శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

మహిమోపేతులైన రాఘవేంద్రుల మఠమెలా మునిగింది వరదలో

>> Thursday, November 26, 2009


ఇటీవల వరదల దుర్ఘటనలో ఎందరెందరి జీవితాలో నీటిపాలయ్యాయి. వేలకొలది కోట్లనష్టమొచ్చినది .[జీవితం లో ఆర్దికం ముఖ్యమైపోయినదికదా! ? అందుకే కోట్ల రూపాయల విషయం ముందు.] అపార జీవ నష్టం [ మనుషులే కాదండొయ్ ....జంతువులు ,పక్షులు క్రిమి కీటకాదులు, వగైరా]జరిగింది. ఎంతోమంది ఇళ్ళు కుటుంబాలు కొట్టుకపోయాయి.[ఆకలి చావులకంటె పర్యావరణం ....జనాలకంటె తోటలు[లాన్శ్] సంరక్షణకు ఎక్కువ ప్రాధాన్యం కదా ఈరోజులలో ... అందుకే మనుషులు కూడా పర్యావరణం తర్వాతే, పొలాలతర్వాతే . కుటుంబ వ్యవస్థ వ్యక్తికన్నా ,స్వార్ధం కన్నా తక్కువ విలువైనదిగా తయారైంది .అందుకే అది తరువాత, . ఇకపోతే రవాణా ,విద్య ఆరోగ్యరంగాలు సేవలూ దెబ్బతిన్నాయి. [ప్రస్తావన వరుసగా ఇంకా వివరించాలా....?]

ఈ దుర్ఘటనలో మంత్రాలయ మహాక్షేత్రం ,"మన" రాఘవేంద్రులవారి మఠం కూడా నీళ్లలో మునిగిపోయింది. [ఆథ్యాత్మికత ప్రాధాన్యత అన్నింటికంటె చివరిదికదా ! ] ఇంత కల్లోలంగావుంటే చూస్తూ కూడా ,సానుభూతి నటిస్తూనే ఒక అమాయక నిర్హేతువాది అడిగాడు [హేతువు భగవంతుడు. కాదనటం నిర్హేతుకం కదా !] అయ్యా..............రాఘవేంద్రుడు అంత మహిమ కలవాడంటివే ! మరి ఆయన మఠాన్నైనా కాపాడుకోలేక పోయాడా ?"ఆయన గొప్పవాడు ,మహిమకలవాడు కాదని అంటే వరదలాగిపోతాయ్ ! అన్నంత సీనుంది వాడి బొంగురు గొంతులో .
ఒకసారి ఒక వ్యక్తి ఆచార్యులవారితో " సార్! ప్రపంచం అస్సలు బాగోలేదు సార్ ! అన్నాడట . వెంటనే మాస్టర్ గారు : అవునోయ్!నువ్వునేను వుంటాం కదా ! అన్నారట.

అలా ,రాఘవేంద్రుడు ,ఆయన పీఠం నీట మునిగింది ఈనాడు కాదు. ఎందరో మహనీయులు అవతరించి ఆథ్యాత్మిక జీవితాన్ని నిర్ధుష్టం చేసి ఆచరించి నిరూపించి చూపిన భరతవర్షం లో గురు రాఘవేంద్రులు అవతరించటం ,సరైన మార్గం చూపటం జరిగింది. చారిత్రకంగా రాముడు ,కౄష్ణుడు గురించి ఆధారాలివ్వలేకపోయినా ,శ్రీ రాఘవేంద్రుల బోధలు ఇంకా అందుబాటులోనే వున్న సమయమిది. ఆయన ఎక్కడ జన్మించినది ,ఎలా ప్రవర్తించినది ఎలా ఆథ్యాత్మికోన్నతి కనబరచారో ,అన్నీ చారిత్రాత్మకంగా "సత్యాలు"గా ఇంకా నిలిచే వున్నాయి. మానవజాతి ఆవిర్భవించిన కాలాన్ని ఒక సంవత్సరంతో పోలిస్తే ాఘవేంద్రులు ఆవిర్భవించి కొన్ని నిముషాలు కూడా గడిచుండదు. అయినా ఆయనగురించి ,ఆయన బోధల గురించి మన ఆంధ్రజాతి మరచిపోయి చాలాకాలం అయ్యింది. "గుండానంద": " బండానంద" మొదలైన కొత్తగురువుల అగత్యం జాతికి పట్టనవసరం లేనంతగా, భక్తి వైరాగ్యం మొదలైన అంశాలను ఆచరణాత్మకంగా చూపిన దివ్య బోధను మన మానస సరోవరం లో "కల్తి" ఆలోచనల వరదనీటిలో ఎప్పుడో మనజాతి ముంచేసింది. ఏకొద్దిమందో వారిని గుర్తుపెట్టుకుని పూజిస్తున్నారు.
తక్కినవాళ్లమందరము ఆయనను "మనరోజువారీ మురికి జీవితపు"అలవాటు మాటున కప్పివేశినప్పటి నుండి ,నిజంగా ఎంతో నష్టం జరిగింది. ఇవాళ మునిగినది ఆవూరిలో ఒక కట్టడం. ఆపుణ్యక్షేత్రం పవిత్రత మన మనసుల్లో ఎప్పుడో సమాధి అయిపోయినది.

ఆథ్యాత్మికత అంటె నిజంగా ఏమిటో మాహాత్ములెలావుంటారో ? వారి బోధలేమిటో ఆచరణాత్మంగా చూపిన పరమాచార్యులు సాయి మాస్టర్ గారు ఆయన రచనలు ఆధారంగా మళ్ళీమనజాతికి శుభోదయం కలిగింది. కుల్లు కుతంత్రాల ,అసూయా-ద్వేషాల కుల్లుకంపు మనమనస్సులను వొదులుతుంది.
మన జాతి గతం లో జలసమాధి చెసిన మహనీయుల మహిమాన్విత మూర్తులు మళ్లీ మన మనసులలో పున:ప్రతిష్టించబడతారు . అప్పుడు దత్త కథలనే పిల్లవాయువుల తాకిడికి సరైన ఆలోచనలనే తరంగాలు ఉద్భవిస్తాయి. ఆమానస సరోవర మధ్యమున ప్రతిష్టితమైన రాఘవేంద్రులవంటి మహనీయ మూర్తుల పాదాలను తలలతో సృజిస్తూ నిత్యపవిత్రములైన ,ఆతరంగాలు వారి పదచరణ సేవలో నిమగ్నమవుతాయి. ప్రతి ఆలోచన వారి పాదాలను సోకుతుంది. ప్రతి కార్యము వారిని అర్చిస్తుంది. ప్రతి మాట వారిని కీర్తిస్తుంది.అప్పటికి నిజానికి మనందరికీ ,మానవజాతి మొత్తానికీ ప్రాణికోటి మొత్తానికీ ఇట్టిమానసికబురద అనే విధ్వంసం ముగుస్తుంది .. సరైన మానతా విలువలనే కమలాలు ఆ సరోవరాలలో నిలుస్తాయి. ధర్మాచరణమనే సుగంధాలు నలుదిశలా వ్యాపిస్తాయి.అప్పుడు జగమంతా మంత్రపూరితమవుతుంది .అది రాఘవేంద్రుల విశ్వరూపమవుతుంది .

మానవజాతి ని,ధర్మాన్ని పునరుజ్జీవనం చేసే సాయి ప్రభోదామృత ధారలకు స్వాగతం పలుకుదాం .ప్రతిరోజూ కొంతైనా మన మనస్సుల్లోకి ప్రవహించనిద్దాం . జీవితాలను సార్ధకం చేసుకుందాం . అప్పుడే మహితాత్ములు , కారుణ్య మూర్తులు అయిన మహనీయులకు మనం నిజంగా అంజలి ఘటించినట్లు .వారు నిజంగా గొప్పవారని అంగీకరించినట్లు. అలా ఆంగీకారం అయితే ఆ అంగీకారం నిలిస్తే ఇక మానసిక బురదవరదలు ఎప్పటికీ మనమనస్సులను తాకవు.
జై సాయిమాస్టర్.......నమో గురు రాఘవేంద్రాయ .

ద్వారకానాథ్
[సాయిబాబా మాసపత్రికనుండి]



3 వ్యాఖ్యలు:

Anonymous November 27, 2009 at 12:24 AM  

Hey Lord Venkateswara Swamy's photo which u have put up is really really awesome, can u upload a jpg of the same image, thanks in advance

లక్ష్మీనారాయణ సునీల్ వైద్యభూషణ November 27, 2009 at 4:36 AM  

గురువు గారు, తొందరలో రాసినట్టున్నారు. ముద్రా రాక్షసాలున్నాయి. టపా చాలా బాగుంది.

durgeswara November 27, 2009 at 6:35 AM  

అవును రాత్రి త్వరగా రాయటమ్ వలన తప్పులు బాగా పడ్డాయి .సరదిద్దుతాను ధన్యవాదములు

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP