పర్వదినాలమాసం. పరమశుభాలనిచ్చే కార్తీకం
>> Friday, November 7, 2008
పరమ పుణ్యమయిన కార్తీకమాసము జరుగుతున్నది. ఈమాసములో నదీస్నానం ,దీపదానములు వ్రతాలు విశేష ఫలదాయకములు. ఈమాసములో ఉపవాసము,జాగరణ స్నానం దానం మామూలుకన్నా ఎన్నోరెట్లు ఫలితాన్నిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. విష్ణువును,తులసి,మల్లె కమలం, జాజి అవిసె పూవులతోను,శివుని బిల్వదళాలు,జిల్లేడు పూలతో పూజిస్తేఇహపర సౌఖ్యాలు కలుగుతాయి.
కార్తీకం లో దశమి,ఏకాదశి,ద్వాదశి తిథులలో శ్రీమహావిష్ణువును, తులసీదళాలతోటి అర్చించటం జీవితాంతము ధన ధాన్యాలకు లోటువుండని ఫలితాన్నిస్తుంది. అదేవిధంగా ఆరుద్ర నక్షత్రం రోజు ,మాసశివరాత్రి,నాడు,సోమవారము,కార్తీకపౌర్ణమి రోజు శివుని పూజించిన వారికి అనంతమయిన సౌఖ్యాలుఅంతముజన శివసాయుజ్యము లభిస్తాయని కార్తీక పురాణముచెబుతున్నది.
ఈ మాసములో చేసే వనసమారాధన మనిషికి ఆధ్యాత్మిక శక్తులనివ్వటమేకాక,సామాజిక బంధాలను
మరింతదృఢపరుస్తుంది.
కనీసము సోమవారము,పౌర్ణమి రోజులలోనయినా తప్పనిసరిగా ఆలయానికెళ్ళి దీపాలు వెలిగించటము, పూజ జరుపుకోవటము సకల పాపాలను ధ్వంసం చేస్తుంది. సత్యన్నారాయణ స్వామి వ్రతమ్ తదితరవ్రతాలు మరింత ప్రభావాన్ని చూపుతాయి.
ఉదయం చేసే చన్నీటి స్నానాలు మనిషిలో చైతన్యశక్తులను మేల్కొలుపుతాయి. బద్దకించి వీటిని వదలు కోవటమంటే మనశ్రేయస్సును మనమే దూరన్ చేసుకోవటమే.
0 వ్యాఖ్యలు:
Post a Comment