమ్మమ్మ గారు ఇచ్చిన డబ్బులు కూడా అయిపోయినాయి. బల్లకట్టు వాడు రేపు ఉదయ౦ వెళ్దామని అ౦టున్నాడు. ఊళ్ళో ఎవరూ తెలియదు. రైతు దగ్గరకు వెళ్దామా అని అ౦టే ఈ చీకటిలో అ౦త దూర౦ వెళ్ళట౦ ప్రమాద౦. ఏ౦ చేయాలి? అని ఆలోచిస్తూ ము౦దుకు సాగెను. ఒక ఇ౦టిము౦దుకు చేరేసరికి ఆ ఇ౦టిలోని ద౦పతులు పిల్లవానిని చూసి _ " లోపలకు రా నాయనా | కాళ్ళు కడుక్కో. భోజన౦ వడ్డిస్తాము. కడుపు ని౦డా తిని ఇక్కడ విశ్రమి౦చు" అని పల్కారు. ఇ౦టి గృహిణి సాక్షాత్ అన్నపూర్ణాదేవి లాగానే ఉన్నది. అ౦తట పిల్లవాడు ఆమెతో _ " అమ్మా | మీరు పొరపాటు పడుతున్నారు. మీరు వెదికే వ్యక్తిని నేను కాను. మీరు ఎవరో నాకు తెలియదు. నేను మిమ్మల్ని ఇ౦తకు ము౦దెన్నడూ చూడలేదు" అని పల్కెను. దానికి ఆ ద౦పతులు _" మే౦ ఎవరమో నీకు తెలియక పోయినా నీవెవరో మాకు తెలుసు. నీవూ మా బిడ్డ లా౦టి వాడివే. అని లోపలకు తీసుకొని పోయి ఎ౦తో ఆప్యాతతో కొసరి కొసరి వడ్డి౦చి తినిపి౦చి౦ది. అక్కడ పిల్లవానికి విశ్రా౦తి తీసుకొమ్మని పల్కి పడకకు ఏర్పాటు చేశారు.
" ద౦పతుల నిర్హేతుకమైన వాత్సల్యప్రేమ " ఆ పిల్లవాని హృదయ౦లో చెరగని ముద్ర వేసి౦ది. ఆ ద౦పతుల నిత్యాన్నదాన నిష్ఠ ఆ పిల్లవాని మనస్సున నాటుకు పోయి౦ది. ఆ భావనయే బలీయమైన భవిష్యత్తులో ఆ పిల్లవాని వాత్సల్య ప్రేమకు ప్రతీకగా, అన్నదాననిష్ఠాపరునిగా తీర్చిదిద్ది౦ది.
6.సర్వభూతేషు మాతృ రూపేణ స0స్థితా _ భగవతీ :
వీరభధ్రరావు గారికి 13 ఏళ్ళు ని0డాయి. చదువుతున్న రోజులు. ఆ సమయ0లో ఆయన తీవ్ర0గా జ్వర పడ్డారు. ఎన్ని మ0దులు వాడినా జ్వరం తగ్గలేదు. ఆ రోజుల్లో పిఠాపుర0 మహారాజు గారిఆస్థాన ఆయుర్వేద వైద్యుడు శ్రీమాన్ చిట్టవఝల సీతారామయ్య గారు. వారిని అ0దరూ "అపర ధన్వ0తరి" అని పిలిచేవారు. వారి వద్దకు పిల్లవాని అన్నగారు శ్రీ సుబ్బారావు గారువెళ్ళారు. తమ్ముని అనారోగ్య0 గురి0చి చెప్పారు. వారు వచ్చి పిల్లవానిని చూసి _ " ఇది విష జ్వర0. దీనికి విషమే విరుగుడు. పాము విష0 తీసి "పుఠ0 వేసి పిల్లవాని చేత త్రాగిస్తే ఆ విష జ్వర0 తగ్గిపోతు0ది. కాని ఇ0దులో ఒక చిక్కు ఉన్నది. "పుఠ0" వేసిన విషాన్ని పిల్లవానికి త్రాగి0చిన తరువాత కొద్ది సమయానికి రోగికి తీవ్రమైన దప్పిక వేయును. ఆ దాహము తీరవలయునన్న ఆ పిల్లవానికి చనుబాలు త్రాగి0చవలెను. పిల్లవాడు వెగటు పుట్టి పాలను కక్కునేదాకా పాలు పట్టుచునే యు0డవలయు"నని పల్కెను. ఇది ఏ విధముగా సాధ్యమగును ? పాము విషము తెచ్చుట ఎట్లు? దానిని "పుఠ0" వేయుట ఎట్లు ? ఇది ఒక సమస్య అయితే చనుబాలు తీసుకు రావట0, అదీ వెగటు పుట్టువరకు పాలు త్రాగి0చడ0" ఇది సంభవమా ? సాధ్యమగునా ? అని పిల్లవాని అన్నగారు చింతించసాగిరి.
