మిత్రపుత్ర,కళత్ర శతృత్వ కారకాయై నమ:
>> Wednesday, December 16, 2009
మిత్ర,పుత్ర,కళత్ర శతృత్వ కారకాయై నమ:
______________________________________
పై నామాన్ని మీరెప్పుడో పూజలో వినిఉంటారు కదా ? ఇది శనీశ్వరుని అష్టోత్తరశతనామావళి లో ఒకటి . ఏమిటయ్యా ఈ నామానికి అర్ధం అంటే .ప్రాణ స్నేహితులనైనా ,కడుపున పుట్టిన పుతృనితోనైనా .చివరకు కట్టుకున్న భార్యతోనైనా విబేధాలు తెచ్చి శతృత్వం కలిగించగల స్వామి అని నమస్కరించటం.
ఇటువంటి నామాన్ని జపించటమెందుకు? అలాంటివారిని పూజించటమెందుకు ? అని మీరు కోపపడవచ్చు. కానీ విశ్వసృష్టి పాలనా ధర్మాన్ని పాటించే శక్తులే నవగ్రహ దేవతలు . మనం కావాలనుకున్నా ,వద్దనుకున్నా వారి ధర్మం వారు నిర్వర్తించవలసినదే. కర్తవ్య బద్ధులు . కాబట్టి వారివారి సంచారం జరిగేప్పుడు ఆయా ఫలితాలను ఆజీవులకు అందిస్తుంటారు. బాగా బలవంతునితో విరోధం పెట్టుకోవటం కంటే మిత్రత్వం నెరపి ,అతని గుణగణాలను పొగడి ఆతని బారినుంచి కొద్దిగా తప్పించుకునే అవకాశాలు ఉన్నాయి కదా సాధారణ జీవనం లో. కాబట్టే నవగ్రహ పూజలు శాంతులు . గర్వించి తమ బలాలమీద ఆధారపడినవారికంటె దైవాన్నాశ్రయించిన వారిపైన వారి విరోధభావం అంతగా ఉండదు.
శనీశ్వరుడు ఆథ్యాత్మిక భావాలను పెంపొందించేవాడు ,మంచి చూపులలోఉన్నప్పుడు అధికారాన్ని సహితం ప్రసాదించగలవాడు. అయితే వక్ర దృష్టి సమయం లో మాత్రం పైన చెప్పినవిధంగా నానాయాతనలు పెట్టి విరోధాలు కల్పించి ఆ జీవి ఖర్మ ఫలితాలను అనుభవింపజేస్తాడు .
ప్రస్తుతం మన రాష్ట్ర విషయానికొస్తే .ఇది ఏర్పడ్డ సమయము చిత్తా నక్షత్రము .కన్యారాశికి చెందిన నక్షత్రమిది .ఇప్పుడు కన్యారాశిలో శని సంచారం జరుగుతున్నందున .అన్నదమ్ములమధ్యే కత్తులు నూరుకునే కర్కశత్వం పెరుగుతున్నది. అదిగాక ఇది విరోధినామ సంవత్సరం లేస్తే తగాదాలే. సంవత్సరం మొదటినుంచి కూడా .
ఈసమయం లో భగవంతుని ఆశ్రయించి భగవత్ కృపను పొందే యత్నం చేయటం మానవుని విధి. తద్వారా ఈ ఆటంకాలు అధికమించవచ్చు. వచ్చే ఫిబ్రవరిలో కుజస్తంభన యోగము కూడా ఉన్నందున మరొక సారి ప్రకృతి విలయం చూడవలసి రావచ్చని జ్యోతిషవేత్తలు హెచ్చరిస్తున్నారు.
కాబట్టి భగవంతునికి శరణాగతులవ్వటం అత్యవసరం . కనుకనే శ్రీపీఠం ఉగాది మొదలుగా హనుమత్ రక్షాయాగమ్ జరిపినది.
ప్రస్తుతము వ్యక్తిగతంగాను .సామాజికంగాను శ్రేయస్సు కలగటానికై "నారాయణ శరణాగతి " యాగమును నలభై రోజులపాటు జరిపి లోక కళ్యాణార్ధం శ్రీవారి కళ్యాణం కూడా జరుపబూనాము. మీరందరూ మీమీ గోత్రనామాలను పంపి ఈ యాగములో పాల్గొని మంత్రజపం ,పారాయణం చేయాలని తద్వారా మీ వ్యక్తిగత జీవితం లోను ,సామాజిక జీవితం లోను కలుగుతున్న అలజడులు తొలగి సర్వత్రా శాంతి స్థాపన జరిగేందుకు సహకరించాలని కోరుతున్నాము
నారాయణ యాగం వివరాలు ఇక్కడ చూడండి
http://durgeswara.blogspot.com/2009/12/blog-post_15.html
1 వ్యాఖ్యలు:
నాకు "కళత్రపుత్రశత్రుత్వకారణా(కా)య నమః" అని చదివిన గుర్తండీ, "మిత్ర"శబ్దరహితంగా. కళత్రపుత్రశత్రుత్వకారకాయై అంటే స్త్రీలిఙ్గమైపోతుంది కదండీ? బహుశా ముద్రాదోషమేమో సరిచూడగలరు.
Post a Comment