శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఆపదలనుదొలగించు ఆంజనేయ దండకం

>> Wednesday, March 11, 2009


.



శ్రీ ఆంజనేయదండకం
**************


శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్ర్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజేవాయుపుత్రం భజేవాలగాత్రం భజేహం పవిత్రం ,భజేసూర్య మిత్రం భజేరుద్రరూపం భజే బ్రహ్మ తేజం బటంచున్ ప్రభాతంబు సాయంత్రమున్ నీనామ సంకీర్తనల్ జేసి నీరూపువర్ణించి,నీమీద నేదండకంబొక్కటింజేయనూహించి,నీమూర్తినిన్ గాంచి .నీసుందరంబెంచి నీదాసానుదాసుండనై రామభక్తుండనై నిన్నునేగొల్చెదన్.నీకటాక్షంబునన్ జూసితే వేడుకల్ జేసితే నామొరాలించితే ,నన్ను రక్షించితే ,అంజనాదేవి గర్భాన్వయాదేవ నిన్నెంచ నేనెంత వాడన్ ,దయాశాలివై జూచితే దాతవైబ్రోచితే దగ్గరంబిల్చితే,తొల్లి సుగ్రీవుకున్ మంత్రివై ,స్వామి కార్యంబునందుండి,శ్రీరామ సౌమిత్రులన్ జూచి వారిన్ విచారించి ,సర్వేశు బూజించి యబ్బానుజుంబంటుగావించి యవ్వాలినిన్ జంపి కాకుస్థతిలకున్ దయాదృష్టివీక్షించి,కిష్కిందకేతెంచి .శ్రీరామ కార్యార్ధివై లంకకేతెంచియున్,లంకినిన్గొట్టియున్,లంకయున్ గాల్చియున్ ,యబ్బూమిజన్ చూచి యానంద ముప్పొంగమాయుంగరంబిచ్చి యారత్నమున్ తెచ్చి శ్రీరాముకున్నిచ్చి సంతోషునిన్జేసి,సుగ్రీవునిన్ అంగదున్ జాంబవంతాది నీలాదులం గూడియాసేతువున్ దాటి వానరుల్మూకలై పెన్మూకలై దైత్యులన్దృంచగా,రావణుండంత కాలాగ్నిరుద్రుండునై పోరి బ్రహ్మాండమైనట్టి యాశక్తిన్ వేసి యాలక్ష్మనున్ మూర్ఛనొందింపగా,నప్పుడే బోయి సంజీవినిన్దెచ్చి సౌమిత్రికిన్నిచ్చిప్రాణంబురక్షింపగా కుంభకర్ణాదివీరాళితోబోరి చెండాడి శ్రీరామ-బాణాగ్ని వారందరిన్ రావణున్ జంపగా నంత లోకంబులానంద మయ్యుండ నవ్వేళలన్ నవ్విభీషణున్ ,వేడుకన్ తోడుకన్ వచ్చి పట్టాభిషేకంబు జేయించి,సీతామహాదేనిన్ దెచ్చి శ్రీరాముకున్నిచ్చి యయోధ్యకున్ వచ్చి పట్టాభిషేకంబు సంరంభమై యున్న నీకన్న నాకెవ్వరున్ గూర్మిలేరంచు మన్నించినన్ సేవించి రామభక్తి ప్రశస్తంబుగా నిన్ను నీనామ సంకీర్తనల్ జేసితే పాపముల్బాయునే భయములున్ దీరునే భాగ్యముల్ గల్గునే సకల సామ్రాజ్యముల్ గల్గు సకలసంపత్తులున్ గల్గునే యోవానరాకార యోభక్తమందార యోపుణ్య సంచార యోవీర! యోశూర! నీవే సమస్తంబు నీవే మహా ఫలమ్ముగా వెలసి యాతారక బ్రహ్మ మంత్రంబు పఠించుచున్ స్థిరముగా వజ్ర దేహంబునున్ దాల్చి శ్రీరామ శ్రీరమ యంచున్ మన:పూతమై ఎప్పుడున్ తప్పకన్ తలతు నాజిహ్వయందుండి నీదీర్ఘదేహంబు త్రైలోక్య సంచారివై రామనామాంకితధ్యానివై బ్రహ్మవై,బ్రహ్మతేజంబునన్ రౌద్రనీజ్వాల కల్లోల హావీర ! హనుమంత ఓంకార హ్రీంకార శబ్దంబులన్ భూతప్రేతపిశాచ శాకినీ ఢాకినీత్యాది గాలిదయ్యంబులన్ నీదు వాలంబునన్ జుట్టి నేలం బడంగొట్టి నీ ముష్టి ఘాతంబులన్ బాహుదండంబులన్ రోమఖండంబులం ద్రుంచి కాలాగ్ని రుద్రుండవై బ్రహ్మ ప్రభాభాసితంబైన నీదివ్యతేజంబునుం జూపి రారోరి నాముద్దు నరసింహ యంచున్ దయాదృష్టి వీక్షించి నన్నేలు నాస్వామీ.....నమస్తే సదాబ్రహ్మచారీ ,నమస్తేవాయుపుత్రా నమస్తే నమస్తే నమ:



[మహాశక్తివంతమైనఆంజనేయదండకము నోటికిరాని తెలుగువారు ఉండేవారు కాదు పూర్వం. ఏ ఆపదలొచ్చినా .రోగాదులు భయపెడుతున్నాఈస్తుతి చేసినవెంటనే పొగిడితే పెరిగేస్వామికి ఆనందము కలిగి తనను ఆశ్రయించిన వారిని కాచేవాడు.మహా ప్రభావవంతమయిన ఈ దండకమహిమ అపారము. నిష్టతో ఈదండకమును పఠిస్తేస్వామి సులభంగా ప్రసన్నమవటము భక్తులకు అనుభవమే. నరసింహ నామధేయముగల ఉపాసకులెవరో ఈస్తుతిని స్వామికోసముచేసినారు కనుకనే ఆపరమ భక్తునిసంకల్పతో స్వామి ఈదండకముతో ప్రార్ధించినవారిని కాపాడుతూనే వున్నాడు.]

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP