స్వామి సమర్ధులు[అక్కోల్ కోట్ స్వామి]దివ్యచరిత్ర చదవండి
>> Friday, January 8, 2010
మీరెవరు ? "అని అడిగితే" వటవృక్షము . మూలము . మూలానికి మూలము. మాది దత్తనగరము " అన్నారు స్వామి సమర్ధ. సనాతనుడైన దత్తస్వామి ఈ యుగం లో ఐదు రూపాలు దహరించి మానవోధ్దరణకు అవసరమైన్ జీవన విధానము సద్గురుసేవా సాంప్రదాయమునెలకొల్పి పాలిస్తున్నాడు . ఆరూపాలలో ఒక రూపము శ్రీస్వామి సమర్ధ. ఈయనే సనాతనుడైన దత్తస్వామి. ఈయనే శ్రీపాద శ్రీవల్లభులు ,వీరే శ్రీమాణిక్యప్రభువులు వీరేశిరిడీసాయినాథులు .ఈ అయిదు పరిపూర్ణదత్తవతార చరిత్రలను కలిపి దత్తస్వామి చరిత్ర అని అంటారు ఎక్కిరాల భరధ్వాజ్ మాస్టారు.
మతసామరస్యము ,సౌభ్రాతృత్వము మొదలగు అసలైన ధర్మాలను జీవితాన్ని తమ దివ్యలీలలుబోధలద్వారా మానవజాతికి అందించటమేకాక దర్శన స్పర్శన మాత్రాన ,స్మరణ మాతాన్నే ఎందరో భక్తులకు ఉత్తమ ఆథ్యాత్మిక స్థితిని ప్రసాదిమ్చి మహనీయులుగా రూపొదించిన శ్రీ స్వామి సమర్ధులు స్మృతిమాత్ర ప్రసన్నులు. వీరి జీవిత చరిత్రను పారాయణం చేయటం ఎంతో శ్రేయస్కరం. మనలోవున్న రాగద్వేష అసూయాది భావాలను నిర్మూలించుటేకాక మన నిత్యజీవితం లో మనమెదుర్కునే సమస్యలనుంచి విరామాన్ని,అందు ఆచరణ యోగ్యాన్ని ప్రసాదించగల ఈ చరిత్ర మనకు తెలుగులో శ్రీస్వామిసమర్ధ అన దివ్యనామంతో రచించి ప్రచురించారు మాస్టర్ గారు.
దొరికేచోటు : శ్రీగురుపాదుకా పబ్లికేషన్స్
ముంగమూరు డొంకరోడ్ ,ఒంగోలు -2
phone 08592233271
0 వ్యాఖ్యలు:
Post a Comment