అద్భుతమైన ఈ గ్రహణ సమయాన్ని అపనమ్మకాలతో వృధాచేసుకోకండి
>> Tuesday, July 21, 2009
ఆస్తిక సోదరులకు విజ్ఞప్తి ఇది. గ్రహణ సమయము ఆథ్యాత్మిక లోకం లో సాధకులకు విశేష సమయము . ఈసమయాన జరిపే జపము ,తపము ,దానము కోట్లరెట్లు ఫలితాన్నిస్తుందని శాస్త్రవచనము . ఇటువంటి పవిత్రసమయం లో పవిత్రనదీ తీరానగాని లేక పవిత్ర స్థలాన లేక మీ గృహము లోనే శుద్దిచేసుకున్న స్థలము లో కూర్చుని మీ కుకులాచారము ప్రకారముగానీ .గురుపరంపర నుంచి వస్తున్న మంత్రాలను గానీ జపించుకోవటము వలన శీఘ్రమే ఫలితాలనిస్తాయి . ఏ మంత్రమూ గురువు వద్దనుంచి పొందనివారు కూడా ఓం నమ: శివాయ అనే పంచాక్షరిని గాని ,ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని గానీ నిరభ్యరంతరం గా జపం చేసి భగవదనుగ్రహం పొందగలరు. నామ జపం చేసుకునేవారు కూడా ఈ విధానం గానే జపం చేసుకోవచ్చు.
గ్రహణం పట్టే ముందుగా స్నానం చేసి జపం చేసుకుని గ్రహణానంతరం మరలా స్నానం చేసి మీ ఇంటి లోనున్న పూజా గృహాన్ని శుద్ధి చేసుకుని పటాలు లేక విగ్రహాలను కూడా ఆవుపాలు శుద్ధ జలం తో శుద్ధిపరచుకుని వారికి ఉపచారాదులు[పూజ] చేసుకోవాలి తదనంతరం మాత్రమే ఏదైనా స్వీకరించాలి. పొద్దుటే టీ లు కాఫీలు త్రాగేవారు రేపొద్దున్న ఒక్కపూట ఆ అలవాటుకు మానుకోవటం మంచిది.
తమకర్ధం కాకపోయినా అదెందుకు ఇదెందుకు అనే వితండవాదులు,సోమరుల వాదనలతో బుర్ర ఖరాబు చేసుకుని సమయము వృధాపుచ్చుకోక మనపెద్దలు ఘనవిజ్ఞానులనే విషయము నమ్మి వారు చూపిన బాటలో శుభాలకోసము ప్రయత్నం చేద్దాము
జై శ్రీరాం




9 వ్యాఖ్యలు:
దుర్గేశ్వర గారూ,
మన పెద్దలే అతి సర్వత్ర వర్జయేత్ అన్నారు కదా. మితిమీరిన ఆస్తికవాదమైనా, నాస్తిక వాదమైనా హానికరమే. జన విజ్ఞాన వేదికలోనున్న అజ్ఞానులు ఆస్తికులని దూషించినట్టే ఆస్తికులు కూడ వారిని దూషిస్తే ఇక వారికీ వీరికీ తేడా ఏముంటుంది చెప్పండి.
మన ప్రాచీనులలో అఖండమైన పరిజ్ఞానముంది - నిజమే - కానీ వారికి తెలియని అంతుపట్టని విషయాలు కూడా చాలా ఉన్నాయి. వారు ఒప్పు అనుకున్నవి చాలా తప్పులయ్యాయి కూడా.
కానీ ఇక్కడ జరుగుతోంది ఏమిటంటే కొన్ని విహ్షయాల్లో వారి జ్ఞానాన్ని ఆసరాగా చేసుకొని "మన వాళ్ళకు అన్నీ తెలుసు" అనేకొందరు, "మన వాళ్ళకు ఏమీ తెలియదు - వాళ్ళు మోసగాళ్ళు" అని మరి కొందరు అవసరాన్ని మించి రెండువైపులకూ లాగుతున్నారు. ఇది ఎవరికీ మంచిది కాదు.
ఆ నాస్తికవాద బ్లాగుల్లోను నేను ఇదే విషయం చెప్పాను - ఇక్కడ కూడా ఇదే చెబుతున్నాను.
