బ్రాహ్మణత్వం కల వారు తయారవటం నేటి అత్యవసరం
>> Monday, December 29, 2008
నేటి వ్యవస్థ లో ధార్మిక జీవనానికి పట్టుకొమ్మ లాంటి బ్రాహ్మణ వ్యవస్థ నిర్వీర్యమై పోతున్నది. తద్వారా సమాజానికి ధార్మిక శిక్షణ నిస్తూ ,సమాజాన్ని నీతి,న్యాయ మార్గాలలో నడపవలసిన ,భగవంతుని పట్ల విశ్వాసాన్ని కలిగించి ఈవ్యవస్తను కాపాడవలసిన ఒక అంగము చచ్చుబడిపోతున్నది. దాని పరిణామమే ఈ రోజు సమాజములో చూస్తున్న కొన్ని వైఫల్యాలకు కారణము. అసలు ఈవ్యవస్త ను గురించి కాస్త పరిశీలిద్దాము.
ముందుగా వర్ణవ్యవస్థ నుంచి పరిశీలన మొదలెడదాము." జన్మానాం జాయతే శూద్ర:" అని అంటున్నది వేదం .అంటే జన్మించిన ప్రతివాడూ శూద్రుడే అని అర్థము. తల్లి గర్బము లోనుంచి బయటకు వచ్చిన ప్రతిశిశువు [వీరిలో కారణజన్ములు వేరు] శూద్రుడే .తరువాత యజ్ఞోపవీత ధారణ చేసి ,ఎప్పుడైతే పవిత్ర గాయత్రి మంత్రాన్ని చెవిన వింటాడో అప్పుడు రెడవజన్మనెత్తిన వాడయి,ద్విజుడు అనబడుతున్నాడు. ఆతరువాత లోకశ్రేయస్సు కోసం .ఆత్మశ్రేయస్సు కోసము వేదాధ్యయనం చేసి విప్రు డనబడుతున్నాడు. చదివిన చదువును ఆకళింపు చేసుకుని ,దానిని తపో పూర్వకంగా ఆచరణలోకి తెచ్చుకుని సర్వ సమబుద్ధితో దర్శించగల బ్రహ్మత్వాన్ని పొందగలిగినప్పుడు బ్రాహ్మణుడనబడుతున్నాడు. ఇదీ వరుస క్రమము.
ప్రతి వ్యవస్థ అది చిన్నది కానివ్వండి ,పెద్దది కానివ్వండి దాని నిర్మాణ నిర్వాహణకు కొన్ని విభాగాలు అవసరమవుతాయి. ఇంత పెద్ద సమాజాన్ని సక్రమ మార్గము లో నడపటానికి మన మహర్షులు తమ త్పోస్క్తులన్ని ధారబోసి భగవంతుని ఆదేశాను సారము ఒక గొప్ప వ్యవస్థకు రూపాన్ని చ్చారు. అదే చాతుర్వర్ణ వ్యవస్థ . ఇకదీనిగురించి ఇంకొంచెం లోతుగా చూద్దాము.
ఏదైనా ఒక వటువు తయారు చేయాలను కోండి, దాని గురించి యోచన చేసి తమ వూహలో ఒక నిర్మాణాన్ని నిర్మింపజేసుకుని దాని గురించి ఇతరవ్యవస్తలకు వివరించే పని చేసేదే బ్రాహ్మణ వ్యవస్థ. ఇది మెదడు అంటే తలతో చేసేపని కనుక ,బ్రాహ్మణోస్య ముఖమాసీత్ .. అని వేద సూక్తాలలో చెప్పబడినది. ఇక ఆ వుత్పత్తి తయారయి వినియోగము లోకి వెళ్ళేవరకు రక్షించవలసిన విభాగము ఒకటున్నది. దాని నే క్షత్రియ వ్యవస్థ అన్నాము. ఈవ్యవస్తను సమాజము పోషిస్తున్నది కనుక సమాజ రక్షణ కోసము తన ప్రాణాలను ఒడ్డయినా .తన ప్రాణాలను తృణ ప్రాయం గా త్యజించి నిర్వహించవలసి వున్నది. పిరి కివాడు ఈపని చెయలేడు కనుక పిరికివానికి క్షత్రియునిగా గుర్తింపు వుండదు. ఇక శరీర అంగాలలో రక్షణ భాగాలైన చేతులను సూచిస్తూ "బాహూ రాజన్యకృత: అని చెప్పబడినది. ఇక మూడవది వైశ్య విభాగము .తయారయిన వస్తువులను సమాజము లోని అన్ని భాగాలకు సరఫరా చేసినప్పుడే కదా సార్ధకత, కనుక ఈ సరఫరా విభాగాన్ని వైశ్య వ్యవస్థ అన్నారు. రవాణాకు ఆధారమైన కాళ్ళను సూచిస్తూ "ఊరూ తదస్య తద్వైశ్య:
అని ప్రురుషసూక్తము లో వర్ణింపబడినది. ఇక ముఖ్యమయిన శూద్ర విభాగము శ్రామిక వ్యవస్థ. ఈ కార్య క్రమాని కంతా ఆధార భూతము శ్రమించి వస్తూత్పత్తిని చేసే విభాగము శూద్ర వ్యవస్థ. కనుకకనే దానిని శ్రమకు గుర్తుగా "పద్భ్యాగం శూద్రో అజాయత" అని వర్ణించారు
. అంటే భగవంతుని కికూడా ఆధారభూతమయిన కాళ్ళతో పోల్చారు. భగవంతుని దర్శించాలం తే ఆయన కాళ్ళకు మొక్కాలి.మొదట పాదాలను దర్శించాలి. దానివలన సమాజం మొత్తానికి ఆధార మైన శూద్ర వ్యవస్థ ఎంత ముఖ్యమయినదో తెలుస్తుంది. కనుక ముందు గౌరవించవసినది శూద్ర వ్యవస్థనే . కాకుంటే ప్లాన్ వేసిన ఇంజనీర్ కిచ్చే వేతనము ,బొచ్చెలు మోసి చేమటోడ్చే కూలి కివ్వము. ఇది మనము తయారు చేసుకున్న లోపమో ,శాపమో తెలియదు.
ఇక janmimchina మానవులలో ఎవరు ఏవిభాగాని కిచెందుతారనేది,ఒక పరిశీలన.
మానవుడు జన్మించిన తరువాత తన పూర్వజన్మ సంస్కారాలనను సరించి ఏదో ఒక వృత్తిని చేపడతాడు. అది అతని ప్రవర్తన ,ఇష్టాలననుసరించి వుంటుంది. కనుకనే ఆయా వృత్తులలో వున్నవారిని ఆయా వర్ణవ్యవస్తలకు చెందినవారిగా పరిగనించారారోజు. పుట్టుకను బట్టి కాక ఆయన ప్రవర్తనను బట్టి వర్ణము వ్యవహరిమ్చబడేది. ఒక వేళ తాను,తన , మార్చుకున్నా ,లేక మరోకస్తాయి సాధించినా ఆయనను ఆవర్ణానికి చెందినవానిగా పరిగణించేవారు.
వుదాహరణకు విశ్వామిత్రుడు తన రాజరికము పై రోసి తపో ఫలితముగా బ్రహ్మర్షిగా
మారిన వైనము మనకు తెలుసు.అలాగే మహాభారతములో ధర్మ వ్యాధుడు కుటుంబాన్ని పోషించుకునేందుకు మాంసము అమ్మినా ఋషిగానే పరిగణింపబడ్డాడు. అలా గే సూతుడు లాంటి పౌరాణికులు కూడా బ్రాహ్మణూలుగానే గౌరవింపబడ్డారు. కనుక ఇది గుణాత్మకమయిన వ్యవస్థయే కాని జన్మననుసరించిఏర్పడ్డ వ్యవస్థకాదు. కనుకనే పరమాత్మ గీతలో చాతుర్వ్రర్ణం ......గుణకర్మ విభాగశ: అని చెప్పారు.
మరి కాలానుగుణం అన్ని విషయాలలోనూ కొంతమంచి కొంత చెడు వచ్చి చేరుతూ వుంటాయి.గాలిలో వుంచినరాగి పాత్రకు చిలుము పట్టినట్లు ఈ గొప్ప వ్యవస్థ కు కూడా యుగధర్మాలననుసరించి కొంతచిలుము పట్టినది. ఒకప్పుడు ఈదేశములో ప్రతివ్యక్తి గాయత్రీ మంత్రదీక్షాపరుడై శక్తి వంతునిగా మారి మానసిక ప్రలోభాలు దరి చేర్చనీయకుండా చూసుకుంటూ పవిత్ర మానవులుగా జీవించేవారు. కనుకనే సత్యధర్మాలతో సాగే ఆదివ్యమానవుల జీవన విధానాన్ని చూసి ,ఈదేశాన్ని దర్షించిన ఇతర ప్రాంతాలవారు ఇక్కడ ముక్కోటి దేవతలున్నారని పొగడేవారు. తరువాత మానవులలో కొంత అలసత్వము ,తయారు చేసుకున్న సౌఖ్యజీవనము దానికొరకు పనుల విభజన ఇలా అనేక కారణాలవలన.కొందరికి ఈధార్మిక మేధోపరమయిన శ్రమను అప్పగించారు. వాళ్లలో కూడా తాము తిన్నా తినకున్నా ఈధర్మాన్ని ఇప్పటిదాకా కాపాడు కొస్తూ ధర్మాన్ని రక్షించుకొస్తున్నారు. సహజముగనే మానవ జీవితములో అజ్ఞానము వలన దీనిని స్వార్ధపరులు కులవ్యవస్థగా మార్చుకున్నారు. ఇక పంచమ వ్యవస్థ త్రేతాయుగము దాకా కనిపించదు.బహుశా ఏ బాధ్యతనూ నిర్వహించకుండా జీవించేవారిని తరువాత కాలములో ఎవరో ఇలా వ్యవహరించి వుంటారు. అది ఒక జాఢ్యమై కూర్చుని ఈ రోజు జాతికి రోగమయి పోయినది.ఇక మనుధర్మ శాస్త్రాదులను కాలాప్రవాహములో ప్రక్షిప్తాలతో నింపి కొన్ని అవాంచనీయ విషయాలను చేర్చి విమర్శలకు గురయ్యేలా చేశారు. కనుకనే అత్రి మహర్షి లాంటి మహాను భావులు ధర్మశాస్ర్తాలను సంస్కరించేపనికి కూడా పూనుకున్నారు. ఇక ఈ కలిప్రభావము తీవ్రమయిన ఇప్పటి కాలాన్ని చూస్తే వ్యవస్తలన్నీ ఎక్కువభాగం వాచకార్థముగా మారి పోయాయి. కనుకనే దాని అర్దానికి సరిపోక విమర్షనా పాత్రమవుతున్నాయి.
ఇక ఇప్పుడు చూస్తే ,ఏవ్యవస్థలోనివారు అక్కడకాక తమకు అనుకూలమయిన వృత్తి లోకి మారుతున్నందున,ధర్మాన్ని కాపాడవలసిన వ్య్వస్థలో ఎక్కువమంది నిలవటము లేదు. ఫలితముగా ధర్మాచరణకు మూల కేంద్రాలయిన దేవాలయాలు పూజారులు లేక తాళాలు వేయబడుతున్నాయి.ఎంతో శక్తివంతమయిన ఈ కేంద్రాలు నిర్వీర్యమవటము లోకానికి క్షేమకరము కాదు.కనుక ఆశక్తి ఉన్న ధార్మికులకు ఆయా వ్యవస్థానిర్వాహణలో తగిన శిక్షణ నిచ్చి నియమించాలి,జన్మతో కులాన్ని గుర్తించే ఈ లోపభూఇష్ట పద్దతిని కాదని. లేకుంటే ఇది మనధర్మానికి ప్రమాదకరమయిన పరిస్థితులను ఎదుర్కోలేదు.
