యోగా పై నిషేధమా ??????????
>> Tuesday, August 3, 2010
ఇంగ్లాండ్‌లో మాంచెస్టర్ సమీపంలోని రడ్క్లిఫ్ అనే పట్టణంలోని బ్రిడ్జ్ మెథడిస్ట్ చర్చి క్రైస్తవం కానిది అనే పేరుతో యోగాపై నిషేధాఙ్ఞలు జారీచేసింది. పూర్తివివరాలకు ఈ లంకె చూడండి.
http://www.google.com/url?sa=D&q=http://sify.com/news/uk-church-bans-yoga-in-its-premise-news-international-kh4q40igjcd.html&usg=AFQjCNEO7qvLTEjnii9xWvDYpdOtfjzTfw
ఇది కూడా చూడండి
http://groups.google.co.in/group/punyabhoomi/attach/84ccf12224b6faf5/christianyoga_rootedinhinduoccutlism_pt1.pdf?part=4
10 వ్యాఖ్యలు:
దీన్ని అడిగేముందు పూరి జగన్నాథ ఆలయంలోకి, మధుర మీనాక్షి ఆలయంలోకి హిందేతరులకి ప్రవేశం నిషిద్దం ఎందుకో అడగాల్సింది
యోగా మతం కాదుగా?
ముస్లీమేతరులు మసీద్ లోకి ప్రవేశం నిషిద్దం కదా..
మతం వేరు, యోగా వేరు
తారా గారు మీరు ఏ మసీదులో చూసారో నాకైతే తెలియదు....నాకు చాలా మంది ముస్లిం మిత్రులున్నారు మేము వారితో మసీదులకి వెళ్ళెవాళ్లమే. మీరు ప్రత్యేకించి ఏదైనా ఒక మసీద్ గురించి చెప్పాలనుకున్నరా...?
ఇకపోతే సదరు చర్చివారు యోగాను నిషేదించడానికి నాకు తోచిన ఏకైక కారణం యోగాలో దేహంలోని చక్రాలగూరించి చర్చ ఉంటుంది. బహుశా వీటిగురించి ప్రస్తావన వస్తె హిందుత్వం వైపు మరలవచ్చేమోనని అనుకొనుండవచ్చు
నేనడిగేది అదే ! హిందువుల విషయంలో గుండెలు బాదుకునే కుహనమేధావుల్లారా ! ఇలాంటి సహనాన్నే హిందువులవిషయాల్లో పాటించలేరెం్దుకు అని?
నాగార్జున గారు,
నిషేధం ఎప్పుడు సబబు కాదు, అలా వారు అది చేసారు, అనగానే, మీరు ఇది చేసారు అన్న ఎదురు ప్రశ్న సమాధానం కాదు.
అవును, మసీదులో ప్రార్ధన చెసే సమయంలో మా ఊరిలో కుడా ఇతర మతస్తులకి ప్రవేశం లేదు, మిగతాప్పుడు పెద్దగా పట్టింపులు లేవు కానీ అది అన్ని దేశాలలోనూ లేదు, అంతెందుకు మన దేశంలో కుడా చాలా చోట్ల ఉన్నాయి ఇతర మతస్తుల ప్రవేశం నిషిద్దం వాటి ప్రస్తావన ఇక్కడ అనవసరం.
ఇంక యోగా అంటారా, ఐతే రేపు హిందూ మతాన్ని నిషేదిస్తే?? అక్కడ ఉన్న హిందువులు మతం మారండి లెదా చావండి అంటే??
తప్పుని ఖడించాలి, అంతే తప్ప, ఈ మనం తప్పు చేయటం లేదా అని అనటం తప్పుని ప్రోత్సహించటమే.
ఇంక మీనాక్షి దేవాళయానికి వస్తే, మీనాక్షమ్మ మీద నమ్మకం ఉన్నచో వెళ్ళొచ్చు.
అలాంటి నిషేధం కేరళలో ఉన్నది, అదీ తీసివేయమని అందరూ కోరుతున్నా వినటంలేదు.
తార గారూ
"మసీదులో ప్రార్ధన చెసే సమయంలో మీ ఊరిలో ఇతర మతస్తులకి ప్రవేశం లేదు" అన్నారు.అది ఏ ఊరో చెబితే ఆ ఊరి ముస్లిములను సరిచేయొచ్చు.ఎందుకంటే మసీదులోకి ఏ మతస్థులైనా వెళ్ళి నమాజు చేసుకోవచ్చు.
రహమతుల్లాగారు, నమాజ్ కి కాదు, నమాజ్ చూడటానికి..
నమాజు చూడటానికైనా వెళ్ళొచ్చండీ.రానివ్వరేమో అనే అనుమానంతోనే ఎవరూ వెళ్ళటంలేదు.
దుర్గేశ్వర గారు: మీరు ఇచ్చిన లింకులోనే చూడండి (నాకు ఆ గూగుల్ గౄప్ లింకు ఓపెన్ అవడంలేదు, నాకు సభ్యత్వం లేదట. వేరే లింకును చదివాను) చర్చి పరిసరాల్లొ యోగాను అనుమతించలేదు కారణం-spiritually confusing అని. దానికి నాకు తోచిన కారణం కూడా వివరించాను. చర్చీ అసలు క్రైస్తవులు అందరూ ఎక్కడకూడా యోగాను పాటించవద్దు అని చెప్పిందా (మీకు తెలిసిన సమాచారం ప్రకారం). వాళ్ల చర్చి పరిసరాల్లో కూడదూ అన్నారు. ఇప్పుడు మళ్ళి అంటున్నా, మన దేశంలో ప్రార్థనా స్థలాల దగ్గర (అన్ని మతాల ప్రార్థనా స్థలాల దగ్గర ) అన్యమత ప్రచారం చేయనివ్వరుగా..ఎందుకు? అలా చేస్తే అక్కడకు వచ్చే భక్తులు ఆథ్యాత్మికంగా confuse అవుతారేమోననే కదా...దీనికిలేని అభ్యంతరం ఆ చర్చి చేస్తే ఎందుకు కలిగింది.
ఇకపోతే హిందువులకు వ్య్తతిరేకమైన విషయాల్లో ఇదే సహనం ఎందుకు ఉండదూ అని అడిగారు. హ్మ్...ఇప్పటికి మీకు నేను దీనికి పూర్తిగా satisfactory సమాధానం ఇవ్వలేకపోవచ్చు. ఇలాంటివాటికి స్పందించేపుడు ఎదుటివారు ఎలా ఆలోచించి ఇలా చేసుంటారో అని అనుకొంటాను. నాకు తెలిసినవి కొన్నే విషయాలు కాబట్టి వాటికి సంబందిచిన వరకే స్పందిస్తాను. ఇప్పుడు జరిగిన విషయంలో నెను పుట్టిన మతానికి సంబంధించినది కావడం, దానిలో కొన్నిటిపైనైనా అవగాహన ఉంది కాబట్టి స్పందించాను. వేరే విషయాల గురించి మాట్లాడటం వాటిగురించి నాకు ఎంత తెలుసు అనేదాన్ని బట్టి ఉంటుంది. ఐనా మాట్లాడటం ఇప్పుడేకదా మొదలుపెట్టింది....మీరే గమనిస్తూ ఉండండీ.
@తారాగారు: >>"ఐతే రేపు హిందూ మతాన్ని నిషేదిస్తే"<< వారు పెట్టిన నిషేదం చర్చి పరిసరాల్లో మాత్రమే. అసలు ఎక్కడా చేయొద్దూ అని ఏమి పెట్టలేదుగా...
పై లంకెలో లేదెమో కాని, చర్చి పరిసరాల్లో అని కాకుండా అసలు యోగానే నిషేదించారు, కానీ వాటికి ఫత్వ లాగా, చట్టబద్దం కాదు కాబట్టి పెద్దగా ఫలితం కనపడలేదు.
రహమతుల్లాగారు అది నా స్వానుభవం..
ఈ సారి వాదన పెట్టుకుంటాలేండి..
Post a Comment