దారిద్ర్యదహన స్తోత్రము
>> Wednesday, July 22, 2009

విశ్వేశ్వరాయ నరకార్ణవతారణాయ
కర్ణామృతాయ శశిశేఖరధారణాయ
కర్పూరకాంతిధవళాయ జటాధరాయ
దారిద్ర్యదుఃఖదహనాయ నమఃశివాయ II 1 II
గౌరీప్రియాయ రజనీశకలాధరాయ
కాలాంతకాయ భుజగాధిపంకకణాయ
గంగాధరాయ గజరాజవిమర్దనాయ
దారద్ర్యదుఃఖదహనాయ నమఃశివాయ II 2 II
భక్తిప్రియాయ భవరోగభయాపహాయ
ఉగ్రాయ దుర్గభవసాగరతారణాయ
జ్యోతిర్మయాయ గుణనామసునృత్యకాయ
దారిద్ర్యదుఃఖదహనాయ నమఃశివాయ II 3 II
చర్మాంబరాయ శవభస్మవిలేపనాయ
బాలేక్షణాయ మణికుండలమండితాయ
మంజీరపాదయుగళాయ జటాధరాయ
దారిద్ర్యదుఃఖదహనాయ నమఃశివాయ II 4 II
పంచాననాయ ఫణిరాజవిభూషణాయ
హేమాంశుకాయ భువనత్రయమండితాయ
ఆనంతభూమివరదాయ తమోమయాయ
దారిద్ర్యదుఃఖదహనాయ నమఃశివాయ II 5 II
భానుప్రియాయ భవసాగరతారణాయ
కాలాంతకాయ కమలాసనపూజితాయ
నేత్రత్రయాయ శుభలక్షణలక్షితాయ
దారిద్ర్యదుఃఖదహనాయ నమఃశివాయ II 6 II
రామప్రియాయ రఘునాథవరప్రదాయ
నాగప్రియాయ నరకార్ణవతారణాయ
పుణ్యేషు పుణ్యభరితాయ సురార్చితాయ
దారిద్ర్యదుఃఖదహనాయ నమఃశివాయ II 7 II
ముక్తేశ్వరాయ ఫలదాయ గణేశ్వరాయ
గీతప్రియాయ వృషభేశ్వరవాహనాయ
మాతంగచర్మవసనాయ మహేశ్వరాయ
దారిద్ర్యదుఃఖదహనాయ నమఃశివాయ II 8 II
వశిష్ఠేన కృతం స్తోత్రం సర్వరోగనివారణమ్
సర్వసంపత్కరం శీఘ్రం పుత్రపౌత్రాదివర్ధనమ్
త్రిసంధ్యం యః పఠేన్నిత్యం స హి స్వర్గమవాప్నుయాత్ II 9 II




4 వ్యాఖ్యలు:
శంకర భగవత్పాదులు ఇలా అంటారు అన్నపూర్ణాష్టకం చివర్లో:
అన్నపూర్ణే సదాపూర్ణే సంకర ప్రాణ వల్లభే
"జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్ధం" భిక్షాందేహీచ పార్వతి
మాతాచ పార్వతీ దేవీ పితాదేవో మహేశ్వర:
బాంధవాశ్శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం
పైన కోట్స్ లో రాసింది ఒకసారి మళ్ళీ చదవండి, భిక్షగా ఏమి కోరుకోవాలో చెప్పకనే చెప్తున్నారు కదా? ఉత్తి తిండి కోరుకోవడం ఎంత ఛండాలంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి.
అలాగే పరమశివుడంతటివాడ్ని డబ్బులు అడగడం అంత దరిద్రం ఇంకేమీ ఉండదు. పరమేశ్వరా, నా మనస్సులో దరిద్రం తొలగించి, అది జ్ఞానం కేసి పోయేటట్టు చూడు అని కోరుకోవాలి కదా? సాక్షాత్తూ పరమేస్వరుడు కనపడితే అడిగేది డబ్బులా? ఛ! ఛ!!
ఇక్కడ పెట్టిన ఫొటో చాలా బాగుంది. ఆ మొహంలో కనిపించే దయ చూస్తూంటే ఇంకేమీ అడగబుద్ధి కాదు.(నాకు అలా అనిపించింది. మరి మీకో?)
మీకు వీలయితే తులసీ జలంధర కధ ఒకసారి పోస్ట్ చేస్తారా?
ఇంతచక్కని స్థాయి లో వివరించిన మీకు ధన్యవాదములు .మీపేరు కూడా తెలిస్తే ఇంకా సంతోషించేవారము .
మీకు తెలియనిదేమున్నది ! దారిద్ర్యమంటె కేవలము భౌతికసంపదల లోపమే కాదు కదా ? సోపాన మార్గం లో భక్తుడు ఒక్కొక్క దారిద్ర్యాన్ని దహింపజేసుకుంటాడు ఆయన కరుణతో .
నిరామయమైన శివలింగాన్ని గానీ ,ఆమూర్తినిగానీ దర్శిస్తే మనసు నిరామయమై మనలను మనం మరచిపోయే సన్నివేశము ఏర్పడుతుంది. ఇక అప్పుడేమి అడుగుతాము? ఏది ఆదర్శనానికంటే ఎక్కువగా కన్బపడుతుంది అడగటానికి ? మీ భక్తిమయ భావనకు నమస్సుమాంజలి.
Post a Comment