కానీ అక్కడున్న నాస్తిక మేధావులు కొందరు మామూలు మాటలతో వినేరకం కాదు - అందుకే వాళ్ళకి కాస్త గడ్డి పెట్టాల్సొచ్చింది :))
ఆహా!! శ్వశక్తిపై ఆధారపడినవారేమో సోమరిపోతులు. దేవుడి ప్రాపకంతోనూ, పూజలతోనూ పనులు చక్కబెట్టుకోవాలనుకొనే వాళ్ళేమో కష్టజీవులు.
స్వశక్తి--ఆ శక్తి వెనకో శక్తి ఉందన్న స్పృహతో పనులు నిర్వహించమని గీతలో కృష్ణుని మాట
మనము దేన్ని నమ్మినా, నమ్మకున్నా, ఇంట్లో వారి మాటలు విని కాసేపు ధ్యానమో, జపమో లేదా నామ స్మరణనో చేయడంలో తప్పులేదు కదా?! మనల్ని సృష్టించి మనకు అన్నీ సమకూర్చిన ఆ భగవంతుడికి ఈ గ్రహణ సమయంలో కృతజ్ఞత తెలుపుటలో తప్పేముంది?
మనము దేన్ని నమ్మినా, నమ్మకున్నా, ఇంట్లో వారి మాటలు విని కాసేపు ధ్యానమో, జపమో లేదా నామ స్మరణనో చేయడంలో తప్పులేదు కదా?! మనల్ని సృష్టించి మనకు అన్నీ సమకూర్చిన ఆ భగవంతుడికి ఈ గ్రహణ సమయంలో కృతజ్ఞత తెలుపుటలో తప్పేముంది?
___________________________________
Well said! I agree 100%
ధ్యానం అనేది ఏమి చేసిన చెయ్యకపోయినా మనసుకు ప్రశాంతతనిస్తుంది. ఒక మనిషికి ప్రశాంతమైన మనసుకన్నా ముఖ్యమైనది లేదు. మనలని సృష్టించిన శక్తికి ఆ విధంగా కృతజ్ఞత తెలుపుకోవడం మన ధర్మం కూడా. అయితే ఒక్క ధ్యానమే సర్వ దు:ఖ నివారిణి కాజాలదు.
మిత్రులందరి కీ ధన్యవాదములు
నేని ఈ వ్యాఖ్యలను ఇప్పుడే చూడటం వలన వెంటనే సమాధానం ఇవ్వలేకపోయాను క్షమించాలి.
నేను ఎవరినీ కించపరచేలా వ్యాఖ్యానం చేయలేదు ,అది నే్ననుసురించే ధర్మానికి విరుధ్ధము . ఇక మనము చిన్నతనం నుండీ అన్నీ మన పరిశీలన ద్వారానే నిర్ధారించుకోవటము సాధ్యము కాదు .కొన్ని మన పూర్వీకులు పరిశీలించి నిర్ధారించిన సత్యాలను నమ్మి ఒప్పుకొని సాగుతుంటాము .అలాకాకుంటె మానవ మనుగడ కష్టసాధ్యమవుతుంది. మానవ జాతిలో మనము మాత్రమే అపూర్వ పరిశోధకులమని మనకు పూర్వము వారు అల్పజ్ఞానులనే మూఢనమ్మకాన్ని ఏర్పరచుకొని వారు తమ జీవితమంతా ధారబోసి శ్రమించి శోధించి ఇచ్చిన సూత్రాలను అర్ధం చేసుకునే ఓపిక లేక పరిశొధించైనా తెలుసుకునే తీరికా లేని అడ్దగోలుగా విమర్శిస్తుంటారు కొందరు .అంతటితో ఆగక తమ గందరగోళాన్ని ఇతరుల మనసులకు కూడా ఎక్కించి సందిగ్ధం కలిగించటం ద్వారా ఇతరులు కూడా ఆఫలితాలనుఅందుకోకుందా ఆటంక పరచినవారవుతారు. అటువంటివారి మాటలద్వారా సందిగ్ధము కు లోనయి పుణ్యకాలం కాస్తా వృధాపరచుకోవద్దని మాత్రమే హెచ్చరించాను.