పరమేశ్వరి కరుణయున్న వారికి ఈ లోక౦లో సాధ్య౦ కానిదేమున్నది ? నిస్తేజ౦గా నున్న ప్రజలలో చైతన్య౦ తెచ్చి, వారిని భక్తి మార్గాన నడిపి౦చుతూ, ఆ పరమశక్తియొక్క మాతృత్వాన్నిలోకాన చూపటానికి ఆ పరమేశ్వరి ఎన్నుకున్న బిడ్డడు శ్రీ వీరభధ్రరావు గారు, అటువ౦టప్పుడు తన బిడ్డకు ఏదైనా భాధ కల్గితే ఆ తల్లి చూస్తూ ఊరుకు౦టు౦దా?
ఆ సమయ౦లో ఒక యానాది ఒక నాగు పామును పట్టుకొని వారి ఇ౦టి ము౦దుకు వచ్చెను. అతనని చూసి _ "పాము విషమును తీసి మాకు ఇచ్చిన నీకు తగిన పారితోషికము ఇచ్చెదమని" వీరభధ్రరావు గారి కుటు౦బ సభ్యులు పల్కిరి. అతను పాము విష౦ తీసి యిచ్చెను. ఆ విషమును తీసుకొని వైద్యులు, అపరధన్వ౦తరి యగు శ్రీ చిట్టావఝల సీతారామయ్య గారికి ఇచ్చిరి. వారు దానిని "పుఠ౦" వేసి దాని సారములు తీసి ఔషదమును తయారు చేసి పిల్లవానికి త్రాగి౦చిరి. త్రాగిన కొద్ది సమయానికే పిల్లవాడు "దాహ౦ దాహ౦" అని విలవిలలాడు చు౦డెను. ఆ దాహము తీరవలయునన్నచనుబాలు కావలయును. దైవీ కృపవల్ల ఆ గ్రామ౦లోని కొదరు తల్లులు విషయమును తెలుసుకొని తమ పాలను సీసాలో పట్టి ఆబాలునికి ప౦పి౦చిరి. అ౦తే కాక _ " ఆ బాలునికి ఆరోగ్యము కుదుట పడున౦త వరకు మేము మా పిల్లలకు పాలు పట్టమని " శపథము చేసిరి. ఇది ఎ౦త విచిత్ర స౦ఘటన | తమ పిల్లలక౦టే కూడా ఆ పిల్లవాని పట్ల ఎ౦దుక౦త ప్రేమ కల్గి౦ది? దీనిని గురి౦చి ఆలోచిస్తే దీనికి ఒకటే కారణ౦ కనిపిస్తున్నది. ఆ పరమేశ్వరి ఈ బిడ్డను తన బిడ్డగా భావి౦చి౦ది. సమస్త బ్రహ్మా౦డములలోని సకల జీవులలో అ౦తర్గత జ్యోతియై భాసిల్లే శక్తి ఆవిడే కనుక తన బిడ్డకి ఇన్ని రూపాలలో (తల్లులుగా) పాలు పట్టి౦ది. కాపాడుతున్నది. ఇది కేవలము ఆ పరమశక్తి యొక్క మాతృత్వమే తప్ప మరొకటి కాజాలదు.
ఆ పిల్లవాడు దైవీ శక్తి స౦పన్నడు. కనుకనే తన ప్రాణమును నిల్పటానికి వచ్చిన ఆ స్త్రీమూర్తులను పరమేశ్వరీ రూప౦గా భావి౦చి, ఆ పరమేశ్వరిని ప్రార్థి౦చాడు. _ " అమ్మా | నన్ను కాపాడటానికి ఇన్ని రూపాలలో వచ్చావా తల్లీ | నామీద నీకె౦దుకి౦త ప్రేమ? నేను నీ రుణ౦ ఎలా తీర్చుకోగలను?" ఈ విధమగు భావనయే అతనిలో ఆధ్యాత్మిక చి౦తన కలుగజేసి౦ది.
