వెంట్రుకలు రాలకుండా
>> Friday, September 12, 2008
1. విటమిన్ ఇ ఎక్కువగా ఉండే నువ్వులనూనెను తలకు బాగా పట్టించి కొంచెం సేపయినతరువాత గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తే క్రమంగా జుట్టు ఊడిపోవడం తగ్గుతుంది.
2. మందార పువ్వులను కొబ్బరినూనె లేక నువ్వుల నూనెలో వేసి కాచి ఆనూనెను వెంట్రుకలకు పట్టించి 1 గంట తరువాత కుంకుడు రసంతో స్నానం చేస్తే వెంట్రుకలు రాలడం తగ్గుతుంది.
3.మందార ఆకులను మెత్తగా నూరి తలకు బాగా పట్టించి కొంచెముసేపు ఆగి తరువాత తలస్నానం చేస్తే జుట్టు ఊడదు.
4. ఉసిరిక రసం తీసి తలకి రాస్తే వెంట్రుకలు ఊడడం తగ్గి, జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
5. దోస గింజలు ఎండబెట్టి దంచి నూనె తీసి, ఆనూనెను నిమ్మరసంతో కలిపి తలకు రాస్తే వెంట్రుకలు రాలుట తగ్గుతుంది.
6. చేమ దుంపల రసం తీసి తలకు రాస్తే జుట్టుఊడుట తగ్గుతుంది.
7. నాలుగు టీ స్పూన్ల కొబ్బరి పాలలో ఒక స్పూను నిమ్మరసం కలిపి దానిని తలకు బాగా పట్టించి కొంత సెపయినతరువాత తల స్నానం చేస్తే జుట్టు రాలిపోదు.
ముఖ్య గమనిక :- జుట్టు ఆరోగ్యానికి సాధ్యమైనంతవరకు షాంపూల జోలికి పోకుండుట మంచిది. కొంచెము శ్రమ అనుకోకుండా కుంకుడాకాయల రసంతోకాని, సీకాయరసంతోకాని తల స్నానం చేయుట మంచిది.
1 వ్యాఖ్యలు:
షాంపూలకు అలవాటు పడి జుట్టు all clear అయ్యేటట్లుంది.
Post a Comment