గోత్రనామాలు పంపి కళ్యాణోత్సవానందం లో ఉన్న స్వామికి ఈ తులసీదళం సమర్పించండి .
>> Friday, January 22, 2010
పీఠములో ఈనెల 25 న జరుగుతున్న కళ్యాణోత్సవం లో దేవేరులతో ఆనందోత్సాహములతో కొలువై ఉండేస్వామికి గోత్రనామాలు పంపిన ప్రతి ఒక్కరి తరపున ఓతులసీదళం సమర్పించి వారిని అనుగ్రహిచమని కోరుతూ ప్రత్యేక అర్చన జరపనున్నాము. మీరు ఇంతకు మునుపే ఈ యాగానికి గోత్రనామాలు పంపిఉంటే అవసరం లేదు .పంపని వారు ఇప్పుడైనా పంపి ఆరోజు విష్నుసహస్రనామ పారాయణం , ఓం నమో నారాయణా య అనే మంత్రరాజమును జపించగలరు.
అలాగే స్వామి పాదాలవద్ద సమర్పించిన ఓ తులసి దళం , తలంబ్రాలు పోసుకున్న పవిత్రాక్షతలు ,అమ్మవారి కుంకుమ,యజ్ఞకుండములలో విభూతి ప్రసాదంగా భక్తులకు ప్రసాదంగా పంపదలచాము .వీటిని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా పవిత్రంగా దాచుకుని వాడుకోగలిగితేనే కోరగలరు. సకల శుభాలను కలిగించగల ఈ దివ్య ప్రసాదాలను పంపాలంటే పోస్ట్ ఖర్చులు ,మాత్రం మీరే భరించాలి . ఎంత అన్నది మీ కు పంపటానికి ఇక్కడనుండి ఎంతవుతుందో అంతమాత్రమే . ఫోన్ లోసంప్రదించండి ఎలా పంపాలో చెబుతాము .
సర్వేజనా సుఖినోభవంతు.
2 వ్యాఖ్యలు:
జనుల హితాన్ని కోరి మీరు చేస్తున్న ఈ యాగం మిక్కిలి ప్రశంసనీయం. మా గోత్ర నామాల్ని ఇంతకు ముందే పంపించాను. స్వామి వారి అర్చనలో మమ్మల్ని చేర్చగలరు.
ఓం నమో నారాయణాయః.
nanna kalyanotsawam photolu unte publish cheyandi
Post a Comment