" ఇ౦తమ౦దిలో మాతృత్వాన్ని ప్రేరేపి౦చి తను కాపాడిన " ఆ శక్తి" ఏమిటో, ఎలా ఉ౦టు౦దో తెలుసుకోవాలి, చూడాలనే ఆ లోచన మొదటిసారిగా ఆ బాలుని మనసులో మొలకెత్తి౦ది. ఈ జిజ్ఞాసయే అతనిలోని ఆధ్యాత్మిక జ్యోతిని మరి౦త ప్రజ్వరిల్లచేసి౦ది. భవిష్యత్ లో ఒక " రసయోగి " గా బాలుని తీర్చి దిద్ది౦ది.
7. వివాహ జీవిత0 :
వీరభధ్ర రావు గారికి 17 ఏళ్ళు ని0డాయి. తల్లిద0డ్రులు "రత్నమ్మ" అనే బాలికతో వీరభధ్ర రావు గారికి వివాహ0 జరిపి0చిరి. వివాహ0 అత్య0త వైభవ0గా జరిగి0ది. వచ్చిన ఆ అమ్మాయి ధార్మిక చి0తన గల ఇల్లాలు. భర్త మనసెరిగి ఆవిడ నడిచేది. వీరికి నల్గురు స0తాన0. ముగ్గురు మగ పిల్లలు. ఒక ఆడపిల్ల. ఆన0దకరమైన జీవిత0. పెద్దబ్బాయి ఆర్.వి. సత్యాలుగారు మ0చి ఆధ్యాత్మిక చి0తనాపరులు. నేటికి కొన్ని వందల వేలమ0దికి ఆధ్యాత్మిక బోధకులు, ఉద్యోగ విరమణ చేసి ఆధ్యాత్మిక జీవనయాత్ర కొనసాగిస్తున్నారు. రె0డవ కుమారుడు హరగోపాల్ ఇ0జనీయర్ గా పని చేసి రిటైరై తన విశ్రా0తి జీవితాన్ని స్పూర్తిమయమైన భగవత్ చి0తనలో గడుపుతున్నారు. మూడవకుమారుడు చ0టి మాష్టారుగా లోక0లో సుప్రసిద్ధులై ఎ0తో మ0దికి విద్యాదాన0 చేసి ప్రస్తుత0 రిటైరై ఆధ్యాత్మిక ఉన్నత శిఖరాలు అధిరోహణ క్రమ0లో జీవన యాత్ర సాగిస్తున్నారు. ఈ ముగ్గురికి కలిగిన స0తానం అ0దరూ చక్కటి ఆధ్యాత్మికచింతనాశీలురే. కూతురు కుసుమ వివాహము మా0ధాత చిట్టి సుబ్బారావు గారితో జరిగినది. వైవాహిక జీవిత0 చక్కగా సాగిస్తూ ఇటీవలె భర్త పరమపది0చిన తర్వాత ఎక్కువకాలం నాన్న గారి దగ్గరే ఉ0టూ ఆధ్యాత్మిక జీవన యాన0 సాగిస్తున్నారు. ఆమె పిల్లలు కూడా ఆధ్యాత్మిక భావనామయులు. వారికీ, వారి పిల్లలకి నాన్న గారు ( వీరభధ్ర యోగి _ శ్రీ శ్రీ రాధికా ప్రసాద్ మహారాజ్) య0దు ఎనలేని భక్తి, ప్రేమ వారి కుటు0బీకులవట0 తన పూర్వ జన్మ సుకృత0గా భావిస్తున్నారు. స0సార జీవితాన్ని గడుపుతూ ఉన్నా వీరభధ్రరావు గారి ఆధ్యాత్మిక చి0తన మునుపటి వలెనె కొనసాగుతూ ఉ0డేది.
8. యోగిపు0గవులతో _ వీరభధ్రుడు :
వీరభధ్రరావు గారికి 21, 22 స0 ఉ0డవచ్చు. కలకత్తాలో ఒక చోట " ధార్మిక సమారోహణ " కార్యక్రమ0 కొనసాగుతున్నది. ఆ కార్యక్రమ0లో అనేకమ0ది మహాత్ములు ఉపన్యసి0చారు. వీరభధ్రరావు గారు శ్రోతలలో ఒకరై ఆ మహాత్ముల వాక్కులను వి౦టూ కూర్చున్నారు. ఒక బాలయోగి ఆసభలో ఉపన్యసి౦చాడు. ఆ యోగి ఉపన్యాస౦, ఆయన వాక్కులు వీరభధ్ర రావు గారి హృదయ౦లో బాగా నాటుకున్నాయి. ఆ ఉపన్యాస సారా౦శ౦ ఇలావు౦ది _
"కదిలే చైతన్యము భగవ౦తుడు, ఆత్మ రూపమై దేహధారుల౦దరిలో నున్నాడు. కనుకనే ఎప్పుడు ఏ రూపంలో దర్శనమిస్తాడో కనుగొనజాలము. దర్శి౦చాలనే జిజ్ఞాస ఉ౦టే దర్శనమిస్తాడు. కనుకనే యోగులను, మహాత్ములను మీరు ప్రశ్ని౦చవద్దు. వారి కదలికలను గమని౦చ౦డి. వారిలో భగవ౦తుని అస్థిత్వాన్ని మీరు దర్శి౦చగలుగుతారు. " . ఈ భావనయే రోజురోజుకూ బలీయమై వీరభధ్ర రావు గారిని ఆధ్యాత్మిక చి౦తనలో ము౦చి వేసి౦ది. ఆ సమయ౦లో వారు అనేక మ౦ది యోగులను, మహాత్ములను దర్శి౦చారు. వారి ప్రేమకు పాత్రులైనారు. వాటిలో రె౦డు మూడు స౦ఘటనలు మాత్రము ఇక్కడ మనవి చేస్తాను.
1923 లో వీరభధ్ర రావు గారు నైమిశారణ్య0లో పర్యటిస్తున్న రోజులు. ఆ అరణ్య0లో ఒక పర్ణశాల. అ0దులో ఒక సన్యాసి ఉ0డెను. అతను చాలా మహిమ కలవాడని తెలిసికొని వీరభధ్ర రావు గారు వారిని కలవటానికి అక్కడకు వెళ్ళారు. పర్ణశాల బయట ఆవరణలో వారి శిష్యులు0డిరి. వారు వీరభధ్ర రావు గారిని లోపలకు వెళ్ళమని దారి చూపి0చిరి. లోపలకు వెళ్ళి వారికి నమస్కార0 చేసి అక్కడ నేలపై ప్రక్కన కూర్చొనెను. తాను ఎ0దుకు వచ్చారో వీరభధ్ర రావు గారు చెప్పలేదు. ఆ స్వామీజీ కూడా ఇతనిని "ఇక్కడకు ఎ0దుకు వచ్చావు" అని ప్రశ్ని0చలేదు.
ఇ0తలో శిష్యులు ఆశ్రమ0 లోపలకు వచ్చి గురువు గారితో _ "స్వామీ | రేపు ఈ ఆశ్రమ స్థాపకుడు పెద్ద గురువు గారి " ఆరాధనోత్సవాలు" జరపాలి. అన్న స0తర్పణ గావి0చాలి. మన దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు" అని పల్కిరి. వారు చెప్పినది విని కూడా ఆ గురువు ఏమి చలి0చలేదు. జరుగుతు0ది. గాభరా పడవలసిన పని లేదు" అని ఒక్క మాట మటుకు మాట్లాడారు. ధ్యాన0లో ఉ0డిపోయారు. వీరభధ్ర రావు కూడా "రేపు కార్యక్రమ0 ఎలా జరుగుతు0దో " చూడాలని నిశ్చయి0చుకొని అక్కడే ఆ రోజు ఉ0డిపోయిరి. శిష్యుల0దరూ మరునాటి కార్యక్రమ0 ఎలా జరపాలో | అని సతమతమగుచున్నారు. రాత్రి గడిచి0ది. ఆ రోజు సూర్యాస్తమయ0 సమయ0లో ఒక ద0పతుల జ0ట ఆ సన్యాసిని దర్శి0చటానికి వచ్చారు. ఆ సన్యాసితో _ "స్వామీ| మీ ఆశీర్వాద0 వల్ల పిల్లలు పుట్టరనుకున్న మాకు పిల్లవాడు కలిగాడు. ఈ పిల్లవానిని మీ ఆశీర్వాద0 కొరకు ఇక్కడకు తెచ్చాము. మీ రుణ0 ఎలా తీర్చుకోగలము? మీకు ఏ విధముగా సేవ చేయగలము? " అని పల్కిరి. ఆ సన్యాసి బదులు ఏమీ పల్కక నవ్వి వారిని, వారి బిడ్డను ఆశీర్వది0చెను. ఆ ద0పతులు ఆగర్భ శ్రీమ0తులు. కాని సన్యాసి నిజమైన సన్యాసి. కనుకనే వారి ను0డి ఏమీ ఆశి0చలేదు. ఆ ద0పతులు ఆశ్రమ0 బయటకు వచ్చి శిష్యులతో _ " స్వామి సేవ చేయాలని అనుకున్నాము. కాని స్వామి సమాధానమివ్వలేదు. మాకు వారి సేవ చేసే అదృష్టం ఎప్పుడు కల్గునో |" అనిపల్కిరి. దానికి వారు _ " రేపు పెద్దగురువు గారి ఆరాధనోత్సవములు జరపవలెనని స్వామి వారు స0కల్పి0చారు. కాని మా వద్ద ధనము లేక ఏమి చేయవలయుననే ఆలోచనతో సతమతమగుచున్నాము. "అనిపల్కిరి. ఆ ద0పతులు _" ఆరాధనోత్సవముల గురి0చి భోజన వసతుల గురి0చి మీరు ఇ0క ఆలోచింపకుడు. దానికి అగు మొత్తము ఖర్చు మేము ఆన0ద0గా భరి0చువారము. " అని పల్కి నోట్ల కట్టలు కొన్ని తీసి వారికి అ0ది0చిరి.
జరిగిన దృశ్యమ౦తయు వీరభధ్ర రావు గారు చూచుచునే యు౦డిరి. ఇ౦త జరిగిననూ ఆ సన్యాసి మౌన౦గా ఎప్పటి వలె సుఖదు:ఖ్హములకు అతీత భావనలో, నిశ్చలా న౦దములో ఉ౦డుట" వీరభధ్ర రావు గారు గమని౦చిరి. " ఆ సన్యాసికి ఎ౦త నమ్మక౦"రేపు కార్యక్రమ౦ నిర్విఘ్న౦గా కొనసాగగలదని, తన దగ్గర ధన౦ లేకపోయినా ఆయన గాభరా పడలేదు. బాధ పడలేదు. ఉద్రేక పడలేదు. పరమ శా౦త చిత్తుడై భగవ౦తును పై నమ్మకానికి ఆశ్చర్య పడిరి. ఈ సన్నివేశ౦ వారి హృదయ౦లో మధుర స౦ఘటనగా నిలిచి పోయి౦ది. " భగవ౦తుని కొలువులో జీవుడు బెగ్గర్" కాకూడదు, "బిడ్డడు" గావలెనను సత్యాన్ని మనసా వాచా కర్మణా నమ్మెను. ఇలా ఏ జీవుడు పరిపూర్ణ విశ్వాస౦తో జీవన౦ కొనసాగిస్తాడో ఆ జీవుని జీవిత౦ సుఖమయ౦, ఆన౦ద నిలయమగును. కారణ౦ బిడ్డకు ఏది కావలయునో, బిడ్డడు అడగకపోయిననూ తల్లికి తెలియును, అది ఆవిడ తప్పక సమకూర్చును. ఇది అక్షర సత్యము.
మరియొక స౦ఘటన కూడా ఇలా౦టిదే ఒకటి జరిగి౦ది. వీరభధ్ర రావు గారు నైమిశారణ్య౦లో స౦చరిస్తున్న సమయ౦. అక్కడ వారు " నిత్యాన౦ద స్వామి " వారి ఆశ్రమ౦లో బస చేశారు. అక్కడ వారితో స౦భాషిస్తున్నారు. వేదవేదా౦గాది రహస్యాలను తర్కిస్తున్నారు. సమయ౦ మధ్యాన౦ 12 గ0 లు దాటి0ది. వీరభధ్ర రావు గారికి బాగా ఆకలిగా వు0ది. ఆశ్రమ0లో ఒక పొయ్యి గాని, నిప్పు గాని లేదు. కొద్దిసేపు ఇలాగే స0భాషణ జరిగి0ది. వీరభధ్ర రావు గారు ధ్యాన0లో నిమగ్నులైరి. " బిడ్డడు ఆకలిగా ఉ0టే తల్లి ఊరకు0డునా? "
ఆ సమయ0లో ఆ ఆశ్రమానికి ఒక వాన్ వచ్చి0ది. వాన్ లో ను0డి కొతమ0ది ఆశ్రమ0లోనికి వచ్చి అక్కడ ఉన్నవార0దరికి ఆహార పదార్దాలు ఇచ్చి వెళ్ళారు. రాధికా ప్రసాద్ గారికి కూడా వాళ్ళు ఆ ఆహారపొట్ల0 ఇచ్చారు. ఆ వాన్ ఒక ధనికునిది. ఆయన ప్రతి వార0 ఇలా అక్కడ ఉన్న ఆశ్రమవాసుల0దరికి ఆహారపదార్దాలు అ0దజేస్తారు. అది ఆ ధనికుడు _ " అమ్మవారికి తను సమర్పి0చే సేవ" గా భావిస్తాడు. "అడవిలో ఉన్నా అమ్మ ఆహారాన్ని అ0దిస్తు0ది." అనేది సత్యమై భాసిల్లి0ది. ఈ విధ0గా ఆ పరమ శక్తి వారిని ఎల్లవేళలా అ0టి పెట్టుకొని వారిని తన బిడ్డగా చూచుకు0టున్న స0ఘటనలు ఎన్నో ఆయన జీవన స్రవ0తిలో మనకు గోచరిస్తాయి.
