చండీయాగం మహిమ
>> Sunday, January 11, 2009
అమ్మ వారి విభవాన్ని మార్కండేయపురాణమ్ లో చాలా విస్తృతంగా వర్ణించారు.ఏడువందల మంత్రాలతో. దానినే దేవీ
సప్తశతి అని వ్యవహరిస్తారు. ఆ సప్తశతిని పారాయణము చేసి ఆ మంత్రాలతో హోమము జరుపుతారు.దానినే చండీయాగము అని అంటారు. అమ్మవారికి అత్యంత ప్రీతి పాత్రమవుతుంది కనుక ఆమె అనుగ్రహం కోసము చండీ యాగము చేస్తారు. ఆతల్లి కరుణవల్ల సమస్త దుష్కర్మలు నశించి,జయము సంపదలు,శుభాలు ప్రాప్తిస్తాయి. ముఖ్యంగా శతృంజయముగా భావిస్తారు. ఈయాగానికి దేవీ వుపాసకులు వుండి చేస్తే ఆమంత్రాలకు బలం ఎక్కువ. ఒక్కరోజు,మూడు రోజులు,తొమ్మిది రోజులుగా చేస్తారు ఈయాగాన్ని.దీనికి అనుబంధంగా గణపతి హోమము,నవగ్రహ హోమములాంటి యాగాలు అనుసంధిస్తారు. యాగ సమయం లో అమ్మకు ప్రీతి పాత్రంగా పూజలు నివేదనులు జరుపుతారు.మీకు దగ్గర పుస్తకాల షాపులో సప్తశతి దొరుకుతుంది,అర్ధసహితంగా చూడండి. ఇక భక్తి పూరితముగా చెస్తేనే ఏ భగవద్ పూజకైనా ఫలితం వుంటుంది.అది గమనించండి.ఖర్చంటారా ఐదువేల నుంచి ఐదు లక్షలదాకా కూడా పడుతుంది పెట్టు కోవాలనుకుంటే.చేసే విధిని బట్టి . అయితే అమ్మ భక్తానుగ్రహ కాతారాం అన్న పేరుగలది. బిడ్ద ఎంతఖర్చుపెట్టాడని కాదు,ఎంత భక్తిగా చేశాడని చూస్తుంది.
ఈ యాగ మహిమ మీరు నమ్మినా నమ్మకున్నా ఒకటి ఇటీవలే జరిగినది చెబుతాను వినండి.
తెలాంగాణా అంశముతో రాజకీయ పోరాటము చేస్తున్న కేసీఆర్ ,మొదట సభలు సమావేశాలు పెట్టి తరువాత అతని పరిస్తితి ఏమిచేయాలో తెలియని స్థితి కెళ్ళినది.కార్యకర్తలకు కూడా వుత్సాహము తగ్గినది.అప్పుడే అతని కాలు కూడా దెబ్బతగిలి నడవలేని స్థితి. రాజకీయంగా శూన్యంగావున్నది భవిష్యత్తు. అప్పుడెవరు సలహా ఇచ్చారో గాని అతను చండీయాగం చేశాడు.నిలబడలేక కుర్చీలో కూర్చునే యాగం లో పాల్గొంటున్న ఫోటోలు మీరు చూసే వుంటారు.యాగం చేసి తెలంగానా తెస్తాడట ! అని వ్యంగ్యంగా పత్రికలలో కార్టూన్లు కూడావచ్చాయి అతనిపై.మామిత్రులు కొందరు పిచ్చాపాటి మాట్లాడుతూ రెచ్చగొట్టెవరకు రెచ్చగొట్టాడు జనాన్ని,ఇకఏమి చేయాలో తెలియటం లేదు.ఇప్పుడిక ఎన్ని యాగాలు చేసినా ఇతనిని జనం నమ్మరు. అని వ్యంగంగనే మాట్లాడారు. నేను వారిని వారించి మీకు తెలియదు.అతని కెవరో పెద్దవారు సాధకుడూ కరక్టయన మార్గాన్ని చూపుతున్నారు. చండీ యాగము మహిమ మీకు తెలియదు ,చూస్తూవుండండి ఏమి జరుగుతుండో అని చెప్పాను.
ఆ యాగమయి పోయిన తరువాత విచిత్రం......
వూరుకున్న వాడు వూరుకోక ఎమ్మెస్ సత్యన్నారాయణ నోరుదూలతో కెసిఆర్ కు చేవలేదు దమ్ముంటే రాజీనామా చేసి పోటీకి రమ్మని సవాల్ విసరటమ్,అమ్మదయతో కలసివచ్చిన అవకాశాన్ని అందుకుని కేసీఆర్ రాజీనామాచెసి బరిలోకి దిగటం,కాంగ్రేస్ వాళ్లకు చావుకొచ్చినంతపనై ఉపఎన్నికలలో తమ సర్వశక్తులను ఒడ్డి పోరాడవలసి రావట,వాళ్ల్ ప్రతిచర్య మహామాయ అనుగ్రహాన ఇతనికి ప్రజలో విపరీత సానుభూతి పెంచి కరీంనగర్ స్థానం లో రెండులక్షల మెజారిటీతో విజయం సాధించటం సినిమాలా జరిగిపోయినది.తెలంగాణాలో తిరుగులేని నాయకునిగా తనస్థానం పెంచుకున్నాడు.
ఇదీ చండీయాగ మహిమ అని వివరిస్తే మావాళ్లంతా అవును నమ్మలేని విధంగా జరిగినదిదని ఆశ్చర్యపోయారు.
[ఇది నేను చండి యాగం గురించి అడిగిన ఒకరికి అంతర్జాలంలో పంపిన వివరణ ]
0 వ్యాఖ్యలు:
Post a Comment