కూరలో ఉప్పు తగ్గిందా !? రాష్ట్రం వల్లకాడవుతుంది జాగ్రత్త !
>> Friday, January 8, 2010
తెలుగుప్రజలు పరమ మూర్ఖులు అనే ముద్రపడిపోయేట్టుంది మనకు. ఏచిన్న సంఘటనకైనా విపరీతం గా స్పందించటం ఒళ్ళుకాలబెట్టుకుని ఇల్లుతగలబెట్టుకుని బజార్నపడటం సాధారణమైపోతుంటే ఇంతకంటే మరేమి గుర్తింపు పొందగలం ? . ఒకనాయకుడు మరణించినా , ధరలు పెరిగినా , జీతాలు తరిగినా ,అఫొహలైనా ,అనుమానాలున్నా ఉన్మాదం తో ఊగిపోతూ బస్సులు ,ఆస్తులు తగలెట్టుకునే పైశాచిక తత్వం ముదిరిపోతున్నది. ఎవడికి వాడు వీరుడైపోతున్నాడు ఉమ్మడి అస్తులను ధ్వంసం చేసి . ఇక రానున్న రోజులలో ఇంట్లో కూరలో కారం తక్కువైనా ,ఉప్పెక్కువైనా ఊరిమీదబడి ఏదికనపడితే దాన్ని తగలెట్టే మానసిక రోగ మహావీరుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయే సూచనలు కనపడుతున్నాయి. ఇంట్లో పెళ్ళాం మీద ఎగిరితే ఏంజరుగుతుందో తెలుసుకనుక రాష్ట్రం వల్లకాడవుతుందని హెచ్చరించగల నాయకులు మనకు దిశానిర్దేశం చేస్తున్నారు మరి.దీనికి మందు ఒక్కటే.
స్వేచ్చ మరీ ఎక్కువై పోయింది మనకు . కాబట్టి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను రద్దుచేసి కొరడాపట్టుకుని పాలించే వ్యవస్థ కావాలి. తాడేపల్లిపల్లిగూడెం లో చింతపండు ధరపెరిగితే తాడిపర్తిలో ధర్నా చేయటానికి రోడ్డేక్కే అలవాటొచ్చేసిందికనుక ఇలాంటివార్తలను ప్రసారం చేసి ఈ ఉన్మాదాలను హీరోయిజంగా చిత్రీకరిస్తున్న ప్రసార మాధ్యమాలను రద్దుచేయాలి . రోడ్డెక్కిన వాణ్ణి ఎక్కినట్టు పిట్టల్లా కాల్చేయాలి . పనిస్తేనే ఆరోజు బువ్వ పెట్టే పథకంతో కొంతకాలం పాలించేస్తే అప్పుడు స్వేచ్చ కోసం అలమటించి దాని విలువతెలిసి అప్పుడు సక్రమంగా స్వేచ్చను వినియోగించుకుంటాము మనము . ఇంతకంటే మార్గమేమీ లేదనిపిస్తుంది. ఎన్నికలు, ప్రజాస్వామ్యాలు , మన ఒంటికి పడవని తేలిపోతూవుంటే ఇంకేమాసించగలం ? ఈ వ్యవస్థలనుండి.! అరమనిషిబలం ఆరుగురు మనుషుల ఆవేశం గల ఈతరం నుండి. !
4 వ్యాఖ్యలు:
Wow.
"అరమనిషిబలం ఆరుగురు మనుషుల ఆవేశం గల ఈతరం నుండి. !
"
Well Said.
ఏ నాయకులైనా, ఆ జాతి లోంచే వస్తారు. మన లీడర్స్ని అనుకొని ఏం ప్రయోజనం. ఒక సమూహంగా మనం ఇంత రాక్షసంగా, అమానవీయంగా ప్రవర్తిస్తున్నప్పుడు, నాకు మన సమాజం మీద వున్న గట్టి నమ్మకం, ఎక్కడో సన్నగా మూలాల్లో కదుల్తున్న భావన.
మన దేశంలో సైలెంట్ మెజారిటీ ఇంత స్తబ్ధంగా ఎందుకు మిగిలి పోయింది. ఇక ఇంతేనా.. ఈ పది శాతం మనుషుల్ని, మన 90 శాతం మీద ఇలా ఎప్పటికీ స్వారీ చేయనిద్దామా?
రోడ్డెక్కిన వాణ్ణి ఎక్కినట్టు పిట్టల్లా కాల్చేయాలి ................
Vaammo mee Poleesu raajyam kante prastuta araachaka Democracy ye meulu.
Takkuva mandi chastaaru.
Takkuva aasti nashtam jarugutundi.
niyamtrutvam vaste nitya vallakaade kada.
మా బాగా చెప్పారు. తెలుగు వాళ్లకి మూడింది అందుకే రాష్ట్రపతి పాలన పెట్టేస్తే పీడా పోతుంది.
"Rama baanam aarpinda ravana kaastam
Krishna geetha aapinda nitya kurukshetram...
Maradu lokam, maradu kaalam, devudu digiraani, evvaru emaioponi...
balavanhude bathakaalani sookthi maravakunda...
Sathabdaalu chadavaledaa ee aranya kaanda" - Gayam - Sirivennela
Post a Comment