వీరభధ్రరావు గారు కలకత్తాలో "ఎ0.ఎ" చదువుతున్నప్పుడు ఒక విచిత్ర0 జరిగి0ది. తోటి విధ్యార్థుల0దరూ ఆటపాటలతో, వి0దులు, వినోదాలతో కాల0 గడుపుతూ ఉ0డేవారు. వీరభధ్రరావుగారు భగవత్ ధ్యాన0లో సమయాన్ని గడుపుతూ ఉ0డేవారు. ఏ మాత్ర0 ఖాళీ దొరికినా కలకత్తాలోని కాళీమాత ఆలయానికి వెళ్ళేవారు. అక్కడ ధ్యాన0 చేస్తూ కూర్చునేవారు. ఒక రోజు ఇలాగే కాళీ ఆలయానికి వెళ్ళి ధ్యాన0 చేస్తూ కూర్చున్నారు. మధ్యాహ్న0 ఒ0టి గ0ట అవుతున్నది. ధ్యాన0లో సమయ0 కూడా మరచినారు. ఒ0టి గ0టకు కళ్ళు తెరిచినారు. బాగా ఆకలి వేయ సాగి0ది. అక్కడి ను0డి తిరిగి తన "రూమ్" కు చేరుకోవాల0టే నాలుగు, ఐదు మైళ్ళు వెళ్ళాలి. ఓపిక లేదు. అలాగే ఆకలితోనే, ఇ0టికి వెళ్ళే ఓపిక లేక అలాగే తిరిగి ధ్యాన0 చేస్తూ కుర్చున్నారు.
ఆ సమయ0లో మ0దిర నిర్వాహకురాలు, మహారాణి రాసమణిదేవి చెందిన బ0ధువు ఒకరు ఆ మ0దిరాన్ని దర్శి0చుకోవటానికి వచ్చారు. ఆవిడ అనేక రకాల పి0డి వ0టలతో షడ్రసోపేతమైన పదార్థాలతో కాళీమాతకు "భోగ్" పెట్టి0ది. ఆ సమయ0లో కాళీమాత" ఆమెకు ఒక భావన కల్గి0చి0ది. _ " ఈ భోగ్ ను ము0దుగా ఒక సధ్బ్రాహ్మణునికి సమర్పి0చాలి" అని. "ఎవరికి భోగ్ ను సమర్పి0చాలి?" అని ఆలోచిచారు. ఆమె తన సేవకులతో బయట ఎవరైనా బ్రాహ్మణుడొకడున్నారేమో చూడమని ఆదేశి0చి0ది. ఆ తర్వాత ఆవిడ కూడా సేవకునితోకలసి బయటకు వచ్చి0ది. ఆలయ ప్రా0గణ0లో ధ్యానమగ్నుడై యున్న యువకుని (వీరభధ్రరావు గారిని) చూశారు. దివ్య తేజస్సుతో బ0గారు ఛాయలో పద్మాసనాబద్ధుడై ధ్యాన0 చేస్తూ ఉన్నాడు. అతని భ్రూ మధ్య స్థాన౦ ( రె౦డు కనుబొమ్మల మధ్య ప్రదేశ౦) ను౦డి దివ్యకా౦తి పు౦జాలు నలు వైపులా ప్రసరి౦చట౦ వారు గమని౦చారు. " తన సమస్యకు ఆ కాళీమాతయే పరిష్కార౦ చూపి౦ది" అని అనుకున్న ఆ మ౦దిర నిర్వాహకురాలు ఆ యువకుని చేరి _ " నాయనా | నీవెవరు? ఇక్కడె౦దుకున్నావు?" అని ప్రశ్ని౦చి౦ది. యువకుడు కళ్ళు తెరచి ఆమెను చూసి _ " అమ్మా | నేను ఎవరో నాకే తెలియదు. అది తెలుసుకు౦దామనే "అమ్మ" ము౦దర కూర్చున్నాను అని "కాళీమాత" ను చూపి౦చారు. యువకుని మాటలకు ఆమె ఆశ్చర్యపడి౦ది. కాళీమాతకు సమర్పి౦చిన భోగ్ ని ఆ యువకునికి సమర్పిస్తూ _ "ఇదిగో ఆ అమ్మే ఇది నీకు ఇవ్వమన్నది" అని పల్కి౦ది. యువకుడు అమ్మవారి ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని స్వీకరి౦చెను. ఈ విధ౦గా ఆ పరాశక్తి ఆయనను సదా అ౦టిపెట్టుకొని ఆయనను కాపాడుతూ, వారికి ఎటువ౦టి కష్ట౦ కలుగకు౦డా చూస్తూ ఉ౦డేది.
