సంగమేశ్వరం లో పుష్కర శోభ
>> Tuesday, December 23, 2008
పుణ్యస్థలి యగు సంగమేశ్వరం లో జరిగిన తుంగ భద్ర పుష్కరాలలో భక్త జనులు పూజలు జరుపుకున్నారు. విశ్వామిత్ర మహర్షి ,శాండిల్య ముని లాంటి మాహా పురుషుల తపో భూమి ఇది. ఇక్కడ ప్రధానాలయం నీటిలో మునిగి వుంటుంది. సంగమం లో వేసవిలో నీరు తగ్గితేనే ఆలయం బయటకు కనిపిస్తుంది. ఏడు నదులు సంగమిస్తున్న ఈ పవిత్ర స్థలం లో ఇంకా వ్యాపారపు జాఢ్యాలు అంటక పోవటం వలన పవిత్రం గా ప్రశాంతం గా వుంటుంది. సాధకులకు చాలా మంచి ప్రదేశము. కర్నూల్ జిల్లా ఆత్మకూరు నుంచి ఒక బస్ తిరుగుతుంది. అక్కడ వసతుల కోసం ఎదురు చూడకుండా సాధన చేసుకునే వారికి మంచి అవకాశము
0 వ్యాఖ్యలు:
Post a Comment