హైదరాబాద్ లో నిన్న బ్లాగర్లని కలవటం ఎంత అదృష్టం ...
>> Friday, December 26, 2008
నిన్న నాకు చాలాసుదినం అనిపించినది. తెలుగు బ్లాగు లోకములో లబ్దప్రతిష్టులైన బ్లాగర్ లను కలుసు కునే అవకాశం కలిగింది. వుదయాన్నే సికిందరాబాద్ లో ఝాన్సీ గారింటిలో పూజ ముగించుకునే సరికే ౧౨.౩౦ అయినది. అక్కడనుండి బయలు దేరి మన యోగి[రంజిత్] వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికీ దాదాపు మూడు గంటలైనది.వాళ్ళ అమ్మగారు ఎంతో ఆప్యాయతతో వంటచేసి వడ్డించారు. పిల్లగాడు సీమ పౌరుషాన్నే కాదు,సీమలో ప్రభవించిన ఆధ్యాత్మిక వేత్తల వారసత్వాన్ని కూడా పుణికి పుచ్చుకున్నట్లనిపించినది నాకు. చిరంజీవ... ఆతరువాత అతని నన్ను బుక్ ఫెయిర్ వద్దకు రమ్మని మన శ్రీధర్ ఆహ్వానించటమ్ తో ఇద్దరం కలసి అక్కడకు వెళ్ళాము. తెలుగు బ్లాగు లోకం లోవున్న జ్ఞాన నిధిలాంటి తాడేపల్లి గారిని మొడటగా చూసి పలకరించాను.హరివిల్లు బ్లాగర్ నన్నుపరిచయం చేశాడు. నిజంగా ఆయనతో మాట్లాడుతుంటే ఎవరో అన్నట్లు సజీవ గ్రంథాలయంతో సంభాషించినట్లే వున్నది. తరువాత అనిల్ గారు పరిచయమయ్యారు. ఇంతలో వచ్చిన ప్రముఖ బ్లాగర్ కత్తి గారిని నేనసలు గుర్తు పట్టలేదు. ఫోటో లో చూసిన ఆయన వీరేనని నాకు వాళ్ళు పరిచయం చెయ్యగానే బోల్డు హాశ్చర్య...పోయాను. వాస్తవానికి ఆయనను నేను మీరు ఏ..కాలేజ్.!! అని అడగాలనిపించింది.ఆడిగున్నా బాగుండేది. కాలేజ్...నేనా? అనే లోపల వాల్ల బుడ్డోడు ...ఏ ఐస్ క్రీంతింటూనో డాడీ.... అని పరిగెత్తుకొస్తే .. మీరంగు మీవయస్సునసలు తెలియనియ్యటమ్ లేదని మనం అడిగేవాళ్లము .ఆయన వాడే సబ్బు పేరన్నా తెలిసి పొయ్యేది. [కత్తి గారూ ఏమీ అనుకోకండి. మీ ఫోటోలో నల్లగా వుంటే ప్రత్యక్షం గాచూసిన మీకలర్ నాకు అలా అనిపింపజేసినది.] తాడే పల్లి వారికి ఒక యాడ్ న్నాదొరికేది.ప్చ్,,,ఏమిలాభం మిస్సయ్యాను.
తరువాత చదువరి గారిని, చావాకిరణ్ ,ఇంకా కొందరిని కలిసాను,వారందరి పేర్లు గుర్తు పెట్టు కోవటమ్ హడావుడిలో కుదరలేదు. ఇంతలో మా మురలీధర్ అయ్యప్ప స్వామి ప్రసాదాన్ని తెచ్చి పెట్టాడు.సమయం లేక కొద్దిసేపన్నా మాట్లాడ లేకపోయాను రిటన్ అవ్వాలి పొద్దున్నే పూజకు పీఠానికి చేరు కోవలసి వున్నందున.
వీళ్ళలో ఒక్కోక్కరు పోతపోసిన సరస్వతీ పుత్రులులాగావున్నారు. పలుసబ్జక్టులలో నిష్ణాతులు. ఏదో అమ్మవారి కరుణ వల్ల అడ్డగోలుగా మాట్లాడే శక్తి వచ్చినది కానీ ,వాస్తవానికి వీళ్ళ చదువుల లో సగానికి కూడా సరితూగనని పించినది నాకు.
**************************************************************************************
పీఠము నుండి తీసు కెళ్ళిన అమ్మవారి ప్రసాదాలు కొందరికి మాత్రమే ఇవ్వ గలిగాను.అడగని వారికి నమ్మకము లేనివారికి దివ్య ప్రసాదాలను ఇవ్వరాదు అనే నియమము నాకున్నది. దానికీ కారణమున్నది. ఒకసారి ఒకదివ్య మాలను దేవీ లోకం లో ప్రసాదముగా పొందిన దుర్వాసుడు దానిని దారి లో ఎదురైన ఇంద్రునికి గౌరవ పురస్సరంగా ఇచ్చాదట. కానీ ఆయన దానిని నిర్లక్ష్యంగా ఐ రావతమ్ కుంభస్థలం పై వేయగా అది ఆమాలను కిందపడవేసి తొక్కినదట. ఆ దోషఫలితంగా ఇంద్రుడు సర్వ సౌభాగ్యాలు నశించి పతన మయ్యాడని తెలుస్తున్నది. అందువలననే నేను శ్రద్ద లేని వారికి ప్రసాదాలివ్వను.ఏమీ అనుకోవద్దు.
**************************************************************************************
ఇక అన్నీ బాగున్నాయి కానీ తెలుగు గురించి తపిస్తున్న వారు కూడా తెలుగు వారి సాంప్రదాయాల పట్ల కూడా శ్రద్ద చూపితే బాగుండేది. మావూర్లో నైతే ఏదన్నా వూరునించి వచ్చిన వారిని అన్నం తినమని తినేదాకా వదలము.మరి ఇక్కడ కనీసం ఒక్కరన్నా కూల్ డ్రింక్ తాగుదామా? [ఆ చలి కెలానూ తాగము లెండి] అనో ,కాపీలు తాగారా? టిపినీలు తిన్నారా? అనో ఆడిగితే బాగుండేదనిపించింది.
వాళ్ల బాధలు వాల్ల కున్నాయి లెండి. ఇలా రోజూ వచ్చే వాళ్లందరి కీ కాపీలు,టిపినీలు చూస్తే సిటీ బస్సు కు కూడా చిల్లర మిగలక ఇల్లకు చేరాలంటే ......... అలా అని పించి సర్దుకు పోయాలెండి . లేకపోతే హైదరాబాద్ వాల్లని అక్కడే అడి గేసేవాడిని. పాపం శ్రీధర్ మీతో పది నిమిషాలన్నా కేటాయించి మాట్లాడలేక పోయానని అన్నారు. [ఇది సరదాకి వ్రాసానండి ]కానీ ఈ కార్య క్షేత్రం లో ఆయన ,ఆయన తో పాటు మిగతా బ్లాగర్లు చేస్తున్న కృషి చూస్తుంటే వాళ్ళు మాతృభాష మనుగడ కోసం పడుతున్న తపన చూసాక ఎవరము ప్రత్యేక మర్యాదలు కోరు కోము అని౯ చెప్పాలనిపించింది. ఇలా చెబుతున్నాను. తెలుగుబ్లాగర్లలో ఇంకా నేను చూడాలనుకున్నవీవెన్, దుర్వాసుల,మా నరసరావ్ పేట సుజాత విరజాజి సిరీష, జ్యోతి తది తరులను ఇంకా మిగతా బ్లాగర్ లను కలుసు కోలేక పోయాను. కలుసుకున్నవారు చూపిన ఆప్యాయతకి మనస్సు ఆనందంతో నిండిపోయినది.నమస్తే..జైహింద్
[అక్కడ తీసిన ఫోటో ఒకటి మెయిల్ లో పంపగలరని కోరిక]
4 వ్యాఖ్యలు:
మంచి నీళ్ళూ ఉన్నవా? తెచ్చిపెట్టమన్నారా? నాష్టా చేసారా? చల్లని కూల్ డ్రింకు ఇదిగోండి అంటూ, నేను చెయ్యగలిగిన సహాయం ఏమైనా ఉందా అని సందర్శకులు అక్కడి బ్లాగరలను అడిగితే బాగుంటుంది.
ఎడతెరిపి లేకుండా, విసుక్కోకుండా అందరికి, ఆ రద్దిలో, ఆ దుమ్ములో, ఆ ధూళిలో తెలుగు మీద ప్రేమతో, ఒక్క కాసు స్వలాభాపేక్ష లేకుండా, నిస్వార్ధంగా, నేను ముందంటే, నేను ముందని ముందుకు వచ్చే వారికి మనం ఏం ఇవ్వగలమని ఆలోచించుకోవాలి? అవును అక్కడ తెలుగు సేవక బ్లాగ్ మిత్రులకి ఇతర బ్లాగర్లు ఏవైనా గుర్తింపు కార్యక్రమాలూ చేస్తున్నారా?
విన్నంతలో అక్కడ స్టాల్ సందర్శకులే ఇచ్చే ప్రోత్సాహం మాకు చాలని వారనుకుంటున్నారట.
ఈ క్రింది వ్యాకాలు చదివిన తరువాత, పై అభిప్రాయం:
"ఒక్కరన్నా కూల్ డ్రింక్ తాగుదామా? [ఆ చలి కెలానూ తాగము లెండి] అనో ,కాపీలు తాగారా? టిపినీలు తిన్నారా? అనో ఆడిగితే బాగుండేదనిపించింది. వాళ్ల బాధలు వాల్ల కున్నాయి లెండి. ఇలా రోజూ వచ్చే వాళ్లందరి కీ కాపీలు,టిపినీలు చూస్తే సిటీ బస్సు కు కూడా చిల్లర మిగలక ఇల్లకు చేరాలంటే ......... అలా అని పించిపోయాలెండి ."
దుర్గేశ్వరగారు,
హైదరాబాదు వాళ్లకు అథితి మర్యాదలు బాగా తెలుసండి. కాని ఇక్కడ బ్లాగర్లు ఉన్నది ఇంట్లో కాదు , పుస్తక ప్రదర్శనలో .. అదీ ఒక నిస్వార్ధ సేవలో. ఇక్కడ ఎవ్వరు కూడ తమ బ్లాగు పేరు చెప్పుకోవడం లేదు. మద్యాహ్నం ఇంట్లో భోజనం చేసి చాలా దూరాల నుండి వచ్చి ఇక్కడ సందర్శకులకు తెలుగు రాయడం ఎలా అందే చూపిస్తున్నారు. మనం ఇంట్లో వెచ్చగా స్వెట్టర్లు వేసుకుని మన కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటే, అక్కడున్నవారు తమ ఉద్యోగ బాధ్యతతో పాటు ఈ పని తలకెత్తుకుని చలిలో పని చేస్తున్నారు రాత్రి తొమ్మిది వరకు. అంతవరకు అక్కడ దొరికే వేడినీళ్లు అనబడే టీలు, దొరికిన అడ్డమైన గడ్డి తిని ఆకలి తీర్చుకుంటున్నారు. మనమే వారిని పరామర్శించాలి. చేతులెత్తి మొక్కాలి. వాళ్లు ఎంత కష్టపడుతున్నారో వారి కుటుంబ సభ్యులకే తెలుసు..
దుర్గేశ్వరగారూ,
నమస్కారం.
నిన్న నేను పని వత్తిడిలో రాలేకపోవటం వల్ల మిమ్మల్ని చూడలేకపోయాను. వచ్చారని తెలిసి సంతోషమనిపించింది. కాఫీ, కూల్ డ్రింక్స్.. అంత దూరం నుంచి వచ్చాక ఆమాత్రం పలకరింపు ఆశించడంలో మీ తప్పేమీ లేదు లెండి. అక్కడున్న వారి పరిస్థితిని వెంటనే అంచనా వెయ్యగలిగారు కనుక, అడగలేదు మీరు. అయినా అది డబ్బుకు సంబంధించిన సమస్య కాదు.. సమయం, అంతకు మించి, ఇది మనందరిదీ అన్న భావం వల్లన. అంతే. కుటుంబసభ్యుల వంటి చనువుంది మనందరిలో. ఇంత చిన్నవి మనసులో పెట్టుకోకండి. మీరు విజయవాడ పుస్తక ప్రదర్శనకు 4 తేదీ, ఆదివారం రాగలిగితే బాగుంటుంది. వీలు చూసుకోండి.. ఇబ్బంది పడకండి. ఉంటానేం..
అరుణ పప్పు
మిత్రులకు
నమస్కారం.అర్ధరాత్రులు అపరాత్రులని లేకుండా గ్రామాలకు వెళ్ళి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో సేవలందించిన అనుభవం నాది.అక్కడ వున్నవాళ్ళ పరిస్థితి నాకు తెలియక కాదు.సరదాకి వ్రాసాను.అక్కడ నేను వాడిన భాషనన్నా చూసి హాస్యాని కనుకోక పోతే ఎలా? సరదా లేని జీవితం చప్పగా వుంటుంది.మనవాళ్లన్న భావనతోనే కదా వ్రాశాను పరాయి వాళ్ల కెవరి కన్నా అలా వ్రాస్తామా? స్వచ్చందం గా వారు సాగిస్తున్న ఈ ప్రయత్నానికి నేనెప్పుడూ అభినందనలు తెలిపేవాడినే.తప్ప తప్పులు వెదికే రకం కాదు.౨౦౦౦ లో సికిందరాబాద్ స్వరాజ్యప్రెస్ లో జరిగిన కోటి హనుమాన్ చాలీసా యజ్ఞానికి వచ్చి మూడురోజులు చీపుర్లు పట్టటమ్ కాడనుంచి పట్టలు పరవటమ్ కాడనుంచి యజ్ఞక్రతువునంతా ఎవరు రాత్రింబవళ్ళు తిన్నావా అని అడిగిన వాళ్ళు లేకున్నా పని చేసిన వాళ్లము ,ఇంత ఆప్యాయతతో పలకరించిన మిత్రులలో తప్పులెన్ను తామా? సరదాకండీ .
అవును చాలారోజులైనది పలకరించి .ఒంగోలు బాబూ ! ఎలా వున్నావు ? నువ్వొచ్చావా? నన్ను పలకరించల లేదే? చాలా రోజులుగా ఎదురు చూస్తున్నా నీ కోసం.మాట్లాడాలని.అరుణ గారికి జ్యోతి గారికి ఇలా నన్నా పలకరించారు సంతోషం.
Post a Comment