ఇక ఏ వ్యవస్థయినా మనగలగాలంటే దానిలో నిర్వాహకులు శక్తివంతులై వుండాలి. జన్మతా కేవలము బ్రాహ్మణునిగా పుట్టినందువలననో,కేవలము ఆవేశము తో మాత్రమే శిక్షణతీసుకున్నందువలననో ఈ అర్చనా వ్య్వస్థకు పనికి రారు. మిగతా ధర్మాలలో
సంగతే మోగాని ఇక్కడ మాత్రము దైవానుగ్రహము పొందలేనివానివల్ల అతని పూజలవల్ల ఇతరులకు మేలు జరగదని స్పష్టముగా చెప్పబడుతున్నది.కేవలము బ్రాహ్మణ పుట్టుక పుట్టినంతమాత్రాన సదాచారము లేక ,భక్తిపూరిత హృదయునిగాలేకపోతే ,అనాచారవంతులై తాగుబోతులు,తిరుగుబోతులై తే వాళ్లచెతులతో తాకితే దేవతామూర్తులలో ప్రవహించే దివ్యశక్తి ఆగి పోతుంది. ఆ దేవతా మూర్తుల వల్ల ,గాని అక్కడ జరిగే క్రియలవల్ల గాని లోకానికి ఏ మాత్రం మేలు జరగదు. సరికదా దుష్పలితాలొస్తాయి.
మానవులను విభజించే ఈ అస్థవ్యస్థవ్యవస్థలో అడుగుభాగముగా పరిగణించబడిన చోటునుంచి వుద్భవించిన ముమ్మడివరం బాలయోగిలాంటి మహాపురుషులు,మహాభక్తులవలన లోకము పావనమయినది. కనుక అటువంటి సద్ బ్రాహ్మణులను పెంపొందించినప్పుడే లోక కల్యాణము జరుగుతుంది. కనుక ఇది ఇతరుల పట్ల వ్యతిరేకతో,లేక ఏదో మరొక మార్పుజరిగి తమకేదో తగ్గుతుందనే భావంతో కాక ధర్మగ్లానికి మనముచేస్తున్న చికిత్సగా భావించి అందరము కలసి పని చేయాల్సిన సమయము.అప్పుడే ఈ కులాల కుంపట్లు కూలిపోయి .లోకానికి క్షేమకరమయిన సనాతన వర్ణవ్యవస్థ ఏర్పడుతుంది. తద్వారా దేశము,ధర్మము శక్తివంతమవుతాయి. కానీ దానికి తీవ్రమయిన ప్రతిఘటన కలిపురుషుని ప్రభావానికి లోనయిన వారినుండి ఎదురవుతుంది తప్పని సరిగా.పీఠాధిపతులు,ఆచార్యులు,ధార్మికపురుషులు ,అందరు కలసి ఈ సాగరమథనానికి పాటుపడాలి.హాలాహలం పుట్టించటానికి కలి సేన సిద్దమ్గావున్నా పరమేశ్వరునిదయవలన మనము రక్షింపబడి అమృతభాండాన్ని పొందగలుగుతాము. ఇది నాలాంటి వాని మదిలో పుట్టటము కాకిరెట్టలోనుంచి పుట్టిన అశ్వథ్థవృక్షంలాంటి విషయము. కనుక పండితులు మహాను భావులు ఈదిశగా తమ సమరాన్ని ప్రారం భించవలసి వున్నది. నా అనుమానము దీనికెక్కడో శ్రీకారము చుట్టబడివుంటుంది అని. మొన్న ఒకధార్మికనిష్టాపరుడైన ఒక మిత్రుని నోటినుంచి రాగావిన్న నేను ఉలిక్కి పడ్దాను.నామనసులో ఎప్పటినుండో జరుగుతున్న సంఘర్షణ ఈయన నోటివెంట వచ్చినదేమిటా అని. ధర్మో రక్షతి రక్షిత:
2 వ్యాఖ్యలు:
చాలా బాగుందండి.
ఈ వ్యాసం లో మీరు చెప్పిన ఒక విషయానికి నా అభిప్రాయం వినిపిస్తాను.
"కాకుంటే ప్లాన్ వేసిన ఇంజనీర్ కిచ్చే వేతనము ,బొచ్చెలు మోసి చేమటోడ్చే కూలి కివ్వము. ఇది మనము తయారు చేసుకున్న లోపమో ,శాపమో తెలియదు."