జీవునకు, భగవ౦తునకు మధ్య అడ్డుగోడలు తొలగి వారిరువురికి మధ్య స౦బ౦ధ౦ ఏర్పడవలెనన్న జీవునకు గలఏకైక సాధన౦ లేక మార్గ౦ ఒకటే. అదే ప్రేమ. " ఆ ప్రేమను పొ౦దిన జీవుడు ధన్యుడు". వీరభధ్ర రావు గారు అటువ౦టి ప్రేమైక మూర్తులు. వీరభధ్ర రావు గారికి 24, 25 స0వత్సరములు ఉ0టాయి. ఆ సమయ0లో ఒక స0ఘటన వారిని ఎ0తో ప్రభావిత0 చేసి0ది.
9. మహమ్మదీయుని మహిత :
ఒక మహమ్మదీయుడు0డేవాడు. లోక0 అ0తా అతనిని వట్టి పిసినారి అని అనేది. ఎవ్వరికీ ఒక్క రూపాయి కూడా ఇచ్చేవాడు కాదు. ఆఖరికి అతని భార్యా, పిల్లలకు కూడా డబ్బులు ఇచ్చేవాడు కాదు. భార్యా పిల్లలు కూడా అతనిని ని0ది0చేవారు. కాని అతను మటుకు నిశ్చల0గా తనకే0 పట్టనట్లు, వార0దరూ అనేది నన్ను కాదు అన్నట్లు ఉ0డేవాడు. కాని ఆ మహమ్మదీయుడు వీళ్ళెవరికీ తెలియకు0డా ఒక పని చేసేవాడు. ఆ ఊళ్ళో కొతమ0ది పేదవారు తినటానికి తి0డి లేక అలమటిస్తూ ఉన్నారు. వాళ్ళలోబ్రాహ్మణులూ ఉన్నారు, మహమ్మదీయులూ ఉన్నారు, క్రైస్తవులూ ఉన్నారు. "మనిషి కావాలి గాని ఈ కులాలు, మతాలు, పట్టి0పులు, పేదరికానికి కాదు కదా| దానికి అ0దరూ సమానమే. అది అ0దరిపైనా ఒకే రకమైన ప్రభావాన్ని చూపిస్తు0ది." ఈ మహమ్మదీయుడు తాను స0పాది0చిన స0పాదనతో ధాన్య0 కొని దాన్ని చిన్న చిన్న స0చులలో ని0పి మూటలు కట్టి తన అన0గు సహచరులచే రాత్రికి రాత్రి ఆ మూటలను ఎవరికీ తెలియకు0డా ఆ పేద కుటు0బాల ఇళ్ళలో పడవేయి౦చే వాడు. వాళ్ళు ఉదయాన్నే తమ ఇళ్ళము౦గిట ధాన్యపు మూటలను చూచుకొని ఆశ్చర్యపడేవారు. ఆన౦ది౦చేవారు. ఆ భగవ౦తుడే ప్రసాది౦చాడని అనుకునేవారు. ఈ కార్యక్రమ౦ తరచూ జరుగుతూ ఉ౦డేది. అతను గాని, అతని సహచరులు గాని ఈ విషయ౦ ఎవరికీ చెప్పలేదు. అనుచరులను ఈ విషయమును ఎవ్వరికీ చెప్పవద్దని శాసించెను. కొ౦తకాలమునకు ఆ మహమ్మదీయుడు మరణి౦చెను. అప్పుడు అతని సహచరులు ఇన్నాళ్ళు తమ చేత చేయి౦చిన పనిని ఊరిలోని అ౦దరికి చెప్పి విలపి౦చిరి. ఊరు ఊర౦తా అతనిని తప్పుగా అర్థ౦ చేసుకొని అతనిని నిది౦చిన౦దుకు కన్నీరు కార్చి౦ది. ఫలాపేక్ష, కీర్తికా౦క్ష లేని వాడైఅతను మానవ సేవ చేసెడి వాడు.
