కీళ్ళ నొప్పులు – తిరోగమన చిట్కాలు
>> Friday, September 12, 2008
ప్రస్తుత కాలములో మన ఆహారపు టలవాట్లవలనైతేనేమి మన ఆహారములో మనకు తెలియకుండా పైరు నారు దశనుండే వివిధరకాలైన క్రిమి సంహారక మందులు వాడుటవలనైతేనేమి పరోక్షముగా వాటి అవశేషములు ఆహార పదార్ధములయందుండుట వలన మనకు తెలియకుండానే వాటి నుండి అనేక రుగ్మతలు మనకు సంప్రాప్తిస్తున్నాయి. అందులో ముఖ్యముగా చిన్నవయసునుండి మొదలు ముసలి వారి వరకు అందరినీ బాధించుచున్న సమస్య కీళ్ళనొప్పులు. నేను ఇక్కడ ఇస్తున్నచిట్కాలు పూర్తిగా కీళ్ళనొప్పులు తగ్గించతపోయినా కొంత ఉపశమనమైకా కలిగిస్తాయని ఆశిస్తున్నాను.
1.శొంఠిని వేడిచేసి ఒక గ్రాము మోతాదులో నేతిలో కలిపి భోజన సమనములో తినిపిస్తే కీళ్ళనొప్పులు పోతాయి.
2. నువ్వులనూనెలో వెల్లుల్లిపాయలు వేయించి పరగడుపున ఒకటిలేక రెండు తింటున్న కీళ్ళనొప్పులు, ఇతర నొప్పులు తగ్గుతాయి.
3. వెలుతురు చెట్టుబెరడు పొడిచేసి పటిక బెల్లము కలిపి రోజుకు రెండు గ్రాముల చొప్పున తీసుకుంటే నొప్పులు ఉపశమిస్తాయి.
4. వాతపు నొప్పులకు శొంఠి , కరక్కాయ పొడిని ఒక స్పూను మోతాడులో రోజుకు రెండుసార్లు తీసుకుంటే తగ్గుతాయి.
5. నడుము నొప్పికి ఆముదపుగింజలు పొట్టుతీసి నూరి పాలతో కలిపి కాచి వడగట్టి రాత్రి తీసుకోవాలి.
6. నువ్వులనూనె, నిమ్మరసము సమానముగా తీసుకుని బాగా చిలికి పైపూతగా వాడి, వేడి నీటితో కాపడం పెట్టిన కీళ్ళనొప్పులు తగ్గుతాయి.
7. పసుపు సున్నము కలిపి ఉడికించి రాత్రి పడుకునేటప్పుడు పట్టులాకా వేస్తే కీళ్ళనొప్పులు తగ్గుతాయి.
8.ఆముదపు పప్పు, శొంఠి, పంచదార సమానంగా కలిపి తీసుకుంటే కీళ్ళనొప్పులు తగ్గుతాయి.
ఇంకా బహుకాలమునుండి బాధించుచున్న కీళ్ళనొప్పులకు పై చెప్పిన చిట్కాలతోపాటు యోగా మరియు కొన్ని రకములైన ఆసములతో దూరము చేసుకొనవచ్చును. ఏది ఏమైనా యోగా మరియు యోగాసనములు తెలిసిన గురువుల సమక్షములో మాత్రమే చేయాలు.బజారులో దొరికిన పుస్తకములు కొనుక్కుని వాటిసహాయముతే యోగాసనములు చేయకూడదు. అటువంటి ఆలోచనఉంటే విరమించుకుని మంచి గురువు సమక్షములో చేయుట మంచిదని నా అభిప్రాయము
1 వ్యాఖ్యలు:
మంచి సూచనలు దుర్గేశ్వరా,మరిన్ని అందించగలరు
Post a Comment