"శ్రీమన్నారాయణ శరణాగతి" యాగం లో పాల్గొనండి .ప్రస్తుతం సమాజంలో ,జీవితం లో సంభవిస్తున్న ఉపద్రవాలను నివారించండి
>> Tuesday, December 15, 2009
శ్రీరామ
------
నారాయణ శరణాగతి యాగం
****************************
పుష్య శుద్ద విదియ [18/12/2009] నుండి మాఘశుద్ధ ఏకాదశి[26-01-2010] వరకు
సంకల్పం :సమాజ శ్రేయస్సు,వ్యక్తి శ్రేయస్సు పరస్పరాశ్రయాలు కనుక రాష్ట్రం లో నెలకొన్న అలజడులు .ఉత్పాతాలు శమించాలని,ధర్మ బద్ధమైన అందరి ఆకాంక్షలు నెరవేరాలి. . వ్యక్తిగతం గా జీవితం లో వచ్చే అవరోధాలన్నీ తొలగి ,ఆపదలనుండి ప్రస్తుత విపత్కర పరిస్థితులలో హరిపాదముల నాశ్రయించినవారందరూ రక్షణ పొందాలి .లోకమంతటా ఆసురీ శక్తుల విజృంభణ అణచివేయబడి అందరికీ శాంతి సౌభాగ్యాలు ప్రసాదింపబడాలి. జ్యోతిషశాస్త్రకారులు హెచ్చరిస్తున్న ఫిబ్రవరిలో సంభవించనున్న కుజస్తంభయోగము వలన ఏ ఉత్పాతాలు జరగకుండా ఎవరికీ కీడు జరగకుండా తొలగిపోవాలి.
సాధనా విధి
౧ మంత్రం : ఓం నమో నారాయణాయ
{ ఈ మంత్రాన్ని రోజుకు 108 సార్లకు తక్కువకాకుండా జపించాలి}శ్రీవేంకటేశ్వర స్వామి చిత్రపటం,మూర్తి ముందు కూర్చుని చేయటం శుభకరం యాగకాలం లో ప్రతి వ్యక్తికి లక్ష జపం చేస్తే విశేష ఫలితం ఉంటుంది .
౨ లక్ష్మీ అష్టోత్తరాలతో కలిపి శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం రోజుకొకపరి సాగించాలి.
నియమములు :లోక కల్యాణము కొరకై చేయువారు నిత్యం ఉదయం స్నానానంతరం జపం చేయాలి . [మద్యమాంసాదులు వర్జిస్తే శక్తివంతంగా సాగుతుంది]
వ్యక్తిగతంగా ప్రత్యేక కోరికలతో చేయువారు నియమములు పెంచుకొని సాగించాలి .ఏ బేధములు లేకుండా మానవులందరు జపించి తరించగల మంత్రరాజము కనుక ప్రతి ఒక్కరు జపించవచ్చు.
ఫలం : కుటుంబం లో ,జీవితం లో ,సమాజం లో సంభవించే అలజడులు ,ఆటంకములు తొలగి శ్రీవేంకటేశ్వరుని పరి పూర్ణానుగ్రహానికి పాతృలవుతారు .సర్వత్రా స్వామివారి రక్షణ కలుగుతుంది. సమాజం లో అలజడులు వ్యక్తిశ్రేయస్సుకు అపాయం కనుక లోకములో శాంతిని చేకూర్చగల యాగమిది.
సామూహికంగా జపించటం లక్షజపసంఖ్య పూర్తయినచోట అష్టాక్షరీ మంత్రజప హోమం జరుపుకొనుట మిక్కిలి శుభప్రదము.
----------------------------------------------------------------------------------------------------------------------------------------
ఈ కార్యక్రమములో పాల్గొనువారు తమ గోత్రనామాలను durgeswara@gmail.com నకు పంపటం ద్వారా
,శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠములో శ్రీవారికి జరిగే సేవలలో .,యాగం జరిగే నలుబదిరొజులలోను.సంకల్పంగా చెప్పబడతాయి
ది 25-01-2010 పూర్ణాహుతి, .శ్రీవేంకటేశ్వర స్వామివారి కళ్యాణం 26-01-2010 Saamthi poojalu జరుపబడతాయి.
ఈకార్యక్రమాలన్నింటా మీతరపున కూడా సేవలు జరుగుతాయి.
