శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఒక మూల కూర్చొని, కళ్లు మూసుకొని తపస్సు చేసుకుంటున్న వ్యక్తి 1960లో జరగాల్సింది 1950లోనే చెప్పారా!

>> Wednesday, January 20, 2010

మనకు సాధారణ దృష్టిమాత్రమే ఉంటుంది. మహాత్ములకు దివ్యదృష్టి ఉంటుంది. అది కాలం లోకి వెనుకకు ముందుకు చూడగల శక్తివంతమైన చూపు. ఇది సాధ్యమా అని అనుమాన పడక్కరలేదు. వారి సాధనాశక్తితో ఆస్థితిచేరుకున్నారుగనుక వారికి సాధ్యమే. యాంత్రిక శక్తితో మనం సాధారణంగా కంటికి కనిపించని సూక్ష్మాంశాలను చూడగలుగుతున్నాము .మరి అంతకంటే శక్తివంతమైన దివ్యచక్షువులద్వారా పైచూపు సాధించగలరనటం లో అనుమానం అక్కరలేదు. అసలు ఆస్థితిని గూర్చి ఆలోచనలే చేయలేని కుహన మేధావులు అదంతా ఉత్తిదే అని తమ పరిధిలో చెప్పినా సత్యం సత్యంకాకపోదుకదా !

ఈస్థితిని సాధించిన మహాయోగులు ప్రపంచం లో మిగతా ప్రాంతాలలో ఎక్కడో ఒకచోటమాత్రమే కనపడతారు. కాని ఈపుణ్యభూమిలో అడుగడుగునా అటువంటి మహాయోగులు గూర్చిన వివరాలు మనకు దొరుకుతాయి. కలిప్రభావం చేత ఈ విజ్ఞానాన్ని అవహేళనచేసుకుని దూరం చేసుకుని మన జాతి నష్టపోతున్నది.

మనం నేలమీద నిలబడి కొంతమేరకు చూడగలుగుతాము . అదే మేడనెక్కినప్పులింక్డు ఇంకా ఎక్కువదూరం చూస్తాము. కొండనెక్కి చూస్తే మనదృష్టి పరిధి చాలా విశాలం అవుతుంది . అలానే మనం చర్మచక్షువులతో చూడగలిగినదానికన్నా మహర్షులు జ్ఞానచక్షువులతో కోట్లరెట్లు ఎక్కువపరిధిలో చూడగలుగుతారు . కాబట్టే మన పుణ్యగ్రంథాలలో ,పురాణాదులలో మహర్షులు ఇలాంటి దృష్టి కలవారనటానికి ఉదాహరణలు కోకొల్లలు. ఆకాలం లోనేకాదు ఆధునికకాలంలో సహితం భారతమాత అలాంటి యోగిపుంగవులకు జన్మనిస్తూనేఉంది. అటువంటి ప్రత్యక్షప్రమాణాన్ని ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురించారు చూడండి. ఈలింక్ లో .http://uni.medhas.org/unicode.php5?file=http%3A%2F%2Fwww.andhrajyothy.com%2Fnavshow.asp%3Fqry=%2F2010%2Fjan%2F20navya8

హాట్సాఫ్‌ శ్రీఅరబిందో

శ్రీఅరవిందులు రాజకీయాలను, వాటి పర్యవసానాలను తన తపోదృష్టితో చూసి చెప్పేవారు. ఒక మూల కూర్చొని, కళ్లు మూసుకొని తపస్సు చేసుకుంటున్న వ్యక్తి 1960లో జరగాల్సింది 1950లోనే చెప్పారా!
"భారత్‌పై చైనా దురాక్రమణ చేస్తుంది. టిబెట్‌ను దాటి భారతదేశంలో చొరబడి తన సరిహద్దులను విస్తరించుకోవాలనుకుంటున్నది. ఆ సమయంలో భారత్‌కు అమెరికా అండగా నిలిచి చైనా దాడిని ఎదుర్కొనడంలో సాయపడుతుంది అని శ్రీఅరవిందులు 1950లో భారత ప్రజలకు చెప్పారు. శ్రీఅరవిందులు రాజకీయాల నుంచి విరమించి, పూర్తిగా తన సమయాన్ని ఆధ్యాత్మికంగానే గడిపినా, అవసర సమయాలలో భారత నాయకులకు తన సందేశాలను ఇవ్వడం మాత్రం మానలేదు. శ్రీఅరవిందులు రాజకీయాలను, వాటి పర్యవసానాలను తన తపోదృష్టితో చూసి చెప్పేవారు. రాజకీయాల నుంచి విరమించుకొని తపస్సులో మునిగిన వారికి రాజకీయాలెందుకు అన్నవారూ లేకపోలేదు.

నిజమైన హెచ్చరిక
1962లో చైనా భారతదేశంపై దురాక్రమణం చేయనే చేసింది. భారత్‌కు అనేక అంతర్జాతీయ విషయాలపై, ముఖ్యంగా కాశ్యీరు సమస్యపై, ఐక్యరాజ్య సమితిలో అండగా నిలిచిన రష్యా కూడా ఈ దురాక్రమణపై వ్యాఖ్యానిస్తూ ఇది తన సోదర దేశమైన చైనాకూ, మిత్ర దేశమైన భారత్‌కూ మధ్య ఏర్పడిన సరిహద్దు వివాదం. అది వారే పరిష్కరించుకుంటారు అని ముఖం చాటేసింది.

