వైభవంగ జరిగిన త్రయోదశిపూజలు.
>> Saturday, September 13, 2008
శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం లో శనిత్రయోదశి సందర్భంగా పూజలు వైభవోపేతంగ జరిగాయి. ఉదయాన్నుంచి శనిగ్రహ దేవతకు తైలాభిషేకం జరిగింది. ప్రపంచములో వివిధప్రదేశాలలో నివాసమున్న మనవారు అంతర్జాలములో ఈ పూజలగురించితెలుసుకుని తమపేరు గోత్రాలను పంపించారు. వారందరి తరపున సంకల్పములు జరిపి జన్నాభట్లఉగ్రనరసింహ, వినుకొడపురోహితులు శేఖరశాస్త్రి ,దుర్గేశ్వరరావు తదితరులు వేదసూక్తాలతో పూజాధికాలు జరిపారు. పూజలో స్వయంగాపాల్గొనాలని వచ్చిన భక్తులంతా ఎంతో భక్తిశ్రద్దలతో అభిషేకాలలో పాల్గొన్నారు. పంపించిన గోత్రనామాలతో వారి గ్రహదోషాలు తొలగాలని పూజజరిపారు.నల్లనువ్వులు,నువ్వులనూనె,బెల్లం,ఉప్పును శనిదేవునకు భక్తులతరపున సమర్పించారు
తరువాత పీఠములో వేంచేసివున్న రామలింగేశ్వరస్వామివారికి రుద్రాభిషేకములు నిర్వహించారు. మహన్యాసపూర్వకంగా జరిగిన అభిషేకములలో గంగమ్మతలపైధారలుగా దుముకుతుంటె పరవశించిపోయిన బోళాశంకరుడు భక్తులమనోభీస్టాలు తీరేలా వరాల వర్షం కురిపిస్తున్నాడా అన్నట్లు, దర్శనమిచ్చారు. పుష్పాలతోను,మారేడుదళాలతోను అర్చించి , స్వామీ మిమ్మువేడుకుంటున్న ఈ భక్తుల బాధలుబాపి, కరుణతో కాపాడమని ప్రార్ధించారు,అర్చకులు. అలాగే
శనివారము కనుక శ్రీవేంకటేశ్వరస్వామివారికి ,క్షేత్రపాలకుడయిన హనుమంతులవారికి జరిపిన పూజలలో కూడా వచ్చిన భక్తులు, గోత్రనామాలుపంపినవారి తరపున అర్చనలు సాగించారు. శుభం భూయాత్
3 వ్యాఖ్యలు:
మీరు చెప్పిన విధంగా శనిత్రయోదశిని జరుపుకున్నాను కృతజ్ఞతలు. హరేకృష్ణ.
మాష్టారు
ధన్యవాదాలు...
-భాస్కర్
Nice to visit in your site. have a nice day and Greeting's from Jakarta, Indonesia.
Post a Comment