శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

చెడు మననలనొదలదు , మనమే దాన్నొదలాలి.

>> Tuesday, February 16, 2010

ఓగ్రామం లోకి ఓసాధువు వచ్చారు . ఆయనదగ్గరకెళ్ళి జనం ఆథ్యాత్మిక సహాయాన్ని పొందుతున్నారు. ఆ గ్రామం లో ఉన్న ఓ ఆథ్యాత్మిక సాధకునికి తన సాధనలో వస్తున్న ఆటంకాలను అధిగమిచలంటే ఇలాంటి సాధుమూర్తుల అవసరం ఉందికనుక తన అనుమానాలు నివృత్తి చేసుకునేందుకు అయన దగ్గరకెళ్ళాడు. వెళ్ళి నమస్కరించాడు.

చిరునవ్వుతో ఆమహాత్ముడు ఏం,కావాలి నాయనా అని అడిగాడు.
మహత్మా ! నాకు భగవంతుని చేరాలనే కోర్కె ఎంతగానో ఉంది . కానీ నాకున్న చెడు అలవాట్లు నన్ను వదలటం లేదు.
నాసాధనకు ఇవి బహుఆటంకాలుగా మారి అడ్డుకుంటూన్నాయి . ఇవి నన్ను పట్టుకుని వదిలేలా లేవు. ఇవి నన్ను వదిలేమార్గమేదైనా చూపండి ,అని వేదనతో వేడుకున్నాడు.

ఇది వింటూన్న ఆమహాత్ముడు హఠాత్తుగా లేచి పరిగెత్తుకెళ్ళి ఓ చెట్టును వాటేసుకుని "వదులు .నన్నొదులు ,అయ్యో నన్నొదిలి పెట్టు ,ఎవరైనా దీనినుంచి పట్టునుంచి నన్ను కాపాడండి ఈచెట్టు నన్ను వదలటం లేదు, అని బిగ్గరగా అరవటం మొదలెట్టాడు.
చూస్తున్న ఈ సాధకునకు చిరాకనిపించింది.

అయ్యా! ఏమిటిది బహుచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. చెట్టుమిమ్ము పట్టుకోలేదు. మీరే చెట్టును పట్టుకున్నారు. అది వదలేదేమిటి ? మీరేదాన్ని వదలి ఇవతలకు రావచ్చుకదా ! అని ప్రశ్నించాడు.
అవునుకదా ! మనలను చెడు అలవాట్లు వదలటమేమిటి ? మనమే వాటిని ఒదిలితే సరి. అని ఆయన చెట్టువదలి ఇవతలకొచ్చాడు.
ఇదే నాయనా మనిషి అమాయకత్వం . చెడు మనలను పట్టుకోదు .దానిని మనమే పట్టుకుని వదిలించండీ అని వేదనతో విలపిస్తుంటాము. మనమే వాటిని వదలివేస్తే సరిపోతుందనే విషయం ఏల గమనించము ? అని ప్రశ్నించాడు తిరిగి.

ఆమహాత్ముని బోధన అర్ధమైన ఆసాధకుడు నమస్కరించి వెళ్ళిపోయాడు ,తనలో లోపాలను ఎలా వదలాలో తెలిసి.

1 వ్యాఖ్యలు:

సుజాత వేల్పూరి February 16, 2010 at 7:47 PM  

చెడు మనలను పట్టుకోదు .దానిని మనమే పట్టుకుని వదిలించండీ అని వేదనతో విలపిస్తుంటాము. మనమే వాటిని వదలివేస్తే సరిపోతుందనే విషయం ఏల గమనించము ?.....ఈ ప్రశ్న ప్రతి మనిషీ వేసుకుంటూ ఉండాలి తరచుగా! బాగా చెప్పారండీ!

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP