విభీషణుని వివేకం
>> Friday, November 20, 2009
రామాయణంలో విభీషణుడి పాత్ర అంతగా ఉండకపోయినా... ఆయన పాత్రకున్న ఔదార్యం అంతా ఇంతా కాదు. రావణుడి వంటి దురాచారుడు జన్మించిన లంకలో విభీషణుడి లాంటి సాధువులు కూడా జన్మించారంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. గంజాయ వనంతో తులసి మొక్కలా చాలా పవిత్రమైన వ్యక్తి విభీషణుడు. రావణుడి సోదరుల్లో విభీషణుడు రెండోవాడు.
రాక్షస కుటుంబంలో ఇలాంటి వ్యక్తి జన్మించాడా అని రాముడు సాధారణ మానవుడిలానే ఆశ్చర్యపోయాడు. కాగా, రావణుడి యుద్ధం తర్వాత లంకకు నిన్నే రాజుని చేస్తానని అన్నాడు రాముడు. సాధారణంగా ఓ రాజ్యంపై యుద్ధానికి వచ్చి గెలుచుకున్నవారికే ఆ రాజ్యం సొంతమవుతుంది కదా! అయినప్పటికీ, పరుల సొత్తు వద్దని ఆ రాజ్యాన్ని రావణుని సోదరుడైన విభీషణుడికి అప్పగించాలని భావించాడు రాముడు.
అప్పుడు విభీషణుడు "రామా నాకు ఈ రాజ్యాలు, సుఖాలు అనుభవించాలని లేదు. నీ సోదరుడు భరతునికి పాదుకలు ప్రసాదించిన రీతిలోనే నాకు కూడా ప్రసాదించమని" వేడుకున్నాడు. ఇది విభీషణుడి ఔదార్యానికి తార్కాణంగా నిలిచింది. ఇంకా చెప్పాలంటే, రాజ్యాన్ని వదిలిన రాముని ఔదార్యంతో పోలిస్తే విభీషణుడి ఔదార్యం ఎక్కువనే చెప్పాలి. తనకు రావలసిన రాజ్యాన్ని కాదన్నాడు విభీషణుడు. రామ సేవలో రాజ్యాలు తుచ్ఛంగా భావించాడు. యుగపురుషుడిగా చెరిగిపోని ముద్ర వేసుకున్నాడు. ఔదార్యానికి చక్కని ఉదాహరణగా నిలిచాడు.
4 వ్యాఖ్యలు:
రావణుడి తల్లి సగం రాక్షస స్త్రీ, కానీ మొత్తమ్మీద రావణుడిలో బ్రాహ్మణ అంశే ఎక్కువ కదా. అతన్ని పూర్తి రాక్షసుడిగా జమకట్టటం సరైనదేనా?
రావణుడి అనంతరం లంకని విభీషణుడే ఏలాడు కదా. పాండవుల కాలంలో కూడా విభీషణుడి వారసుల ఏలుబడిలోనే లంక ఉండేదంటారు. మీరేమో విభీషణుడు రాజ్యం వద్దన్నాడంటున్నారు! అంటే 'ఉత్తుత్తి రాజీనామా'లా ముందు వద్దని తర్వాత తీసుకున్నాడని మీ భావమా :-)
ఆయన వద్దనే అన్నాడు . కానీ రాజ్యభారాన్ని వహించి ధర్మాన్ని నిర్వర్తించాల్సిన కర్తవ్యాన్ని విధించాడు రాముడు ఆయనకు. కనుక పాలకునిగా పగ్గాలు చేపట్టాడు భగవాదేశంగానే .
ఆయన వద్దనే అన్నాడు . కానీ రాజ్యభారాన్ని వహించి ధర్మాన్ని నిర్వర్తించాల్సిన కర్తవ్యాన్ని విధించాడు రాముడు ఆయనకు. కనుక పాలకునిగా పగ్గాలు చేపట్టాడు భగవాదేశంగానే .
మంచి ఆర్టికల్ రాసారు అండి.
ఓం నమో భగవతే శ్రీ రమణాయ
ప్రశాంత్ జలసూత్రం
ప్రేమే శాశ్వతము
http://gururamanamaharshitelugu.blogspot.com/
Post a Comment