శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

"ఘనమౌ నీదగు కీర్తిని వినినే ,మనమున నమ్మితి గావుమయా"

>> Saturday, January 24, 2009




శనిత్రయోదశి,మరియు మాసశివరాత్రి తిథులు రెండూ కలసిన ఈరోజు దేశవిదేశాలనుంచి తమకొరకు పూజ జరపమని కోరుతూ పంపిన వారందరికోసము ఆనందముతో పూజ జరిపించుకున్నాడు ఆభక్తవశంకరుడు శంకరుడు. ఉదయము భక్తుల జాతకములలో నున్న దోషాలను బాపమని నవగ్రహదేవతలకు పూజ,అనంతరం ప్రత్యేకముగా శనీశ్వరులవారికి తైలాభిషేకములు,పూజలు జరిగాయి.

సర్వశుభకరము పరమేశ్వరునికి ప్రీతిదాయకమైన శనిప్రదోషపూజ మాసశివరాత్రికూడా కలసి వచ్చిన ఈ పర్వదినాన రుద్రసూక్తముతో అభిషేకాదులు మారేడు,పుష్పాదులతో ప్రతిభక్తుని పేరున అర్చనలు జరుపబడ్డాయి".ఘనమౌ నీదగు కీర్తిని వినినే ,మనమున నమ్మితి గావుమయా" అని ఆభోళాశంకరుని అందరితరపున ప్రార్ధించి శరణము వేడాము ఆదివ్యశ్రీచరణాలను.నమ్మినవారికెన్నడు నాశము లేదని ప్రకృతి మాత ఆనందముతో పలికినట్లు ఆసమయములో అలౌకికమైన వాతావరణము పులకింపజేసినది ఆసమయాన[.జయజయ శంకర భక్తవశంకర]. స్వామి మీతరపున అందుకున్న పూజల చిత్రాలను కూడా ఇక్కడ వుంచుతున్నాము చూడండి.
జపించండి ఆస్వామికి ప్రీతిపాత్రంగా ’ఓం నమ: శివాయ" అని.

8 వ్యాఖ్యలు:

చింతా రామ కృష్ణా రావు. January 24, 2009 at 9:54 AM  

ఆర్యా! దుర్గేశ్వరా!
ధన్య వాదములు.
లోక కల్యాణకర కార్యక్రమాలు చేస్తున్న మీద్వారా నా పేరున పూజ జరగడం నా అదృష్టం గా భావిస్తున్నాను.
నా ఈ మెయిల్ ఎడ్రస్ తెలియజేయమన్నారు. దిగువ వ్రాశాను చూడగలందులకు మనవి.

" దీనికి ప్రత్యుపకృతి గావింప నే నేర నంజలి గావించెద భూసురాన్వయ మణీ! సద్బంధు చింతామణీ. అనే రుక్మిణి నోట పలికించిన పోతన పద్య భాగాన్నే నేనిప్పుడు మీముందు వచిస్తున్నాను.
కృతజ్ఞుడను.
దుర్గేశ్వర వినుత హృదయ
దుర్గేశ్వర! నీదుసేవ తుష్టిగ చేసెన్
దుర్గేశ్వరుడందరికని.
దుర్గతి గొని శుభములిమ్మ! దుర్గేశునకున్.

సెలవ్.

durgeswara January 24, 2009 at 4:42 PM  

సత్కవులకు ప్రణామములు.
ఈసేవజెసే అవకాశాన్ని నకిచ్చిన మీ అందరికికృతజ్ఞతలు..ఎందుకంటే భక్తులకు సేవచేయటం భగవంతునికిష్టమని మాబాస్ ఆంజనేయ స్వామివారు తమ చర్యలద్వారా నిరూపిస్తుంటారు.వారు చూపిన మార్గం తేలికగా భగవంతునిదగ్గరకు చేరుస్తుంది.అందుకే నేను ఈమార్గాన సాగుతున్నాను. ధన్యవాదములు.
[నేను భూసురుడను కాను.]

సుజాత వేల్పూరి January 24, 2009 at 6:21 PM  

దుర్గేశ్వర గారు,
మనః పూర్వక ధన్యవాదాలు!

నాగప్రసాద్ January 24, 2009 at 7:33 PM  

దుర్గేశ్వర గారు, హృదయ పూర్వక ధన్యవాదాలు!.

KumarN January 24, 2009 at 11:09 PM  

దుర్గేశ్వర గారూ,

మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలండి.

కుమార్

durgeswara January 25, 2009 at 5:17 AM  

శంభో!హరహర మహదేవా, నీ చరణములే గతియంటినయా..........

చిలమకూరు విజయమోహన్ January 26, 2009 at 2:31 AM  

పనుల ఒత్తిడి వల్ల కృతజ్ఞతలు తెలుపడం ఆలస్యమయింది.క్షమించగలరు.

durgeswara January 26, 2009 at 3:08 AM  

నేను నీవెవడు ద్వైతముతము తొలగిన ,నీవే నేనై యుందునయా..

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP