ఆలయాలలో అవినీతి గురించి అందరూ మాట్లాడేవారే? బాధ్యతగా వ్యవహరిస్తున్నవారెవరు?
>> Saturday, January 10, 2009
ఈమధ్య ఆలయాలలో దోపిడీలెక్కువవుతున్నాయని.దుర్మార్గాలు పెచ్చు పెరుగుతున్నాయని ప్రతివారూ విమర్శలు బాగ చేస్తున్నారు.కానీ ఎవరూ తమవంతు బాధ్యతలను గురించి మాట్లాడటము లేదు.
భగవంతుని పేరుతో దోపిడీ చేస్తున్నారన్నది నిజం.మరి అది తెలిసి మనం కనీసం ఏదైనా ప్రతిఘటన చూపామా? లేదే? ఎందుకని?
అదే మనస్వంత విషయమైతే ఇలానే వదలేసి వెళ్ళి వస్తామా? రాము.ఎందుకని? అదే మన స్వంతవాళ్ల సొమ్మును ఎవరన్నా దోచుకుంటుంటే చూస్తూ వచ్చేస్తామా? లేదు. ఎందుకని? భగవంతుడు మనవాడు అన్న భావం మనకు లేదుకనుక.మనకు కోరికలు తీర్చాలంతవరకే అయన. మనకు ప్రేమకంటే వ్యాపార దృక్పథం మనసులో వున్నదేమో ఆలోచించండి.గొప్ప ఆపదలో వున్నప్పుడు ఆయన కోసం ప్రార్ధించిన మనం ఆస్తానాన్ని పవిత్రంగా వుంచటం కోసం ఏదన్నా ప్రయత్నము చేస్తామా?
అసలు దేవాలయాలంటే ఏమిటో తెలుసుకోండి ముందు. మన చుట్టూ గాలి వుంటుంది ,కానీ దానిని సైకిల్ ట్యూబ్ లోనికి ఎక్కించాలంటే ఎలాకుదురుతుంది. సైకిల్ పంపనే పరికరమ్ వుంటేనే అది సాధ్యమవుతుంది. విశ్వవ్యాపితముగా అణువణువునా విరాజిల్లుతున్న పరమాత్మ శక్తిని మనలోకి ఆహ్వానించుకోవటానికి మహర్షులు సిద్దపరచిన పరికరమే ఆలయం. కొన్ని ప్రత్యేక కొలతలద్వారా ఆలయాన్ని నిర్మించి మంత్రజపముతో పరమాత్మ శక్తిని ఆహ్వానించి జడమైన పదార్ధాల[విగ్రహాలలోకి]ప్రసరింపజేసి చైతన్యవంతమ్ చేసి అక్కడనుండి భక్తులపైకి ఆశక్తి ప్రసరించేలా ప్రార్ధనా పూర్వకంగా సిద్దపరచబడిన శక్తి కేంద్రాలు ఆలయాలు. భక్తులు తమ నిరంతర ప్రార్ధనలద్వారా ఆశక్తిప్రసారాన్ని పెంచుకుంటూ పవిత్ర వాతావరణాన్ని కాపాడుకుంటూ రావలసిన మనస్వంత ఆస్తులివి. భగవంతునికి మనం పూజ చేసినా చేయకున్నా లోటేమీ లేదు ఆయనకు .మనం తలుపుతెరిచినప్పుడు వుండి,కాపాడుతూ తలుపులు వేసి గడియలు పెట్టినప్పుడు కూడా క్షమించి
మనకోసం ప్రేమతో నిలచివున్న ఆపరమాత్మ అనుగ్రహ కేంద్రాలను కాపాడు కోవలసిన బాధ్యత ఎవరిది? కాపాడు కోకుంటే నష్టం ఎవరికి?మనకే.
అది గమనించండి.
కలి యుగాధినేతయిన కలి పురుషుని సంకల్పముతో అతని మాయజాలమ్ భక్తులను మభ్యపరచి భగవంతుని నుండి దూరము చేయటానికి తీవ్రప్రయత్నాలు చేస్తున్నాడు.అవే మీకు కనడుతున్న భౌతిక కారణాలు. ఏదోవిధముగా ఆలయాల పవిత్రతను దూరం చేసి తద్వారా భక్తులకు దైవంపై నమ్మకాన్ని తొలగించేప్రయత్నం ఇది.ఆలయాలను,దైవాన్ని ధర్మాన్ని నిందిస్తూ సాగుతున్న ప్రచారాలుఅన్నీ ఇందులో భాగమే. కనుక భక్తులైన వారు కూడా ఆ మాయకు లోబడి ఇలా ఆలయాలకు వెళ్లాల్సిన పనిలేదు,వాళ్లు ఇలా ,ఇక్కడ అలా అలా అని వూరికే ముచ్చట్లతో పొద్దుపుచ్చితే నష్టం ఎవరికి?
కనుక భగవంతుని పట్ల నిజమైన ప్రేమ వున్నట్లయితే దురాచరాలను ఖండించటం తో మీ బాధ్యతలను నిర్వర్తించండి.ఎప్పుడూ గుడికెళ్ళి స్వామీ నాకిది కావాలి?అదికావాలి అనే బెగ్గర్లలా కాకుండా బిడ్దలుగా మారి భగవంతుని పట్ల ధర్మం పట్ల ,బాధ్యతలను కూడా గుర్తు చేసుకోండి.మనయోగక్షేమాలు చూస్తున్న భగవంతుని పట్ల మన ప్రేమాభిమానాలు ఎలావున్నాయో ఆయనగమనించేలా పోరాడండి.
4 వ్యాఖ్యలు:
chalabagaa raasaru.naaku chala nachindi.ilantivi melantivaru rasthe, naalanti vaallaku devudi gurinchgi koncham telustundi.
thank you sir.
dhanya vaadamulu
>>"మన స్వంతవాళ్ల సొమ్మును ఎవరన్నా దోచుకుంటుంటే చూస్తూ వచ్చేస్తామా?".
దుర్గేశ్వర గారు, ఆలయంలో హుండీలో వేసే సొమ్ము కూడా మనదే. ఈ విషయాన్ని ప్రజలు ఎందుకు అంతగా పట్టించుకోరో నాక్కూడా అర్థం కావడం లేదు.
ఇకపోతే!. ఆ హుండీలోని సొమ్మును దోచుకోవడానికి ప్రభుత్వం ఏకంగా "దేవాదాయ" శాఖనే పెట్టిందని మనందరికీ తెలుసు. అంతే కాని "దేవాలయ అభివృద్ది" శాఖను పెట్టలేదు.
ఇది ఊరుమ్మడి సొమ్ము అయినది.ఎవడు దోచుకున్నా నాకెందుకులే అనే సమాజం నిర్లక్ష్యము వళ్ల ఇంత అనర్ధం జరుగుతునది.మీకోవిష్యము తెలుసో లేదో మనం పైసాపైసా
తీసుకెళ్ళి హుండీలో వేసే సొమ్మును వంతుల్ వారీగా ఇఅతరధర్మాలు,మతాలవారి ప్రార్ధనామందిరాల నిర్మాణానికి ఇస్తున్నారు.ధర్మధ్వంసమునకు పాల్పడుతున్నారు.అదే ఇఅతరుల ఆస్తులపట్లనైతే కన్నెత్తి కూడా చూడలేరు.ఎందుకని ధర్మవిషయములో వాళ్ళు ఎప్పుడూ ఎలర్ట్ గ వుంటారు వెంటనే రోడ్డు మీదకొచ్చి గొడవలు చేయగలరు గనుక,అవి వోటు బ్యాంకులు గనుక.హజ్ యాత్రలకు,బెత్లెహాం యాత్రలకు ప్రజాధనాన్ని ఆయామతస్థులకోసం వెచ్చించే ప్రభుత్వ లౌకికత్వం,మనతీర్ధయాత్రికిలకు కనీసం చార్జీలలో రాయితీలుకూడా ఇవ్వలేదు పాపం. ఎదురిచ్చినంత పుణ్యం వున్నవి దోచుకోకుండా వుండలన్నా మన నిర్లక్ష్యం వీడితేనే సాధ్యమవుతుంది. ఊరికొక్క వందమంది ఓటుబ్యాంకుగా మరి మేము ఆలయాలపట్ల జరిగే అపచారాలను తొలగిస్తేనే మీకు ఓట్లు వేస్తామని చెపితే కుక్కలా తోకాడిస్తాయి ఏపార్టీలైనా మనముందు. కావల్సినది ధర్మ నిష్ట.
Post a Comment