ధనుర్మాస పూజల విశిష్టత
>> Friday, December 18, 2009
కురువృద్ధుడు భీష్ముడు అంపశయ్యమీద ఉండి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేవరకు ఆగి ఆ పుణ్యకాలం వచ్చాకే మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. సంక్రాంతికి ఒక నెల ముందు నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. దేవతా పూజలకు ధనుర్మాసం విశిష్టమైంది. అందుకే ఈ మాసంలో ధనుర్మాసంలో శుభకార్యాలను పక్కన బెట్టి దేవతలను పూజించాలని పండితులు అంటున్నారు. దేవతలతో పాటు కృష్ణభగవానుడికి ప్రీతికరమైన ఈ ధనుర్మాసం పూర్తిగా ఆ భగవానుడిని స్మరిస్తూ పూజ చేసే వారి అభీష్టాలు నెరవేరుతాయని విశ్వాసం. ఇంకా పెళ్లికాని కన్యలు ధనుర్మాసంలోని 30 రోజులు దీక్షతో ఆ దేవదేవుడిని ప్రార్థిస్తే గుణవంతుడైన భర్తను పొందవచ్చునని పురోహితులు చెబుతున్నారు. అందుచేత ఈ మాసం పూర్తిగా విష్ణుమూర్తిని ప్రార్థించి ఆయన అనుగ్రహం పొందుదుము గాక..!
2 వ్యాఖ్యలు:
నమస్కారములు.
ధనుర్మాస విశిస్టతను గురించి చక్కగా వివరించారు. అసలు ఆ మాసమంతా కుడా పల్లెసీమల అందాలు " ముంగిట ముగ్గులు ,కొత్త ధాన్యం కొత్త అల్లుళ్ళు గొబ్బితల్లులు బొమ్మల నోములు హరి దాసులు ఇలా ప్రకృతి అందాలతొ ఇంటింటా సంక్రాంతి లక్ష్మి కలకల లాడుతు ఉంటుంది. మంచి ఆర్టికల్ని అందించారు ధన్య వాదములు
బావుందండి చక్కగా క్లుప్తంగా రాసారు.
Post a Comment