అంతక్రితమే చైనా ప్రధాని చౌ-ఎన్‌-లై సుహుృద్బావ పర్యటన పేరుతో భారత్‌కు వచ్చినప్పుడు టిబెట్‌ను చైనాలో అంతర్భాగంగా అంగీకరిస్తూ సంయుక్త ప్రకటనలో ఒక అంశంగా చేర్చారు. టిబెట్‌ ఒక స్వతంత్ర దేశంగా ఉన్నట్లయితే అది భారత్‌కు ఒక శాటిలైట్‌ దేశంగా ఉండి మనకూ - చైనాకూ మధ్య ఒక ప్రత్యేక దేశంగా ఉండేది.

ఇపుడు చైనా, టిబెట్‌ను దాటి అస్సాంలోని తేజ్‌పూర్‌ చమురు బావుల వరకు చొచ్చుకు వచ్చింది. సరిగ్గా ఈ సమయంలో అమెరికా జోక్యం చేసుకొని అది మరొక ప్రపంచ యుద్ధంగా మారకుండా నిరోధించింది. ప్రతిరోజూ నాలుగు యుద్ధ విమానాల ద్వారా అత్యంత ఆధునిక ఆయుధాలను భారత సైన్యానికి అందించి మనకు అండగా నిల్చింది. మరో పక్క దౌత్యరంగంలోనూ భారత్‌ను సమర్థిస్తూ వచ్చింది. చివరికి ఏది ఏమైతేనేం చైనా తనంతట తాను యుద్ధం విరమించి సీజ్‌ఫైర్‌ను ప్రకటించి వెనకకు తగ్గింది.

వండర్‌ఫుల్‌
కెన్నెడీ లీడరుకు రాయబారిని పంపిన నెహ్రూ 1950లోనే చైనా భారత్‌పై దురాక్రమణ జరుపబోతున్నదనీ అమెరికా అండగా నిలుస్తుందనీ శ్రీ అరవిందులు చేసిన హెచ్చరికను ఆనాటి ప్రధాని శ్రీ జవహర్‌లాల్‌ నెహ్రూ 1963 మార్చిలో అప్పటి అమెరికా ప్రెసిడెంట్‌ జాన్‌.ఎఫ్‌. కెన్నడీ వద్దకు తన ప్రత్యేక రాయబారిగా సుధీర్‌ఘోష్‌ను పంపుతూ అనేక విషయాలతో పాటుగా, తన లేఖలో (5-1-1963). ఈ విషయాన్ని కూడా పొందుపరచారు.

శ్రీ అరవిందులు చెప్పిన ఈ భవిష్యత్‌ ఉదంతాన్ని అధ్యక్షుడు పదే పదే శ్రద్ధగా చదివి "శ్రీ అరవిందులకు నా అభినందనలు అందచేయండి. బహుశా 1960కి బదులుగా 1950 అని టైపులో పొరపాటుగా పడి ఉంటుంది. సరిచేయించండి'' అన్నారు. దానికి సుధీర్‌ "సర్‌! అది టైప్‌ మిస్టిక్‌ కాదు. శ్రీఅరవిందులు 1950 డిసెంబరులోనే శరీరాన్ని వదిలారు''అని సమాధానం ఇచ్చారు. "వాట్‌! మీరేమంటున్నారు! భారతదేశంలో ఒక మూల కూర్చొని, కళ్లు మూసుకొని తపస్సు చేసుకుంటున్న వ్యక్తి 1960లో భారత్‌పై చైనా దాడి చేస్తుందనీ, అమెరికా భారత్‌కు అండగా నిలుస్తుందనీ చెప్పారా! రియల్లీ వండర్‌ఫుల్‌'' అని కొన్ని క్షణాలు మౌనంగా ఉండి "హాట్సాఫ్‌ టు యూ! శ్రీఅరబిందో''అని జోహార్లర్పించారు.

-కొంగర భాస్కరరావు




2 వ్యాఖ్యలు:

చింతా రామ కృష్ణా రావు. January 21, 2010 at 5:54 AM  

అణిమా మహిమా చైవ గరిమా లఘిమా తథా
ప్రాప్తి: ప్రాకామ్యమీశత్వం వశిత్వంచాష్ట భూతయ:.

అని మన పూర్వీకులు ఏ నాడో చెప్పినా ఈ నాడు నమ్మ గలిగే అవగాహనాశక్తి గలవారెందరున్నారో తెలుస్తూనే ఉంది కదా!
ఇలాంటి సంఘటనలకు సంబధించిన విషయాలు ఈ విధంగా తెలియజేస్తున్నందు వల్ల కొంతైనా జ్ఞాన చక్షువుతో చూచి, నమ్మగలగవచ్చు కొందరైనా.
ఇంతటి చక్కని విషయాలను వ్రాస్తున్నాఅంధ్ర జ్యోతి నిజంగా అంధ్ర జ్యోతే.
ప్రత్యేకించి మీరు సూచించి చదివేలాగ చేసినందుకు మీకు నా ప్రత్యేక ధన్యవాదాలు

డా.ఆచార్య ఫణీంద్ర January 22, 2010 at 9:10 AM  

తన జన్మదినం ( 15 ఆగస్టు ) నాటికి దేశానికి స్వాతంత్ర్యం సాధిస్తానని ముందే చెప్పి, దాని కొరకే తపోనిష్ఠలోకి వెళ్ళారాయన. ఆశ్చర్యకరంగా 15 ఆగస్టు నాడే మనకు స్వాతంత్ర్యం లభించడం నమ్మినా, నమ్మకపోయినా జరిగిన వాస్తవం. ఇటీవల చెన్నై వెళ్ళినప్పుడు, అదే పనిగా ’ పుదుచ్చేరి ’ వెళ్ళి, ఆ మహనీయుని ఆశ్రమాన్ని, సమాధిని దర్శించుకొని పునీతుడనయ్యాను.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP