శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

తాబేలు గురువుగారు

>> Monday, September 21, 2009




ఓవృద్దుడుండేవాడు .గంగాతీరం లో అతని బస. ఓచిన్న గుడెసె వేసుకున్నాడు .ఓ కొయ్యపలక ,నీటితో నిండిన ఓకుండ మాత్రమే వున్నాయి అందులో . ఆయన ఒక తాబేలును పెంచుతున్నాడు. దగ్గరలోవున్న బస్తీకి రొట్టెలకోసం వెళ్ళినప్పుడు కాసిని శనగలుకూడా యాచించి తెచ్చుకుని వాటిని నానబెట్టి తాబేలుకుతినిపించేవాడు.

ఒకరోజు ఆవృద్దుని దగ్గరకు ఒకడొచ్చాడు. మీరు అధమ జీవిని పెంచుతున్నారెందుకు ?దీనిని గంగలో పారవెయ్యండి అన్నాడు.

అందుకు ఆముసలిబాబా విసుక్కుని .... నువ్వు నా గురు బాబా ను అవమానిస్తావా ? చూస్తున్నావుకదా .అల్పమైన శబ్దాన్ని ఆలకించి ఎవరిస్పర్శనైనా పొందినా తన సర్వాంగాలను తన లోపలకు సంకుచితము చేసుకుని స్థిరంగా ఉండిపోతున్నదో ? దీనిని నువ్వు ఎంతకదిపినా ,కుదిపినా ,ఊపినా ఇది తన ఒక్క కాలును కూడా కదపదే !

" అంతమాత్రం చే ఏమయిందయ్యా ? ఏమిటి లాభం " ప్రశ్నించాడతను.

ఎందుకు కాలేదు ? మానవుడు కూడా దీనిలాగానే సావధానుడై వుండాలి .లోభ మోహాలలో కానీ ,జనసముదాయము లో జరిగే కోలాహలాదులలోకానీ కనులు మూసుకుని "రామరామ " అనాలి.

యదార్ధమేమిటంటే ఈ ముసలాయనకూడా ఎవరినైనా చూస్తే తన గుడెసెలోకి వెళ్ళి బిగ్గరగా రామ్ రామ్ అని జపిస్తూవుంటాడు. పిలిచినా పలకకుండావుండిపోతాడు.ఆయన ఎందుకు మాట్లాడడో ఎవరికీ అర్ధం కాదు.

తాతగారూ ! మీరేమైనా చెప్పండి .ఎన్నిచెప్పండి గాక ఈతాబేలు మాత్రం అసహ్యం గావుంది . అన్నాడు మరలా ఆవచ్చినవాడు

:అయితే పోయేదేముంది ? మనకు పరమ లాభం లభించేప్పుడు అధములతో కూడా స్నేహం చేయాలి " అంటూ ఆవృధ్దుడు తాబేలును అరచేతిలోకి తీసుకుని నిమరసాగాడు.....

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP