>> Wednesday, January 27, 2010
శ్రీని వాసుని కల్యాణం పీఠములో లో కన్నులపండువగా సాగింది . దర్సనమిచ్చి ధన్యులను ఆసిఇనులై వైభవంగా సాగిస్తున్న సాగిన క్రతువు లో శ్రీవేంకటేశ్వరుడు శ్రీదేవి భూదేవి సమేతంగాను శ్రీ రామలింగేశ్వరుడు భవానీ సమేతంగాను తరలివచ్చి వివాహోత్సవం జరిపించుకుని తమ వైభవదర్శనమును భక్తులకు ప్రసాదించారు. స్వామి వారల తరపున మరియు అమ్మవార్ల తరపున భక్తులు ప్రాతినిధ్యం వహిస్తూ వివాహ తంతు లన్ని శాస్త్రీయంగా నిర్వహించారు. ఈసంవత్సరం హైదరాబాద్ వాస్తవ్యులు పండ్రంగి బాలగంగాధర తిలక్ దంపతులు శివపార్వతుల కల్యాణమూర్తులను పీఠమునకు సమర్పించారు .ఆదివ్యమూర్తులను మళ్ళా వాసుబాబుగారు హైదరాబాద్ నుంచి తీసుకవచ్చి కల్యాణవేదికకు చేర్చారు . దివ్య తేజస్సుతో విరాజిల్లుతున్న ఆమూర్తులు ఆభక్తదంపతుల మనసులోని భక్తిభావాన్ని ప్రతిఫలింపజేస్తూ కన్నులపంటైనారిక్కడ .
ఉదయాన్నే మూలవర్లకు అభిషేకాదులు అర్చనలు సాగగా ,తదనంతరం శ్రీమన్నారాయణ శరణాగతి యాగం పూర్ణాహుతి హోమము ద్వాదశ కుమ్డీయంగా భక్తులచే జరుపబడింది . యాగములో పాల్గొన సంకల్పించి గోత్రనామాలు పంపిన భక్తుల తరపున సంకల్పములు చెప్పి పూర్ణాహుతి సమర్పిమ్చటం జరిగింది.
తదనంతరం ఉత్సవమూర్తులను భక్తులు వివాహవేదికకు తోడ్కొనిరాగా వారిని పెండ్లికుమారులను ,పెండ్లికుమార్తెలను గావించి పురోహితులు వేద మంత్రాలతో క్రతువు నిర్వహించారు. భక్తులంతా పోటీలుపడి వివాహమూర్తులకు తలంబ్రాలు పోసి తమ స్వంత బిడ్డలకు కల్యాణం జరుపుకున్న ఆనందాన్ని పొందారు. అనంతరం భక్తులు స్వామివారాలకు నూతన వస్త్రాదులను కానుకలను సమర్పించి మురిసి పోయారు . చిరునవ్వులోలికిస్తూ శ్రీవారొకవైపు దేవేరులతో ను ,ఆది దంపతులైన శివపార్వతులు మరొకవైపుదర్శనమిచ్చి ధన్యులను చేశారు
వచ్చినవారందరికీ అమెరికాలో ఉంటున్న పెండేల సూర్యనారాయణగారు తన తల్లీదండ్రులు లక్ష్మణమూర్తి -జయలక్ష్మి గారలను పంపి వివాహవిందు ఏర్పాటుచేశారు . వయోభారాన్ని లెక్కచేయకుండా ఎక్కడో వైజాగ్ నుంచి వందలమైల్లు ప్రయాణించి వచ్చి వారిచ్చిన విందు ను అతిథులు పదేపదే పొగుడుతూ వంతకాలు చాలా రుచికరంగా వున్నాయని ఈరోజుకూడా ఫోన్లో చెబుతున్నారు. అది ఆమ్మవారి పట్ల వారి కున్న భక్తికున్న శక్తివలన వచ్చిన రుచనినేను విన్నవిస్తున్నాను.
{అనుకోకుండా వేరొకరు తన కెమెరా చిప్ను నాసిస్టమ్ కు అనుసంధానించటం వలన వైరస్ సోకి సిస్టమ్ పనిచేయకపోవటం , ఒక్క ఫోటోకూడా రాకపోవటం వల ఫోటొలివ్వలేకపోయాము .ఈ విషయాలను వ్రాయటానికి కూడా ఆలస్యం అయినది.]
0 వ్యాఖ్యలు:
Post a Comment