అలాగే సమీపములోగల దివ్యక్షేత్రాలలో,దైవస్థానాలలో సామూహికంగా పారాయణము ,జపము ,హోమము జరుపుకొనుట అత్యంత శీఘ్రఫలములనొసగుతుంది .ఆయా క్షేత్రములలో కార్యక్రమాలు జరపాలని ఆసక్తి ఉన్నవారు మమ్మల్ని సంప్రదిస్తే మీకు విధివిధానాలను తెలియపరచటం వీలైన చోట్లకు వచ్చి మీ తో పాలుపంచుకోవటం జరుగుతుంది. యజ్ఞయాగాదులు పారయణాదులవల్ల ఆచుట్టుపట్ల ఉన్న వారందరి హృదయాలలో ప్రేమపూరిత భావాలు పెరుగుతాయి .ఇది సత్యం . పెద్దగా అర్ధికభారం లేకుండా కార్యక్రమాలను శాస్త్రీయంగా జరుపుకునే విధానం సూచిస్తాము కనుక ఎక్కువమంది ఈ కార్యక్రమాలను మీ ప్రాంతం లో చేపట్టాలి. వ్యక్తిగతంగా మీ సాధనతో పాటు సామూహికంగా చేసే ఈ కార్యక్రమాలు సమాజ శ్రేయస్సుకు ఎంతో అవసరం.{ 27 మంది వృత్తాకారం లో కూర్చుని జపించిన చోట మాహాశక్తివంతమైన దైవానుగ్రహతరంగాలు ప్రసరిస్తాయి అన్ని వైపులకు}
అలాగే ఇక్కడ పీఠం లోను ,మీప్రాంతం లోనూ జరిగే ఈ సత్కార్యాలకు మీకు తోచిన విధంగా సహాయం అందించగలరు. యజ్ఞ ద్రవ్యాలు ,పూజాద్రవ్యాలు , ఇతర సహాయాలు అందించటానికి సహృదయులైన మీరందరూ ముందుకు రావాలని ప్రార్ధన . దేవుని పెళ్ళికి అందరూ పెద్దలే కనుక మీరంతా ఈ కార్యక్రమాన్ని మీకుసాధ్యమయినంత ఎక్కువమందికి అందించగలరు . పారాయణాదులు చేయలేని వారికి అష్టాక్షరీ మంత్రాన్నైనా జపించమని సూచించండి. అసురశక్తుల విజృంభణ వేళ ,నారద,ప్రహ్లాద.ధృవ,అంబరీషాది భక్తులు జపించి లోక కళ్యాణము జరిపిన మంత్రరాజమిది . గురూపదేశము లేకున్నా జపించిఫలాన్ని పొందగల మంత్రమని లోకమంతటికీ శ్రేయస్సు కలగాలని సద్గురువులు రామానుజాచార్యులు లోకానికి బహిరంగం చేసిన మహామంత్రము.
5 వ్యాఖ్యలు:
సమాజంపట్ల మీకున్న ఆరాటానికి కృతజ్నతలు. కానీ ఇవి ఇటువంటి కార్యక్రమాలవలన సాధ్యపడతాయా?
గురువు గారూ, నేను తప్పకుండా సహాయం చేయగలను.
టపాలో మీరు ఇచ్చిన తేదిలను ఒక సారి సరిచూసుకోగలరు.
చాలా మంచి సంకల్పం. మీ ప్రయత్నం సఫలమవ్వాలని కోరుకుంటున్నాను. లోకకళ్యాణార్థం చేసే ఇటువంటి కార్యక్రమాలకు ఆ నారాయణుడే రక్షగా నిలుస్తాడు.
చాలా మంచి సాధన అండి. నేను కూడా లక్ష లేక ఇంకా ఎక్కువ సాధ్యమైనంత జపం చేయాలని నిర్ణయించుకొన్నాను. మంచి ఉపాయం చెప్పినందుకు కృతజ్ఞతలండి.
వర్మగారూ
మంచి ప్రశ్న . వ్యక్తిగతంగా చేసుకునే చెడు పనులు చెడుకర్మలను ప్రాప్తింపజేస్తాయి .వాటి పరిమితి ఆవ్యక్తివరకు .అయితే వ్యక్తులందరిచేతా చేయబడే లేక ప్రోత్సహించబడే చెడుకర్మలన్నీ సమాజానికి సామూహికపాపంగా చుట్టుకునీ పలు ఉత్పాతాలకు కారణమవుతాయి.
వ్యక్తిగత శుభ్రతకు కొద్దిపరిమాణం లో శుభ్రపరచేకారకాలు అవసరమైనట్లు వ్యక్తిగత సాధన తో పరిష్కారం చేసుకోవచ్చు . ఇక సామూహికంగా ఇదేశుభ్రతకు ఎక్కువ మొత్తంలో శుభ్రపరచే పదార్ధాలు,వయ్క్తుల సామూహిక శ్రమ అవసరమైనట్లుగానే సామూహిక సాధనద్వారా సామాజిక సమస్యలను పరిష్కరించుకోవచ్చు. అయితే ఎంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు జరపగలిగితే ఫలితం అంతగా ఉంటుంది. సమాజాన్నించి అన్నీ పొందుతున్న మనం ఆసమాజానికి కలిగే సమస్యల పరిష్కారం కోశం స్పందించటం కృతజ్ఞతకు గుర్తుకదా!
అలా మనవంతు ప్రయత్నంగా సర్వశక్తివంతుడైన పరమాత్మను ప్రార్ధిధ్ధాం సామూహికంగాను ,వ్యక్తిగతంగా కూడా .
Post a Comment