ఇక ఋషిపరంపరానుగతం గావస్తున్న ఈ సనాతన విజ్ఞానము లో అసత్యాలుండవు అని నేను గాఢంగా విశ్వసిస్తున్నాను. ఆరుబయట వుంచిన రాగి పాత్రకు చిలుము పట్టినట్టు కాలానుగతముగా ఈ ధ్రమము లోనూ కొన్ని ప్రక్షిప్తాలు చేరి విమర్శలకు నిలవలేన సత్యదూరమైన సిద్దాంతాలుగా కనిపించవచ్చు .కాదనము . కానీ వాటినే ప్రమాణముగా స్వీకరించే సంకుచిత బుద్దిని మాకు విద్యగరిపిన గురువు లివ్వలేదు. అటువంటి అసత్యవిషయాలను ఏరి పారవేయాల్సిన అవసరము వున్నదన్నది సత్యము. భగవంతుని ఆశ్రయించటము ఆ పరమ పురుషుని నమ్మి జీవిఉతాన్ని నడపటము అంత తేలికకాదు ఈభౌతిక ప్రపంచములో .ఆసత్యాన్ని తెలుసుకోవాలన్నతపన ,తీవ్రమైన ఆకాంక్ష కష్టాలతో కూడుకున్న సాధనా ఇవన్నీ సోమరులకు సాధ్యముకాదు.భగవంతుని నమ్మి ఆశ్రయించేవారు వేరు ,ఆపేరుతో పొట్టపోసుకోటానికి నటించేవారు వేరు .కలియుగము కనుక ఈ విషయములో క్షీర నీర బేధాన్ని కనుగోవటము కొద్దిగా కష్టమే. అలాగని మూకుమ్మడిగా సత్యాలన్నీ అబద్దాలు అనే అల్పజ్ఞానుల మాటలను మనం నమ్మవలసిన పనిలేదు. పూర్ణజ్ఞానులైన మన సద్గురువుల మార్గము మనకనుసరణీయము .ఎందుకంటే మనము అల్పజ్ఞానులమనే సత్యం మనము కాదన్నా మారదు కనుక.లోకకల్యాణార్ధం హేతువు ఏది అని తపించి వెదికి సత్యాన్ని కనుగొనేవారు మన ప్రాత:స్మరణీయులేకాని ఆపేరుతో పరమ బద్దక చక్రవర్తులై నోరున్నది కదా అని అంతా అబద్ధం అనేవారి మాటలు మన మనస్సులోగందరగోలాలు లేపుతాయి కనుక అనుసరణీయము కాదు అనేది నాభావన. స్వశక్తి పై ఆధారపడి తేనే సత్యాన్ని నిగ్గుతేలచగలిగేది .ఇప్పుడుధార్మిక విషయాలపై విమర్శలు చేసేవారి లో అలా స్వశక్తి పై ఆధారపడి పరిశోధిస్తున్నది ఎంతమంది .ఇవన్నీ చిలకపలుకులేకాదా ? భగవంతుని పేరు చెప్పి అధార్మికమైనవి అసత్యాలను మూఢంగా నమ్మల్సిన అగత్యాన్ని కూడా సమర్ధించాల్సిన అవసరము లేదు.
ఈ సమయము లో భగవన్నామన్ని స్మరించటం వలన కలిగేఫలితాన్ని మాత్రమే ఋషిపరంపరగా వస్తున్న మాటను మాత్రమే నాస్వంత పైత్యం ఏమాత్రం జోడించకుండా చెప్పాను .అది సత్యం .నామాట కాదు పెద్దలమాట .ఇక్కడ ఈ సూచన అనుసరించటం వలన ఎవరికీ ఎటువంటి నష్టము వచ్చేఅవకాశము లేదు. కనుక అనవసరపు గందరగోళానికి గురి కాకుండా వుండాలని మాత్రమే అన్నాను .నావుద్దేశ్యము ఎవరినీ నిందించటము కాదు. అజ్ఞానులలో మొదటివరుసలోవాడిని ,ఏమీతెలియని వాడెవడురా అని ఆపరమాత్మ ప్రశ్నిస్తే ముందుగా చూపబడేవాడిని నేను ఇంకొకరిని ఎలా నిందిస్తాను ? !
దుర్గేశ్వర గారూ,
మీ జవాబు చాలా బాగుంది.
Post a Comment