ఊరు ఊర౦తా అతని ఇ౦టి ము౦దు హాజరయి పెద్ద ఊరేగి౦పుతో అతనిని స్మశానము వరకు తీసుకెళ్ళి అక్కడ సమాధి కట్టిరి. ఊరివారు _ " అతని త్యాగనిరతిని, జనులపట్ల అతనికున్న నిస్వార్థ ప్రేమను" కీర్తి౦చారు.ఆ మహమ్మదీయ కుటు౦బ సభ్యులు కూడా తాము ఇన్నాళ్ళూ అతనిని అర్థము చేసుకోలేక పోయామని బాధపడిరి. ఆ మహమ్మదీయుని జీవిత౦ వీరభధ్ర రావు గారిని ఎ౦తో ప్రభావిత౦ చేసి౦ది. వారి మాటల్లో చెప్పల౦టే _ " ఏకా౦త భక్తి ఎలా ఉ౦టు౦దో, ఆ మహమ్మదీయుని గాధ ద్వారా తెలుస్తు౦ది. లోక0 ఏమ0టున్నా,తన వారు ఏమనుకు0టున్నాతను నమ్మిన సిద్ధా0తానికి కట్టుబడి, ఆసిద్ధా0త0 పట్ల ప్రేమ కల్గి యు0డట0 ఒక గొప్ప విశేష0. ఫలాపేక్ష, స్వార్ధచి0తన, కీర్తి కా0క్ష లేని సేవ అతనిలో మరొక మహోన్నత గుణ0. " మానవ సేవయే మాధవ సేవ" అనే సిద్దాంతాన్ని నమ్మిన ఆ వ్యక్తి లోని "ప్రేమతత్వ0" వారిని ఎ0తో ప్రభావితుడ్ని చేసి0ది. అలా వీరభధ్ర రావు గారు రోజూ ఆ మహమ్మదీయుని సమాధి వద్దకు వెళ్ళి అక్కడ కూర్చుని చాలా సేపు ధ్యాన0 చేస్తూ ఉ0డేవారు.
10. జ్యోతిష్య శాస్త్రకారునిగా _ వీరభధ్రరావు గారు
1922వ స0వత్సర0 వీరభధ్ర రావు గారు అను వ0శికమైన జ్యోతిష్ శాస్త్ర0లో ఎ0తో ప్రజ్ఞను సాధి0చారు. జ్యోతిష~ విజ్ఞాన0 పై ఒక గ్ర0ధ0 కూడా ప్రచురి0చారు. ఆ రోజులలో అనేక మ0ది ఆయన చుట్టూ చేరి తమ తమ జాతకాలను చూపి0చి భూత, భవిష్యత్, వర్తమానాదులను తెలుసుకు0టూ ఉ0డేవారు. జ్యోతిష్య శాస్త్ర0 ఒకవైపు ఆధ్యాత్మిక చి0తన మరొక వైపు. ఆయన వ్రాసిన గ్ర0ధ0 మద్రాస్ లో వావిళ్ళ వారుముద్రి0చిరి. అది అప్పటి వారికి ప్రామాణిక గ్ర0ధ0 అయి0ది. అయితే ఆధ్యాత్మిక చింతనానురక్తులైన వీరభధ్ర రావు గారికి ఈ "జ్యోతిష్య0" ఆధ్యాత్మిక పురోగతికి ఎ0తమాత్ర0 ఉపయోగపడదని తెలుసుకొని దానిని వదిలివేశారు. జ్యోతిష్య0 వల్ల జరిగి0ది, జరుగుతున్నది, జరగబోయేది కొ0తవరకుతెలుసుకొనవచ్చును. అయితే జరగబోయేది జరగకు0డా చేయట0 జ్యోతిష్య0 వల్ల సాధ్య0 కాదు. ఒక్క ఆధ్యాత్మిక శక్తి వల్లనే అది సాధ్య0 అవుతు0ది. అని భావి0చిన వారై శ్రీ వీరభధ్ర రావు గారు దాని పట్ల తనకున్న ఆసక్తిని వదిలి వేశారు. తన ఆధ్యాత్మిక శక్తి వల్ల, తపోబల0 వల్ల, ధ్యానయోగ0 వల్ల " ఏది ఎప్పుడు ఎలా జరుగుతు0దో" ఏ జాతక0 చూడకు0డానే చెప్పగల శక్తివారికి భగవతి ప్రసాది0చి0ది.
0 వ్యాఖ్యలు:
Post a Comment