తిరుమల యాత్ర ఎలాచేయాలి?శ్రీవారి కరుణ కలగాలంటే.?
>> Tuesday, January 13, 2009
తిరుపతి యాత్ర యెలా చేయాలో ,మానాన గారు చెబుతూ ఉండేవారు. చాలామంది పెద్దలు చెప్పినవి కొన్ని విన్నాను.మీతో పంచుకుంటున్నాను.
తిరుమల మామూలు క్షేత్రము కాదు.పరమాత్మ స్వయంభూగా వెలసిన క్షేత్రరాజము.అక్కడ ప్రతి చెట్టు,ప్రతి పుట్ట భగవంతుని ధ్యానిస్తున్న మహర్శులే,అని చెప్పబడుతున్నాయి.ఆఏడుకొండలు సాక్షాత్తూ ఆదిశేషుడేనని పురాణాలు వివరిస్తున్నాయి.
కనుకనే రామానుజులలాంటి సద్గురువులు అక్కడ ఎలా మెలగాలో ఆచరణాత్మకంగా చూపించారు.అన్నమయ్య లాంటి మహానుభావులు అక్కడ నివాసమ్ కోసం తపించి తరించారు. ఇక యాత్ర నెలా చేయాలో పెద్దలు చెప్పినది చూద్దాము.
కొండనెక్కటం అలిపిరి నుంచి మొదలవుతుంది.చెప్పులతో కొండ ఎక్కరాదు. మొదటగా స్వామి వారు భక్తునకు స్వయంగా తన పాదరక్షల కొలతలనివ్వగా ఆభక్తుడు తయారు చెసిన పాద రక్షలు అక్కడ పూజింపబడుతుంటాయి.ఆపాదరక్షలను ముందుగా తలపై వుంచుకుని స్మామివారిని స్మరించు కోవాలి. అక్కద రాజైనా చక్రవర్తియైనా సరే వాళ్ల అహంకారాలు అనిగేలా చెప్పులతో కొట్టబడతారు.దానితో నేనింతవానిని అంతవానిననే అహంకారం అణగిపోతుంది. ఆతరువాత బహుకష్ట సాధ్యమైన ఆ కొండనెక్కుతూ వుంటే[అప్పటిలో ఇంత సౌకర్యాలు లేవులెండి] ఆయాసముతో కళ్ళుతిరుగుతుంటాయి భక్తులు భగవన్నామస్మరణంతో బహుకష్టాలతో చేరుకుంటారు పైకి . దానితో
తమ చెడుఖర్మలు నశించటమేకాదు,తమ శారీరిక బలం ఎంతో దాని పరిమితి ఎంతో తెలిసివస్తుంది.దానితో తమ శరీర బలాన్ని చూసుకుని విర్రవీగే వారికి వాస్తవంఅర్ధమవుతుంది. ఆతరువాత ముఖ్యమయిన పని శిరోముండనమ్ అంటే గుండు చేయించుకోవటం ఒక ముఖ్యమయిన నియమము అందరికీ.ఇది ఆడమగ అందరూ పాటించేవారు పూర్వము,ఆధునికత పేరుతో బాహ్యసౌందర్య పోషణపట్ల శ్రద్ధపెరిగి ఇప్పుడు కొందరు పాటించటమ్ లేదు. కాని దీనివెనుక చాలా పెద్ద ఆధ్యాత్మిక కారణమున్నది. మనిషిని మభ్యపెట్టి మనో వికారాలను కల్పించేది సౌందర్యం.దానికి ఆధారము శిరోజాలు. అవి వున్నప్పుడు ఎక్కడకెళ్ళినా తమ సౌందర్యము పట్ల అతిశయమైన భావన వెన్నంటివస్తూ మనసును కామవికారాలవైపు పరుగుపెట్టిస్తుంది. కనుక ఆవికారాలను తొలగించకపోతే మనసు మాధవుని వైపు మళ్లదు పక్కదోవలగుండా పారి పోవాలని చూస్తుంది. కనుక ఆశిరోజాలను తీసి వేస్తే ప్రతి మానవునికి తమ సహజస్వరూపమేమిటో అర్ధమయిపోతుంది. ఎదుట వున్న జీవులను చూడగానే కామ భావన సమూలంగా నశిస్తుంది. నిర్వికారమైన మనోస్థితి కలుగుతుంది.[గుండు చేపించుకుని మిమ్మల్ని మీరు అద్దములో చూసుకోండి ఒకసారి,ఏవిధమయిన వికారాలు లేక ప్రశాంతమైన స్థితి వస్తుంది. ] అప్పుడు ఆలయ ప్రవేశము చేస్తుంటే మనసంతా ఆ దివ్యస్వరూపాన్ని చూడాలనే తపన తప్ప మరొకటి తలపుకు రాదు. ఆస్థితిలో కోటిసూర్యకాంతుల సమప్రభుడు ఆకొండలరాయుడు మనకు దర్శనమిస్తాడు. ఆతన్మయత్వంతో స్వామిని దర్శించి నప్పుడు తిరుమల యాత్రసఫలమవుతుంది.
