శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

శఠగోపము అంటే ? !

>> Tuesday, March 2, 2010


చాలామంది గుడికి వెళ్లి దేవ్ఞడి దర్శనం చేసుకుని వచ్చేస్తుంటారు. తీర్థానికి కాని, శఠగోపానికి కాని ప్రాధాన్యం ఇవ్వరు. ఈ శఠగోపం అంటే ఏమిటో, దీనిని గుడికి వెళ్లినపుడు తప్పనిసరిగా ఎందుకు తీసుకోవాలో ఈరోజు తెలుసుకుందాం. దేవాలయంలో దర్శనం అయ్యాక తీర్థం, శఠగోపం తప్పక తీసుకోవాలి. చాలామంది దేవుడ్ని దర్శనం చేసుకున్నాక వచ్చిన పనై పోయిందని చక చకా వెళ్లి ఏదో ఏకాంత నిర్మల ప్రదేశం చూసుకొని కూర్చుంటారు. కొద్దిమంది మాత్రమే ఆగి, శఠగోపం పెట్టించుకుంటారు.

శఠగోపం అంటే అత్యంత రహస్యం. అది పెట్టే పూజారికి కూడా విన్పించనంతగా కోరికను తలుచుకోవాలి. అంటే మీ కోరికే శఠగోపం. మానవునికి శత్రు వులైన కామమూ, క్రోధమూ, లోభమూ, మోహమూ, మదమూ, మాత్సర్యముల వంటి వాటికి ఇకనుండి దూరముగా ఉంటామని తలుస్తూ తలవంచి తీసుకోవటము మరో అర్థం.

సహజంగా చిల్లర లేకపోవటం వల్ల శఠగోపంను ఒక్కోసారి వదిలేస్తుంటాం. ప్రక్కగా వచ్చేస్తాం. అలా చెయ్యకూడదు.
పూజారి చేత శఠగోపం పెట్టించుకొని, మనసు లోని కోరికను స్మరించుకోవాలి. ఈ శఠగోపంను రాగి, కంచు, వెండిలతో తయారుచేస్తారు. పైన విష్ణుపాదాలుంటాయి. ఈ శఠగోపమును తలమీద ఉంచినపుడు శరీరంలో ఉన్న విద్యుత్‌, దాని సహజత్వం ప్రకారం శరీరానికి లోహం తగి లినపుడు విద్యుదావేశం జరిగి, మనలోని అధిక విద్యుత్‌ బైటికెళుతుంది. తద్వారా శరీరంలో ఆందోళనా, ఆవేశమూ తగ్గుతాయి.




[వార్త" దినపత్రిక నుండి]

1 వ్యాఖ్యలు:

చిలమకూరు విజయమోహన్ March 2, 2010 at 2:31 PM  

శ్రీ శఠారి భగవంతుని శ్రీపాదముల స్వరూపము.పన్నిద్దరు ఆళ్వారులలో పరమ శ్రేష్టుడైన నమ్మాళ్వారే శఠగోపులు.తమ అంతిమ సమయంలో ఆ పాదాన్నే స్మరించడం వల్ల వారే ఆ పాదాల క్రింద మారారని,ఆ భగవత్పాదాన్ని, ఏ ఆలయంలోనైనా శ్రీశఠారి అనే అంటారు.భగవంతున్ని చేరుకోవడానికి గురువే మార్గం చూపిస్తాడనటాన్ని కూడా ఇది నిరూపితం చేస్తుంది.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP