తల్లి పదములు చేరి పులకించిన పూబాలలు
>> Sunday, February 28, 2010
కమలాక్షునర్చించు కరములే కరములు .
శ్రీమాత చిరునగవు చాలదా మనకు ?
ఋతువులు మాసములెన్నో గడచెను వెతలు దీర్చవెటుబోదునయా !
చదువుల తల్లి వాణి .
బాలా ! మాంపాహి ! ఇది నీలీల
భాగ్యవశాన ఓ మూఢుడు చేస్తున్న పూజకూడా మోదముతో తిలకిస్తున్న ముగ్గురమ్మల మూలపుటమ్మ . అదీ ! తల్లి ప్రేమ .
రాధా,దుర్గ,సావిత్రి,సరస్వతి,లక్ష్మీరూపాలుగా పంచప్రకృతులుగా కొలువుదీరిన తల్లికి కలువపుష్పాలతో సేవ
తల్లి పాదాలు చేరితిమిగదా ! యని తమ భాగ్యానికి మురిసి పులకిస్తున్న పూబాలలు .
[పౌర్ణమి రోజు కలువపూలతో అమ్మను అర్చించాలనే సంకల్పం కలిగింది్ మనసులో . ఆరోజు ఉదయాన్నే నూజండ్ల చెరువులో ఉన్న ఈ పుష్పాలకోసం మనుషులను పంపించాలని అనుకున్నాను . కానీ సమయానికి ఆమనిషిని రాకుండాచేసి ఎలా చేస్తావురా ? అని చిన్న పరీక్షపెట్టింది అమ్మ . నేను చాలా మూర్ఖుణ్ణి .వెంటనే ఓపిల్లవాణ్ని వెంటబెట్టుకెళ్ళి అక్కడ చెరువుకు కాపలాగా ఉన్న నాపూర్వవిద్యార్థి ఒకడు పడవ నడుపుతుండగా గంపెడు కోసుకుని వచ్చి మా అమ్మకు ఇలా పూజ చేసుకున్నాను. ఇలా నాచేతే స్వయంగా తెప్పించుకుని ,అర్చనచేపించుకున్న అమ్మ ప్రేమ నాకెందుకో సరిగా అర్ధమవలేదనుకుంటా ! ఇంకా . ఇంకా ఎన్నెన్ని జన్మలుగడవాలో తల్లిసన్నిధికి చేరాలంటే? ఈ పూబాలలే భాగ్యముచేసుకున్నవో పుట్టినవెంటనే తల్లి పాదాల చెంత చేరుకున్నవి.]
10 వ్యాఖ్యలు:
photos bagunnayandi...
అమ్మవార్లు , కలవపూలలో చాలా కళగా వున్నారు.
కనరో భాగ్యము ...... మాది
దుర్గేశ్వర గారు, చేస్తున్న పని చేతిలోనే వదిలేసి, రెక్కలు కట్టుకుని ఆ తల్లి పాదాల చెంత వాలాలి అనిపిస్తోంది. ఇంకేమీ వద్దు ఈ జన్మకి ఇక నీ దగ్గరకు తీసేసుకోమ్మా అని ప్రార్దిన్చాలనిపిస్తోంది.
అద్భుతంగా,కన్నులవిందుగా ఉంది.
photos bagunnai...
your photos excellent,marvellous,beautiful
Awesome.
Appreciate your efforts. We are very lucky to see these snaps.
--Murali.
భాగ్యవశాన ఓ మూఢుడు చేస్తున్న పూజకూడా మోదముతో తిలకిస్తున్న ముగ్గురమ్మల మూలపుటమ్మ . అదీ ! తల్లి ప్రేమ .
ఆర్యా!
తల్లికి మూఢుడైనను; వితండ వివాదిగ నైననూ సరే
ఎల్లలు లేని ప్రేమమున ఇంపుగ వారికి పంచునయ్య! రా
గిల్లెడి మీరు మూర్ఖులన కీచకులంరు ఏమి కావలెన్?
తల్లికి వందనంబులని తప్పక చెప్పుడు భక్తిభాగ్యుడా!
Sivayya adbhutam ga vunnaru....
Post a Comment