ఆతరువాత నిలువుదోపిడీ చేసి మనలను ధనవంతులమనే అహంకారాన్నుంచి రక్షించి ప్రపంచములో ఏజీవైనా నీవొక్కడివే దిక్కు నాకు అనేలా భావన కలగచేస్తాడు స్వామి. ఇలా వెళ్ళి నప్పుడే స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా లభించి మనకు శుభాలు కలుగుతాయి.అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన ఆ స్వామి ముందు తమ తుచ్చమైన పలుకుబడులను,ధనాన్ని ప్రదర్శించి చెసే దర్శనముమేలు చేయదు. సరికదా ఆయన ఆగ్రహానికి గురయ్యేలా చేస్తుందని చెప్పవచ్చు.ఆ పవిత్ర క్షేత్రములో అడుగు పెట్టిన ప్రతి భక్తుడు స్వామి వారి పరివారమే. కనుక మన అతితెలివి తోటి సాటి భక్తుల కిబ్బందికలిగేలా మనము దర్శనాదులను చేయరాదు.భక్తులకు చెసే అపచారాన్ని ఆయన అసలు క్షమించడు.అందుకే ఎక్కడెక్కడ మనం చేసిన తప్పులన్నిటికీ కొండమీదకు వెళ్లాక
అనేకరూపాలుగా దోపిడిగా మనకు అనుభవానికొచ్చి మనసు విలవిల లాడుతుంటుంది. మీకు తెలుసోలేదో నిరుపేదలు రోజులతరబడి ఆ గదులలో స్వామి వారి దర్శనానికి వేచివున్నా వారికి శ్రీవారి పట్ల విసుగు కాని,అక్కడ అసౌకర్యాల పట్ల గమనికేవుండదు.కాస్త స్థితి కలిగాక మనమే గంటసేపన్న ఆగలేక అల్లడిపోయి పక్కదారిలో దర్శనమేమన్నా దొరుకుతుందా ని వెతుకుతుంటాము. నేనెప్పుడు తిరుమల వెళ్ళినా ఈవిషయాలను గమనిస్తూ వుంటాను.బుద్ధిహీనతతో నేను వక్రమార్గమ్ లో దర్శనానికి వెళ్ళాలని ఒకసారి ప్రయత్నం చేసినప్పుడు శ్రీవారు నాకొక లీల చూపాడు.అందుకే నేనెప్పుడూ దాసానుదాసునిగా ఒల్లు దగ్గరపెట్టుకుని మసలుకుంటాను శ్రీవారి సన్నిధిలో.
11 వ్యాఖ్యలు:
ఇప్పుడు అర్థం అయ్యింది తిరుమల ఎలా వెళ్ళాలో..నేను మొదటిసారి చెప్పులు లేకుండా తిరుమల కి వైకుంఠ ఏకాదశి నాడు వెళ్ళాను.ఈ లింక్ చూడండి vaikunta ekadashi 2009 pics
http://community.webshots.com/album/569620455eHx
చాలా బాగా రాసారండి..
బాగా రాసారు.
శ్రీనివాసుడిని దర్శించుకునేముందు వరదరాజస్వామిని దర్శించాలంటారు.
అమ్మా శిరీషా నీకామెంట్లు ఎందుకు డిలేట్ చేశావో అర్ధం కాలేదు.
ముఖ్యంగా అమ్మాయి "సిరి" కి శ్రీవారి వారి కరుణను తెలియజేయగలిగేందుకు చెసిన ప్రయత్నము ఫలింపజేసిన స్వామికి కోటిదండాలు.నామాటలు మన్నించినందుకు ధన్యవాదములు.
నేస్తం గారికి ధన్యవాదములు.
శ్రీ గారూ అవును మీరన్నది నిజమే ఒక్కోక్షేత్రానికి ఒక్కొక్క మర్యాదలుంటాయి.వరదరాజస్వామిని ముందుగా దర్శించాలనేది తిరుమల క్షేత్రమర్యాద.స్వామివారు చేసుకున్న ఒప్పందం.
దుర్గేశ్వర గారు, తిరుమల కొండ విశేషాలు చాలా బాగా వ్రాసారు. ఒక్క చిన్న సందేహం - తిరుమల క్షేత్రం లో ఉన్నది వరాహస్వామివారు కదా, వరదరాజస్వామి కాదు అనుకుంటాను. తప్పు ఐతే సరిదిద్దగలరు.
oka rayini 5 seconds chudadaniki
gantala (rojula) koddi line lo undatam!
prapancham lo inthakanna agnanam,murkathvam marokatiundademo
మున్నీ గారూ
పొరపాటు జరిగినది.వ్యాఖ్యకు సమాధానమిస్తూ వరాహ స్వామి అని రాయబోయి వరదరాజ స్వామి అనిరాసాను.ధన్యవాదములు.
ఇక వీరెవరో నాస్తికులైతె మనమేమి సమాధానం చెప్పినా వాళ్ల కు రుచించదు.కనుక ఇఅతరుల చర్యలను తప్పుపట్టాలని తపనను తగ్గించుకొని దూరంగా వుండమని మనవి.
ఆస్తికులై ఈ వ్యాఖయానం చెస్తే మాత్రమ్ మీరు ఏవిధంగా అధిక్షేపిస్తున్నారో మీపేరు తోనే వివరించవచ్చు నా సమాధానం చెబుతాను.
Your blog keeps getting better and better! Your older articles are not as good as newer ones you have a lot more creativity and originality now keep it up!
Post a Comment