రామనామ జపయజ్ఞం
>> Thursday, August 6, 2009
ప్రస్తుతము భూమ్మీద విపత్కరపరిస్థితులు నెలకొంటున్నాయి .ఒకవైపు అనావృష్టి .మరొవైపున కొత్తరకం రోగాలు కమ్ముకువస్తూ జనజీవనాన్ని భీతావహం చేస్తున్నాయి . మానవులు చేసే సామూహిక పాపం ,అనాచారాలద్వారా జరిగేదోషాలు ,ఇలా ప్రకృతికోపానికి కారణమవుతాయని శాస్త్రాదులు ఘోషిస్తున్నాయి-ప్రస్తుత సమాజం తాగుడు జూదాలు మొదలు పలు వ్యసనాలుపెరిగిపోయి వాటి కి బానిసలైన వారు చేస్తున్న సామూహికపాపం అందరికీ కష్టాలు తెస్తుంది. ఉదాహరణకు ఒకడు నాఇష్టమని తనైంటిని మురికికూపంగా మార్చి మురికినీరు నిలువజేస్తే దానివలన పెరిగిన దోమలు,క్రిములు చుట్టుపక్కలన అందరికి హానికలిగిస్తాయిగాని కేవలం వాటిపెరుగుదలకు కారణమైన వానికొక్కనికే కాదుగదా !ఇక దైవస్థానాలలో కూడా పాపాత్ములు చేరి చేస్తున్న పలురకాల అపచారాలు మానవలోకానికి కష్తాలు పెంచుతున్నాయి. ఇవి చూస్తూ కూర్చున్న మనం కూడా ఆపాపం లోభాగము తీసుకోవాల్సినదే అది ప్రకృతి నియమము.ప్రకృతిమాత శాంతిస్తుంది . మనమంటే నోరున్నదికనుక ఎలాగోలా గడుపుతున్నాము . కాణి నోరులేని జీవరాసి ఎవరిని అడగలేక ,ఎక్కడా తిండి ,నీరు దొరకక తల్లడిల్లి పోతున్నాయి. వాటి శోకం చెప్పనలవికాకుండావుంది .
ఈసమయం లో లోకంలో జరుగుతున్న పాపాలను ధ్వంసం చేయటానికి మహాయోగులు హిమాలయలాలో తీవ్రతపశ్చర్యలో వున్నా మనంచేస్తున్న పాపపురాసి అంతకంతకు పెరిగి వారి ప్రయత్నాలనుకూడా సఫలం కాకుండ అడ్డుకుంటున్నది.అని పెద్దలమాట.
ఐతే కలియుగం లో ఈ పాపాన్ని దహించటానికి హరినామ స్మరణ చేయటమే మార్గమని మనకు మనఋషిపరంపర సూచించివున్నది. కనుక మనం సామూహికంగా పరమ పావనమైన "రామ" నామాన్ని జపించటం ద్వారా అది మాహాశక్తివంతమై సర్వపాపాలను దహించివేస్తుంది . ప్రకృతిమాత శాంతిస్తుంది .తగిన విధంగా కరుణించి కాపాడుతుంది. వర్షాలు కురిపించి కాపాడాలని కోరుతూ ప్రతి మనిషి రామ నామాన్ని జపించాలి. పూర్వం గ్రామగ్రామాన రామనామాన్ని జపించి న మనపూర్వీకులు శాంతి సౌభాగ్యాలను పొందారు .ఆపత్సమయం లో కూడా ఆ నామాన్ని ఆశ్రయించి గండాలనుండి గట్టేక్కారు
లోకశాంతి కోసం శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం లో 8-8-1999 శనివారం నుండి నామజపం సప్తాహంగా ప్రారంభించుట జరుగుతున్నది. ప్రతిరోజూ రామనామ జపము జరిపి 16-8-1999 పూర్ణాహుతి హోమము జరుపబడుతుంది .
ఈసందర్భంగా వ్యక్తిగతంగాను ,సామూహికంగాను ప్రతివారు మీమీ ఇంటిలోనూ గ్రామం లోని ఆలయాలలోనూ శ్రీరామ నామాన్ని జపించవలసినదిగా కోరుతున్నాము .
సంప్రదించవలసిన చిరునామా
శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం
రవ్వవరం
నూజండ్ల [మం] గుంటూరు [జిల్లా]
mail : durgeswara@gmail.com
cell : 9948235641
0 వ్యాఖ్యలు:
Post a Comment