తల్లి పదములు చేరి పులకించిన పూబాలలు
>> Monday, March 1, 2010
కమలాక్షునర్చించు కరములే కరములు .
శ్రీమాత చిరునగవు చాలదా మనకు ?
ఋతువులు మాసములెన్నో గడచెను వెతలు దీర్చవెటుబోదునయా !
చదువుల తల్లి వాణి .
బాలా ! మాంపాహి ! ఇది నీలీల
భాగ్యవశాన ఓ మూఢుడు చేస్తున్న పూజకూడా మోదముతో తిలకిస్తున్న ముగ్గురమ్మల మూలపుటమ్మ . అదీ ! తల్లి ప్రేమ .
రాధా,దుర్గ,సావిత్రి,సరస్వతి,లక్ష్మీరూపాలుగా పంచప్రకృతులుగా కొలువుదీరిన తల్లికి కలువపుష్పాలతో సేవ
తల్లి పాదాలు చేరితిమిగదా ! యని తమ భాగ్యానికి మురిసి పులకిస్తున్న పూబాలలు .
[పౌర్ణమి రోజు కలువపూలతో అమ్మను అర్చించాలనే సంకల్పం కలిగింది్ మనసులో . ఆరోజు ఉదయాన్నే నూజండ్ల చెరువులో ఉన్న ఈ పుష్పాలకోసం మనుషులను పంపించాలని అనుకున్నాను . కానీ సమయానికి ఆమనిషిని రాకుండాచేసి ఎలా చేస్తావురా ? అని చిన్న పరీక్షపెట్టింది అమ్మ . నేను చాలా మూర్ఖుణ్ణి .వెంటనే ఓపిల్లవాణ్ని వెంటబెట్టుకెళ్ళి అక్కడ చెరువుకు కాపలాగా ఉన్న నాపూర్వవిద్యార్థి ఒకడు పడవ నడుపుతుండగా గంపెడు కోసుకుని వచ్చి మా అమ్మకు ఇలా పూజ చేసుకున్నాను. ఇలా నాచేతే స్వయంగా తెప్పించుకుని ,అర్చనచేపించుకున్న అమ్మ ప్రేమ నాకెందుకో సరిగా అర్ధమవలేదనుకుంటా ! ఇంకా . ఇంకా ఎన్నెన్ని జన్మలుగడవాలో తల్లిసన్నిధికి చేరాలంటే? ఈ పూబాలలే భాగ్యముచేసుకున్నవో పుట్టినవెంటనే తల్లి పాదాల చెంత చేరుకున్నవి.]
1 వ్యాఖ్యలు:
చాలా చక్కని ఛాయాచిత్రాలను మాకు చూపించినందుకు కృతఙతలు!
Post a Comment