తలతో పని చేసే వాళ్ళకి ఆదరణ వుంటుంది. ఎందుకంటే మేధస్సు ని వృధ్ధి చేస్కోవడం అన్నది క్లిష్టమైన విషయం కనుక. ఇప్పటి సాఫ్టువేరు వుద్యోగాల్లో చూసినా, అందరూ తెలివి గల వాళ్ళుగ గుర్తింపబడరు. చేసే పని, పని చేసే తీరు, ఎంత సమయం లో చెయ్యగలరు, ఎంత సృజనాత్మకం గా వుండగలరు, వ్యాపారాభివృధ్ధికి ఎంత తోడ్పడగలరు అన్నదానిమీద నేటి మానవుల మేధస్సు కొలబడుతోంది. మెదడు తో పని చేయ్యటానికి చాలా ప్రాణ శక్తి అవసరం అవుతుంది. ఇంకో విషయం ఏమిటి అంటే మెదడు పని చేసే సమయం లో జీర్ణక్రియ మిగిలిన సమయం లో కన్నా తగ్గుతుంది(రక్త సరఫరా మెదడుకి ఎక్కువగా వెళ్ళాల్సి వుండటం వల్ల). అందుకే ఆహారం సాత్వికం గా వుండాలి. పదిమంది తో తిరుగుళ్ళు, మాటలు పెట్టుకుంటే అనేక రకాల మనుషుల సంస్కార ప్రభావం పడి మనసు ఏకాగ్రత కోల్పోతుంది. అందుకనే విహారం లో కూడా నియమాలు పాటిస్తారు. ఇన్ని నియమాల మధ్య జీవితం సాగిస్తున్న మేధావికి ఎక్కువ జీతం రావడం లో ఆశ్చర్యం లేదు.
ఇప్పటి మేధావుల లాగానే అప్పటి బ్రాహ్మణులు. అందుకే అప్పటి కాలం లో వారికి ఎక్కువ విలువ వుండి వుంటుంది.
స్వామి వివేకానంద చెప్తారు. మనం(అన్ని
వర్ణాల వారు) మునుల సంతతి అని. ఆ సంస్కారం ఇంకా మనలో వుంది అని.
ఇక కంచి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు చెప్తారు కదా, సైకిలు గట్టిగ కొంతసేపు తొక్కి వదిలేశాక తర్వాత కొద్ది సేపు వరకు తొక్కకపోయినా పెడలు తిరిగి సైకిలు ఎలా ముందుకు పోతుందో, అలాగే ఇప్పటి తరం బ్రాహ్మణులు కూడా ఆచారాలు పాటించకపోయినా, వారి తాతముత్తాతల శ్రమ వల్ల బ్రాహ్మణత్వాన్ని ఇంక కలిగే వున్నారు అని. ఇక ఇప్పటికైనా మేల్కొని తిరిగి అన్ని బ్రాహ్మణ విధులను పాటించాలి అని.
అన్ని వర్ణాల వారు పూజారి వృత్తి లోకి రావడం అన్నది స్వాగతించతగిన పరిణామం. కాకపోతే పూజారి వృత్తి కి పుట్టినప్పటి నుండి వంశాచారం గా అంకితమైన వాళ్ళ సంగతి ఏంటి. అయినా చేయించుకునే వాళ్ళని బట్టే పూజారి. ఫలితం బాగ వుండాలి అనుకుంటే పధ్ధతి గా వుండేవాళ్ళని జనాలు వెదుక్కుంటూ వెళ్తారు. అన్ని వృత్తుల్లో యజమానిని మోసం చెయ్యగలరు కాని, పూజారి వృత్తి లో యజమాని అయిన దేవుడిని మోసం చెయ్యలేరు. కనీసం ఈ రకం గా అయినా ప్రజల్లో భక్తి, విశ్వాసాలు పెరిగి సత్వ గుణం వస్తే మంచిదే గా.
దుర్గేశ్వరగారు,
రాణి శివశంకర శర్మ రాసిన ‘ద లాస్ట్ బ్రాహ్మిన్’ పుస్తకం తప్పక చదవాలి మీరు. అశ్రద్ధ చేయకుండా చదవండి. పేరు ఇంగ్లీషున ఉన్నా, తెలుగు పుస్తకమే. అది బ్రాహ్మణ తత్వం గురించి కొన్ని స్థూల విషయాలను విశదీకరించి చెబుతుంది... మీ ఆలోచనకు పుటం పెడుతుంది.
Post a Comment