కొండగురునాథుని కొండపై జరుగుతున్న దత్తజయంతికి రండి.
>> Monday, November 23, 2009
బ్రహ్మవిష్ణుశివాత్మకుడైన దత్తప్రభువు
కూర్మగిరిపై కొండగురునాథుని దారుశిలా మూర్తులు
మానవాళిని ఉద్ధరించాలనే ప్రేమతో పరమాత్మ ఎత్తిన దివ్యావతారమే దత్తాత్రేయస్వామి. అత్రి అనసూయలకు పుతృనిగా త్రిమూర్త్యాత్మకుడు గా ఉధ్భవించి తన కార్యాన్ని నిర్వర్తించాడు. కాదుకాదు ఈ సృష్టి వున్నంతవరకు మానవకళ్యాణమనే కార్యక్రమం ఆయన పలురూపాలలో సాగిస్తూనే వుంటాడు . ఆ దత్త ప్రభువు మార్గశిర పౌర్ణమినాడు భూమి మీద అవతరించిన సుదినం . డిసెంబర్ 2 ఆపర్వదినం వస్తున్నదీ సంవత్సరం .ఆరోజు కు పూర్తయ్యేలా దత్తదర్శనం గాని లేక గురుచరిత్రగాని పారాయణం చేసుకుని ఆయన అనుగ్రహాన్ని పొందవచ్చు నని పెద్దలు చూపిన బాట. ఈ సద్గ్రంథాలను పారాయణం చేయటం గురువు అనుగ్రహాన్ని శీఘ్రం చేయటమే కాక కామధేనువు వలె సకలాభీష్టాలు నెరవేర్చగలుతాయి .
ఇక ఈసందర్భంగా శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం ప్రసిధ్ధమయిన దత్తక్షేత్రం కొండగురునాథుని కొండపైన ఆరోజు స్వామికి రుద్రాభిషేకములు ,గాయత్రి హోమము .దత్తకృపాసిద్ధికై నిర్వహిస్తున్నది . కొండగురునాథుని కొండమీద దత్తుని గూర్చి ఈక్రింద లింక్ లో చూడండి .
http://durgeswara.blogspot.com/2009/01/blog-post_04.html
మీరు వారం ,లేక ఐదు ,మూడు రోజులుగా ఈసథ్గ్రంథాలలో ఏదో ఒకదానిని పారాయణం చేయాలి . మీ గోత్రనామాలు పంపితే మీతరపున అక్కడ కార్యక్రమములో సంకల్పం చెప్పబడుతుంది. అలాగే పౌర్ణమి చంద్రోదయ కాలంలో అమ్మవారికి లలితా సహస్రనామసహితంగా కుంకుమార్చన జరుగుతుంది . రాత్రి మొత్తం కొండమీద ధ్యానం ఉంటుంది . పాల్గొన దలచినవారు ఏ సాంప్రదాయం లోనివారైనా రావచ్చు. మీకు గురుచరిత్ర గ్రంథం ఇక్కడ దొరుకుతుంది .
http://teluguthesis.com/index.php?showtopic=181
డౌన్ లోడ్ చేసుకోండి . దత్తదర్శనమయితే గణపతి సచ్చిదానందులవారు రచించిన గ్రంథం బాగుంటుంది .వారు స్వయంగా దత్తోపాసకులుగనుక అది ప్రమాణగ్రంథం . దత్తాంభజే గురు దత్తాంభజే .. ఈ సందర్భంగా కోరినవారి తరపున మొత్తం నూటాఎనిమిది కలశాలను ఏర్పాటుచేసి వారి తరపున ఆకలశముల లోని జలాలతో స్వామికి అభిషేకము జరుగుతుంది. తమ తరపున కలశాలను ఏర్పాటుచేసి అభిషేకము జరిపించాలని కోరేవారు , ప్రసాదాలు పంపమని కోరేవారు మాత్రం నన్ను ఫోన్ లో సంప్రదించగలరు .9948235641] ముక్కోటి ఏకాదశి దాకా జరగనున్న నారాయణ యాగానికి కూడా స్వామి అనుమతిని కోరటం కూడా ఇందులో ఒకభాగం.
భక్తజన పాదసేవలో
దుర్గేశ్వర
0 వ్యాఖ్యలు:
Post a Comment