శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

పూర్వ జన్మ పాపా లకు ఇప్పుడు పూజలెందుకు చేయాలి

>> Saturday, January 31, 2009

"ఒకరికి మంచి చేయకపోయినా ఫర్వాలేదు... చెడు మాత్రం చేయవద్దు" అని పెద్దల వచనం.ఇలా అకారణంగా పూర్వజన్మలో చేసిన పాపం ఈ జన్మలో పట్టిపీడిస్తుందన్నారు. అంతేకాదు గత జన్మలో చేసిన ఇటువంటి పాప ప్రక్షాళనకు ఈ జన్మలో ఆ సర్వేశ్వరునికి త్రికరణశుద్ధితో పూజలు చేయాలని చెప్పారు. అయితే కొందరు మాత్రం గత జన్మలో చేసిన పాపాలకు ఇప్పుడు పూజలు చేయటమేమిటని ప్రశ్నిస్తుంటారు.

దీనికి పెద్దలు ఇలా చెప్పారు... పాప ప్రక్షాళనకు భగవంతునికి చేసే పూజలు, వ్రతాలు వంటివన్నీ రోగమొస్తే మాత్ర వేసుకోవటం వంటివి. తలనొప్పి దానిపని అది చేస్తూ వుంటే మాత్ర దానికి సమాంతరంగా తన పని అది చేసుకుంటూ పోతుంది. చివరికి ఒక దశలో దాని ప్రభావం ఎక్కువై తలనొప్పి తగ్గిపోతుంది.

అలాగే పూర్వ జన్మలో చేసిన పాపాల ప్రభావం, వాటికి విరుగుడుగా చేసే పూజలు, వ్రతాలు శాంతులు సమాంతరంగా సాగుతుంటాయి. ఎప్పుడైతే ఆ భగవంతుని ప్రభావం ఎక్కువవుతుందో పూర్వ జన్మలో చేసిన పాపాలు పటాపంచలవుతాయి.

పూర్వజన్మ లో చేసిన దోషాలు తీసుకున్న అప్పులాంటివి ,వడ్డితో సహా వాటిని చెల్లించవలసినదే. అందువలనే కొందరికి ఇప్పుడు చేసే పూజలు వ్రతాలు వల్ల వచ్చే పుణ్యము వెంటనే ఫలితానికి రాదు.ఆ ఫలితమంతా పూర్వజన్మ పాపమువల్ల సంక్రమించిన అప్పు క్రిందనే జమచేయబడటము వలన అలా ఆలస్యమవుతుంది.అదితెలియక నేను చేసిన పుణ్యకార్యక్రమాల వల్ల నాకేమి లాభమని విచారిస్తుంటారు అమాయకంగా.కనుక విశ్వాసము కోల్పోక భగవత్ క్రియలు ఇతోధికంగా చేయాలి.

1 వ్యాఖ్యలు:

Anonymous January 31, 2009 at 9:02 AM  

chala baga chepparu.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP