శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

రాధా మాధవలీల

>> Saturday, January 3, 2009


బృందావనంలో శ్రీకిశోరీవనంలో శ్రీగోవిందదాస్ అనేభక్తుడుండేవాడు. ఆయన గొప్ప విరాగి. ఎవరిని ఏదియు కోరడు. తుదకు మధుకరమును కూడా చేసెడివారు కారు.ఏరూపములో కూడా యాచనకూడదని ఆయన నియమము.ఆయనకుండిన యావదాస్తి ,దుమ్ముతోకూడిన రెండుగ్రంధములు.అవిసదా తనదగ్గరేవుండేవి.అవి.

1.శుకసాంప్రదాయాచార్యులైన శ్రీశ్యామాచరణ్ వ్రాసిన భక్తిసాగర్.
2.శుకసాంప్రదాయకులైన శ్రీరామసఖి రచించిన భక్తి మంజరి.

ఆయన నిత్యము శుధ్ధసహచరి భావంతో యుగళ రూపమును ఉపాసించువాడు.భక్తిరసమంజరిలోని కథలను సదాచింతన చేయుచుండెను. సంసారజీవితము పట్ల విముఖుడై సదాధ్యానమందే యుండెడివాడు. సాధు సేవయనిన ఈయన కెంతో ప్రీతి.ఈయన సాధుసేవకు ముగ్దుడైన శ్రీసరస మాధురీ యను మహాత్ముడు ఈయనను,"సాధుసేవా ధర్మమనెడిఓడ"అనిపేర్కొనుచుండెడివాడు.కానీ సదా ఒక్క విషయమే ఆయనను బాధించుచుండెడిది. యుగళకిషోరీ రూపము ఒక్కసారి స్వప్నములోనైనా దర్శనమిచ్చుటలేదు.నాయపరాధమేమిటి? అమ్మా!కిశోరీ ! నాయపరాధమేమి?నీవైనా నాకు చెప్పరాదా? తల్లీ నన్ను మన్నించి నాకు దర్శనమివ్వరా అని కన్నీరు పెట్టుకొనుచు ప్రార్ధించుండెడివాడు.ఒకరోజు ఈయనవద్దకు వచ్చిన ఒక మహాత్ముని తన వేదనకు కారణమడిగాడు. ఆయన కొంచెఆలోచించి నాయనా! ఎల్లప్పుడు "హేరాధే’యని స్మరించు నీవుఒకసారి వైష్ణవ అపరాధం చేశావు.అది నాతల్లి రాధకు ఇష్టం లేదు.అని చెప్పెను. దానికి అయ్యా నెనెప్పుడూ ఎవరిని నిందించలేదు.నాస్థానమును విడిచి ఎక్కడికి వెళ్ల్లలేదు. నేను యాచనకు కూడా వెళ్లను .నాయీ ప్రవర్తనలో దోషమేమన్నా వున్నదా? అని ప్రశ్నించెను. అప్పుడా మహాత్ముడు గోవిందదాస్ నుచూసి ,కొలది దినములక్రితం కొలద్సి దినములక్రితం ఒకమహాత్ముడు నిన్ను భోజనమునకై తనయాశ్రమమునకున్ పిలచెను.ఆదినము తనగురువుయొక్క స్మారకదినమనిచెప్పినా కొమ్త కఠోరభాషతో తిరస్కరించితివి.ఏ మహాత్మునితో కూడా కఠోరభాషలో మాట్లాడకూడదు. ప్రతి మహాత్ముని హృదయంలోనూ రాధాదేవి నివాసముంటుంది .స్వల్పముగానైనా కఠినత్వమును ఆమె సహించదు.
ఆమహాత్ముని ఆశ్రమునకు వెళ్ళి ఒక్క మెతుకైనా భుజించిన బాగుండెడిది. ఇదియే నీయందలి దోషము.జీవులహృదయాంతర్వర్తియగు దయా స్వరూప రాసియే శ్రీరాధ. ఆమె హృదయము నవనీతము కంటె కూడా కోమలము.ఆతల్లి వాక్కుమధురము,ఆనడక లావణ్యసహితము.ఆమె నేత్రములనుండి అనురాగ కిరణములు సదావర్షించుచుండును.

నీవు వెంటనే ఆ మహాత్ముని కలుసుకుని క్షమాపన కోరుకుని ఆయన ఆశ్రమములో భోజనము స్వీకరించు. అని చెప్పెను.గోవిందదాస్ అట్లే చేసెను.
కొన్నిదినముల తరువాత ఆయన యుగళ కిశోర్ లకు ’భోగ్"తయారు చేయుచుండగా ఒక చిన్నపిల్లవాడు ,ఒక అమ్మాయి వంటయింటి లోకి ప్రవేశించి భోగ్ నందలి రెండు రొట్టెలను ఎత్తుకొని పోవుచుండగా శ్రీగోవిందదాస్ వారి వెంటపడి " అరే పిల్లలూ !ఇంకా భోగ్ కాలేదు. మీరు తీసుకునివెల్లకూడదు.అనివారిస్తూ పరిగెత్తుతున్నాడు.ఆపిల్లలు కిశోరీవనమునందలి యుగళకిషోర్ మందిరమునకు పోవుచుండగా వారిని అనుసరించాడు.అచ్చట మూర్తుల చేతులలో రెండు రొట్టెలు ఉండెను.అదిగాంచిన గోవిందదాస్ మూర్ఛిల్లెను. యుగళకిశోరులే స్వయముగా వచ్చు తమభోగ్ తామే తీసుకుని వెళ్ళిరని తెలుసుకుని ధన్యుడాయెను.గోవింద దాస్ యుగళ కిశోరులనే చింతించుచు తరువాత కొంతకాలమునకు నిత్యలీలలో చేరిపోయెను.

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP