శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

వేదమూర్తి,తపోనిష్ఠ ,గురుదేవులు శ్రీరామశర్మ ఆచార్యులవారి పరిచయం

>> Tuesday, January 19, 2010


పరమ పూజ్య గురుదేవులు పండిత శ్రీరామశర్మ ఆచార్యులవారు ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా సమీప్ం లోగల ఆవల్ ఖేడ్ లో శక సంవత్సరం 1967 ఆశ్వయుజ కృష్ణత్రయోదశి శుభదినాన [క్రీశ 1911sep20] నాడు సంపన్న బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. దశవర్ష ప్రాయం లో మాననీయ మదనమోహన్ మాలవ్యా వారివద్దనుండి గాయత్రీ మంత్రదీక్షను స్వీకరించారు యజ్ఞోపవీత ధారణావిధితో. పదునైదు వర్షముల ప్రాయం లో గురుసత్తా సాక్షాత్కారం పొందారు. వారి నిర్దేశానుసారం అఖండదీపాన్ని ప్రజ్వలింపజేసి 24సంవత్సరాలపాటుసాగే 24 లక్షల సంఖ్యగల 24 గాయత్రీ మంత్రపురశ్చరణ ప్రారంభించారు. కౌమార దశలోనే స్వాతంత్ర్య సమర సేనాని పనిచేశారు. గాంధీజీని రాజకీయగురువుగా ఎన్నుకున్నారు. మార్గదర్శనం పొందటానికి పలుమార్లు సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించారు .1940 వసంతపంచమి రోజున అఖండజ్యోతి మాసపత్రికను ప్రారంభించి దానిని తరువాత మధురనుండి ప్రచురిస్తూ నడిపారు. తనగురుదేవులు సర్వేశ్వరానందుల నిర్దేశాలననుసరించి హిమాలయ యాత్రలు చేసి ఆరుమాసాలనుండి ఒక్కసంవత్సరకాలములుగా అజ్ఞాతవాసములో కఠోరమైన తపోసాధన చేశారు. 24 పురశ్చరణలను పూర్తిచేసి 1953 లో పూర్వం దూర్వాసమహర్షి తపోస్థలిలో గాయత్రీ తపోభూమిని నిర్మించారు. అఖండాగ్ని ప్రజ్వలింపజేశారు. 1957 లో సహస్రకుండీయ గాయత్రీయజ్ఞాన్ని మథురలో నిర్వహించి "గాయత్రీ పరివార్"ను సంఘటితపరచి గాయత్రీ మహావిజ్ఞానన్ని మూడు సంపుటులుగా ప్రచురించారు. 1960 లో తన మూడవ అజ్ఞాతవాసం నుండి బయటకు వచ్చి నాలుగు వేదములకు భాష్యము ,౧౦౮,ఉపనిషత్తులు ,౨౦స్మృతుల అనువాదము 18పురాణాల పునరుద్ధరణ ,దర్శనాలకు భాష్యం ప్రచురించారు . తరువాత యుగనిర్మాణ యోజన ప్రకటన,,1963 లో శతసూత్రాల యోజన ప్రకటన ,దేశవ్యాప్తంగా సమాజ నిర్మాణ కార్యక్రమ క్రియాన్వయం చేశారు. యజ్ఞశృంఖలా సంచాలనం, దేశవ్యాప్తంగా మంత్రలేఖనాసాధనా ప్రసరం,2400 కోట్ల గయత్రీ హస్తలిఖిత మంత్రసంగ్రహం చేశారు. ధర్మ,ఆథ్యాత్మ,గాయత్రీనిర్మాణములతో కూడిన వైజ్ఞానిక ఆథ్యాత్మ వాదం పైఅ 3000 కు మించి చిన్నాపెదా పుస్తకాలను రచించి ప్రచురించారు .షష్ఠిపూర్తి అనంతరం 1971 june20 నాడు మథురవదలి సంవత్సరంపాటు ఉగ్రతపస్సుకై హిమలయప్రస్థానం ,ధర్మపత్ని వదనీయ మాతా భగవతీ దేవిచే హరిద్వార్ లో శాంతికుంజ్ ఆరంభం.
నూతన శక్తికేంద్ర సంచాలనం ,జాగృతాత్మలకొరకు ప్రాణ ప్రత్యావర్తన,చామ్ద్రాయణ,కల్ప,సంజీవ సాధన శిబిరముల నిర్వహణ . ఒక విశాల శాంతికుంజపరివారంగా 240 మంది సంపూర్ణ సమయదానం చేసే కార్యకర్తల ఆగమనం,2400 శక్తిపీఠాల శిలాన్యాసంకొరకు,ప్రాణప్రతిష్ఠకొరకు భార్తదేశమంతటా పర్యటన.

విజ్ఞాన-ఆథ్యాత్మల సమన్వయం ,గాయత్రీమంత్రశక్తి -యజ్ఞ విద్యలపై పరిశోధనలకొరకు చికిత్సక-వైజ్ఞానికులకు స్వయంగా మార్గదర్శనం చేసి బ్రహ్మ వర్చశ్ శోధ్ సంస్థాన్ నిర్మించారు . ఒక పరిపూర్ణ,ఆధునిక ప్రయోగశాలను 1979 లో నిర్మించారు .1984 లో సూక్ష్మీకరణ ,పంచకోశ సాధనను ప్రారంభించారు .వజ్రోత్సవాలసందర్భంగా 108 కుండీయ గాయత్రీ మహాయజ్ఞాలు ,జాతీయ ఐక్యతా సమ్మేళనాల శ్రుంఖల దేశవ్యాప్తంగా జరిగాయి.విప్లవాత్మక దీపయజ్ఞనిర్ధారణ ,విశ్వవ్యాప్తశ్రుంఖల ఆరంభం . జీవన ఉత్తరార్ధం లో విప్లవసాహిత్యలేఖనం ,21వశతాబ్ది ఉజ్వలభవిష్యత్ ప్రకటన .1990 june 2 న గాయత్రీ జయంతిశుభదినాన గాయత్రీ మాతృనామోఛ్ఛరనతో మహా ప్రస్థానం .. తమ కార్యభారాన్ని ,శక్తిని వందనీయ మాతాజీకి సమర్పణం .



-----------------------------------------------------------------------------------------------
ఆధునిక కాలంలో మహాతపశ్వీ , గాయత్ర్రీ పరివార్ వ్యస్థాపనద్వారా జాతి జవజీవాలను చైతన్యపరచిన మహాయోగి పూజ్య శ్రీ శ్రీరామశర్మ ఆచార్యులవారి గూర్చి సంక్షిప్త పరిచయమిది . మీకు దగ్గరలోగల గాయత్రీ పరివార్ శాఖలవద్ద ఆచార్యుల సాహిత్యామృతాన్ని పొందవచ్చు .

1 వ్యాఖ్యలు:

Rajasekharuni Vijay Sharma January 20, 2010 at 12:37 AM  

ఓ తపోధనుల పరిచయ భాగ్యం కలిగించారు. ధన్యవాదాలు.

ఇంకా ఆధునిక కాలంలో ఇలా తపస్సంపన్నులైన వారి చరిత్రలు ఏమైనా తెలియజేయ గలరు.

అది పలువురు ఆస్థికులైన సాధకులకు మరింత ప్రోత్సాహాన్నిస్తుంది.

అవ్బును ఈ మధ్య ఈ పదనిర్ధారణ పెట్టారేంటి?

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP