రామనామము ,రామనామము రమ్యమైనది రామనామము [ప్రారంభమైన యాగం]
>> Saturday, August 8, 2009
మానవుల ఆనాచారాలవలన ప్రకృతి ఉపద్రవాలు ఏర్పడి దు:ఖానికి కారనమౌతుంది . కనుక సర్వదోషపరిహారం కోసం భగవన్నామ స్మరణమనే దివ్యౌషధాన్ని ప్రసాదించారు మహర్షులు మానవాళికి . ఈ సంకటస్థితిలో ఎవరికి చేతనైనంత స్థాయిలో భగవన్నామాని వారు స్మరించాల్సిన సమయం ఆసన్నమైనది ఇప్పుడు.
ఒకవైపు వానలు పడక ,మరొకవైపు రోగాలు ముప్పుముంచుకొస్తూన్న ప్రమాదకరపరిస్థితి. కనుక గతం లో మనపెద్దలు చూపిన మార్గం లో కనీసం మాచుట్టుపక్కల గ్రామాలలోనన్నా రామనామము జపింపజేసి ఒకేసారి అన్ని గ్రామాలలో హోమము జరపాలని కోరికతో రాత్రి ఈప్రయత్నం మీద కొన్ని గ్రామాలకు వెళ్ళివచ్చాను . కానీ అక్కడ జనం ఆలోచనలు చూస్తుంటే నవ్వాలో ఏడవాలో తెలియని స్థితి ఏర్పడింది.
ఒక గ్రామం లో నిజమే మాస్టారూ ! ఇలాచేస్తే బాగుంటుంది .కానీ మావూరి సంగతి మీకుతెలియదు .మొన్నసర్పంచ్ గా మొదట అవతలి వర్గం రెండున్నరసంవత్సరాలు ,తరువాత మావర్గం చెయాలని ఒప్పందం చేసుకుని ఇప్పుడు వాల్లు మాటతప్పారు అటువంటి వాల్లతో కలసి ఏకార్యక్రమం చేసే ప్రశ్నే లేదు .అని ఒక నాయకుడు తెగేసి చెప్పాడు.
ఇది రాజకీయాలతో ముడిపెట్టే సమయమటయ్యా ? ఈ ప్రమాదకాలం లో భగవన్నామాన్ని ఆశ్రయించకపోతే అందరికీ ఇబ్బందయ్యా అని సర్దిచెప్పబోయాను .ఏంపర్వాలేదు వచ్చేనష్టమేదో వాల్లకొస్తే గదామాకొచ్చేది అన్నాడాయన్ .ఇంకేమి చెప్పగలమాయనకు.
ఇంకొకాయన అబ్బా ఏకాహంగా నామం చేయాలంటే పాతికవేలన్నావుతుంది ,అన్నాడు ,
నాకైతే మతిపోయినది . ఏమయ్యా నోరువిప్పి భగవన్నామాన్ని పలకటానికి డబ్బెందుకయ్యా ? భక్తితో భగవంతున్నాశ్రయించమంటే నువ్వు ఆర్కెస్ట్రా లు ,ప్రోగ్రాములుగా పరిగణిస్తున్నావు . దేవుడిచ్చిన నోరు నుపయోగిస్తేచాలు అని చెప్పినా ఆయనకు నామస్మరణమంటే , ఖర్చుపెట్టిచేసే పనిగానే కనిపిస్తున్నదిది.
నిజమేమాస్టారూ ,మావూర్లో నువ్వొచ్చి అందరినీ అడుగు మేం చెబితే అవుతుందా ,అని తప్పుకున్నాడు మరొక ఊరి పెద్ద. పాపం ఆయనకు ఇదంత ముఖ్యమైనదిగా తోచలేదు కాబోలు.
మా చిన్నతనం లో ఊర్లో ఏక్కడన్నా నిప్పంటుకుని ,ఇల్లుగాని వాములుగాని తగలబడుతుంటే జనం చేతికందిన బిందె లు,బుంగలు బక్కెట్లు తీసుకుని బావులదగ్గరకు పరుగులుతీసి నీళ్ళు, తెచ్చి ఆర్పేప్రయత్నం చేస్తుండేవారు. మేము కూడా[చిన్నపిల్లలం అప్పుడు] తపెలాలు చెంబులు ఏవిదొరికితే నీల్లునింపుకుని వెల్లి విసిరేవారం అవి మంటదాకా పోకపోయినా .అదొక ప్రయత్నం .అప్పుడు పసిమనసులో మేమూ ఆర్పగలమనే ఆత్మ విశ్వాసం .జనం కూడా అదెవడిఇల్లు? వాడు నాకుశత్రువా ? మిత్రుడా అని ఆలోచించరు .వాల్లాలోచించేదల్లా ఒకటే .అది ప్రమాదము . నాకెందుకులే అని చూస్తూ కూర్చుంటే ఆనిప్పు మనకొంపమీదకు కూడా వస్తుంది వదిలేస్తే అలాగే . మరిప్పుడో తగలబడనియ్యి .పోతే నాదేకాదుగా వాడిదికూడా పోతుందనే ధోరణి పెరిగిపోతుంది జనం లో .
కనుక ,పెద్దలమీద ఈపనికి సహకరిస్తారనేనమ్మకం పోయినది .అందుకే మాపిల్లలనడిగాను ఏరా ! ఇలావర్షం లేకుంటే పంటలు పండవు .అవిలేకపోతే మనకు ఆకలితీరదు డబ్బులేకుంటే ఇలా నీడన కూర్చుని చదివే అవకాశము ఉండదు . చుట్టూ పశువులు పక్షులు చూడండి నీటి కోసం ఎలా అల్లాడుతున్నాయో . కాబట్టి మనం భక్తిగా జపం చేసివేడుకోవాలి . తప్పనిసరిగా వానకురిపిస్తాడు భగవంతుడు అని చెప్పాను .అంతే బాలాంజనేయులులాగా మాపిల్లలు కిలకిలారావాలుచేస్తూ సిద్దమైపోయారు . మాఒక్క స్కూల్ లోనే పదిగ్రామాలకు చెందిన పిల్లలున్నారు . ప్రతిరోజూ వారితోపాటు వారివారిగ్రామాలలో మిగతాపిల్లలను కలుపుకుని ,గ్రామం లోని గుడిలో అరగంటసేపు రామనామాన్ని జపించాలి . అలాగే పాఠశాలకు రాగానే క్లాసులు ప్రారంభానికి ముందు ఒక పావుగంట జపం చేయాలి మొత్తం కోటిజపం జరగాలి వచ్చేశనివారానికల్లా అని నిర్ణయించుకుని , పిల్లలంతా సంతోషం తో పాల్గొన్నారు. ఇంతకుముందు కూడా మనమిలగాచేస్తే వానకురిసింది కదా సార్ !సీనియర్లు గుర్తుచేశారు గతం లో చేసిన జపయాగ ఫలితాలను .
ఇక ఈరోజు పిల్లలు జపం ప్రారంభించగనే అప్పటిదాకా ఎండాకాలం సూర్యునిలావస్తున్న భానుని వేడి కిరణాలకు మేఘాలు అడ్డుపడి వాతావరణం చల్లబడినది . నిష్కల్మషమైన వారి ప్రయత్నాలు నాకు సంతోషమని ప్రకృతిమాత ఆశీర్వచనాలిస్తున్నట్లు చల్లని గాలితెమ్మెరలు వచ్చి తాకాయి
ఇక ఎలాజరుపుతాడో చూడాలి !? స్వామి ,ఆ పసివారు చేస్తున్న యాగాన్ని . .
2 వ్యాఖ్యలు:
మంచి ప్రయత్నం మాష్టారూ...
భగవంతుడు ఆ పిల్లల సేవను తప్పక స్వీకరిస్తాడు.
మేమూ సాధ్యమైనంత దైవ నామస్మరణ చేస్తాము. :)
మంచి ప్రయత్నం. కొనసాగించగలరు. బాలల్లో భక్తిభావన పెంపొందటం నేటి అవసరం.
Post a Comment