మంచి చెడు గాను చెడుమంచిగాను కనపడే కలి కాలమిది.
>> Monday, October 13, 2008
యుగధర్మాన్ననుసరించి జీవుల ఆలోచనలు ,బుద్ధులు కొనసాగుతుంటాయి. ప్రస్తుతమున్న కలికాలం కలిపురుషుని ఆధీనములో సాగుతున్నది. కలి ప్రభావము వలన మానవుల ఆలోచనా తరంగాలు ఎక్కువగా చెడు వైపునకే మల్లు తుంటాయి. ప్రతిదానిలోనూ మంచిని కాక చెడుభావాలను గ్రహించటానికే మొగ్గుచూపుతుంటాయి. కనుకనే భగవంతుని గూర్చిన పవిత్ర గ్రంథాలపట్ల, పవిత్ర వ్యక్తులపట్ల కూడా చెడును ఆపాదించాలనే తహతహ మొదలై అది మేధావులుగా తమకు గుర్తింపురావాలనే తపనతో తమకు తెలియకుండానే పాపపు రాసిని పెంపొందించుకునేలా చేసే విధంగా సాగుతుంటాయి.
ఈ మధ్య నేను విన్న ఒక సంఘటన మీకు తెలియ జేస్తాను. ఒక ధనవంతులదంపతులకు ఒకే అబ్బాయి. వాడూమంచి సంస్కారం ,ఉన్నత భావాలు కలవాడు. ఈ మధ్య వానికి పెళ్ళి సంబంధాలు చూస్తున్నారు. ఒక ఊరిలో ఒక సంబంధం చూడటానికి వెళ్ళారు. అమ్మాయి చూడ చక్కగా వుంది. చదువు సంస్కారం గలకుటుంబమని తెలిసింది. కాకుంటే ఆర్ధికంగా తక్కు వస్థాయిలో వున్నారు. ఈ పిల్లవానిని అమాయి నచ్చిందా అని అడిగారు. మనవాడు అప్పటికే ఊహలలో విహరిస్తున్నాడు. ఈ అమ్మాయిని నేను చేసుకుంటే తనతల్లి దండ్రులను వదలి ,తనవారందరిని విడచి నాయిటికి రావాలి. నాకు జీవితాంతము సేవలు చెయ్యాలి, నాకోసం నాకుటుంబము కోసం శ్రమించి పనిచేయాలి, అటువంటి స్త్రీని కట్నమడగటమంటే నిజంగా పాపము. దుర్మార్గము. దురాచారం ....ఇలాసాగుతున్నాయి అబ్బాయి ఆలోచనలు. ఏమ్ బాబూ... అమ్మాయి నచ్చిందాలేదా ? ఏమన్నా అడగాలా అని అమ్మాయి తండ్రి ప్రశ్ని0చాడు మల్లీ . అప్పుడు అబ్బాయి లేచి ,ఈ అమ్మాయి నాకు చాలా నచ్చింది. కాకుంటే ఒక్కషరతు. ఒక్క పైసా కూడా కట్నము నా కివ్వ కూడదు. అది నన్ను అవమాన పరచినట్లే అని కుర్రతనపు వుద్రేకంతో చెప్పేశాడుఅంతానిశ్శబ్దమయిపోయారు.
వెంటనే అమ్మాయి తరపు ఆడవారు చుట్టాలు అమ్మాయి తండ్రిని లోనకు పిలచారు. అబ్బాయిని చూస్తే చక్కగానే వున్నాడు. ఆస్థిపరుడు. ఒక్కగా నొక్కబిడ్డ. అన్నీ వున్నాకూడా కట్నం వద్దనాడంటే ? ఇదేదో తేడాగావుంది. అసలు వాడు మగతనంవున్నవాడో లేదో ? లేకుంటే ఊరికనే చేసుకుంటానని ఎందుకు తొందరపడతాడు. మనకెందుకొచ్చిన తంటా .ఈ సంబంధం ఒప్పుకోమాకు అని బోధించారు.
ఇక్కడ మనుషుల ఆలోచనలు మంచిని చెడు అని, చెడును మంచని భ్రమింపచేస్తున్నాయి . ఇది కలి పురుషుని లక్షణం . కనుక మనకు తెలిసిన ,మనమనసులో గూడుకట్టుకున్న భావాలతో కాక ఉన్నత స్తాయి కెదిగి ఆలోచనలు సాగించినప్పుడు గాని మనకు ప్రతిదానిలోనున్న మంచిబోధపడదు.
2 వ్యాఖ్యలు:
మీరు "విన్న"దాంట్లో నిజమెంతో మీకు తెలుసా? అవతల వాళ్ళ తప్పులు ఎత్తిచూపుతూ మాట్లాడితే మన పుణ్యం వారికి వాళ్ళ పాపం మనకీ సంక్రమిస్తాయని (మీరు విన్నది నిజమైనా సరే!) ఆర్యోక్తి. ఏందుకొచ్చిన గోలండీ మీకు ఇది?
సమాజములో జరుగుచున్న పోకడగురించి రచయిత వ్రాసారు అందులో తప్పు ఏముంది. మీ దృష్టికి కూడా ఇటువంటి సంఘటనలు వచ్చి వుంటాయి. అందరము మనకెందుకులే అనుకుంటే సమాజములో మార్పు ఎలా వస్తుంది. మానవ ప్రయత్నంగా మనవంతు కృషి చేయాలిగదా. మీరన్నది కొంతవరకు సమంజసమేకాని రచయిత బ్లాగును సమాజములో కొంతమార్పుకొరకు కృషిచేయుచున్నారు.మీరు సలహా ఇచ్చుచున్నపుడు దయచోసి మీ ఐడెంటిటీ తో ఇచ్చినట్లయితే ఇంకా వివరముగా దీని గురించి వ్రాసియుండే వాడిని. బాధ్యతా రాహిత్యము మీ సలహాలో గోచరమగుచున్నది.
Post a Comment